Fake RPF SI: ఏడాది కాలంగా ఆర్పీఎఫ్‌ ఎస్సై అంటూ డ్రామా.. నల్గొండ యువతి నిర్వాకం, కేసు నమోదు-fake rpf caught in hyderabad nalgonda girl arrested case registered ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Fake Rpf Si: ఏడాది కాలంగా ఆర్పీఎఫ్‌ ఎస్సై అంటూ డ్రామా.. నల్గొండ యువతి నిర్వాకం, కేసు నమోదు

Fake RPF SI: ఏడాది కాలంగా ఆర్పీఎఫ్‌ ఎస్సై అంటూ డ్రామా.. నల్గొండ యువతి నిర్వాకం, కేసు నమోదు

Sarath chandra.B HT Telugu
Mar 20, 2024 07:07 AM IST

Fake RPF SI: ఉద్యోగం రాకపోయినా వచ్చినట్టు కుటుంబ సభ్యుల్ని నమ్మించి, ఆర్పీఎఫ్‌ ఎస్సైగా చలామణీ అవుతున్న నల్గొండ యువతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఆర్పీఎఫ్ ఎస్సైనంటూ ఏడాది కాలంగా యువతి డ్రామా
ఆర్పీఎఫ్ ఎస్సైనంటూ ఏడాది కాలంగా యువతి డ్రామా

Fake RPF SI: ఉద్యోగ ప్రయత్నంలో విఫలమైన ఓ యువతి, ఆర్పీఎఫ్‌ RPF ఎసై అవతారం ఎత్తింది. కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారిని నమ్మించింది. ప్రభుత్వ ఉద్యోగం Govt job రాకపోయినా ఉద్యోగం వచ్చినట్టు ఏడాది పాటు డ్రామా నడిపించింది. యూనిఫాం కుట్టించుకుని రోజూ విధులకు హాజరవుతున్నట్లు ఇంటి నుంచి వెళ్లేది. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడు ఆరా తీయడంతో గుట్టు బయట పడింది.

ఆర్పీఎఫ్‌ ఎస్సైనంటూ ఏడాది కాలంగా డ్రామా Drama ఆడుతున్న యువతి నిర్వాకం ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడి విచారణలో బయట పడింది. యువతి గురించి ఆరా తీయడంతో ఆ పేరుతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ ఎస్సైలు ఎవరు లేరని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీగలాడితే యువతి నిర్వాకం మొత్తం బయట పడింది. రైల్వేభద్రతా దళం Railway Protection force లో ఎస్సై ఉద్యోగం రాకున్నా వచ్చినట్లు నమ్మించేందుకు మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు.

నిందితురాలు కొన్ని నెలలుగా ఆర్పీఎఫ్‌ సిబ్బంది యూనిఫాం వేసుకుని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(RPF) ఎస్సైలా తిరుగుతోంది. అందర్నీ నమ్మించడానికి రైళ్లలో తనిఖీలు కూడా చేసేది. చివరకు బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లు, వేడుకలకు అలాగే వెళ్లేది. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే దానికి కూడా ఖాకీ డ్రెస్సులోనే హాజరైంది.

పెళ్లి సంబంధం ఖరారు చేసుకునే క్రమంలో ఆమె గురించి పెళ్లి కొడుకు ఆరా తీయడంతో అసలు సంగతి బయటపడింది. ఆమె ఆర్పీఎఫ్‌ ఉద్యోగి కాదని నిర్ధారణైంది. దాదాపు ఏడాది కాలంగా ఎస్సైలా నటిస్తోందని గుర్తించారు.

సికింద్రాబాద్‌ Secunderabad ప్రభుత్వ రైల్వే పోలీస్ డీఎస్పీ శ్రీనివాసరావు, హైదరాబాద్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌తో కలిసి రైల్వే ఎస్పీ షేక్‌ సలీమా కేసు వివరాలు ప్రకటించారు. నల్గొండ Nalgonda జిల్లా నార్కట్‌పల్లికి చెందిన జడల యాదయ్య కుమార్తె మాళవిక(24) హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో రెండేళ్ల క్రితం ఎమ్మెస్సీ పూర్తి చేసింది. యాదయ్య కూతుర్ని ఎస్సైగా చూడాలని కోరడంతో పరీక్షలకు సిద్ధమైంది.

డిగ్రీ పూర్తైన వెంటనే 2018లో ఆర్పీఎఫ్‌ ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. ఆ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. ప్రాథమిక ఫలితాలు రాగానే తనకు ఉద్యోగం వచ్చేసిందని తల్లిదండ్రులతో పాటు బంధువులు, చుట్టుపక్కల అందరికీ చెప్పింది. అప్పటికీ తుది ఫలితాలు వెల్లడి కాలేదు. ఆమెకు కంటిచూపులో లోపం ఉండటంతో మెడికల్ పరీక్షల్లో విఫలమైంది. దీంతో ఉద్యోగానికి ఎంపిక కాలేదు.

తల్లిదండ్రులకు విషయం తెలిస్తే బాధపడతారని వారికి ఆ సంగతి చెప్పలేదు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉద్యోగం వచ్చిందని వారిని నమ్మించింది. ఎల్‌బీ నగర్‌లోని ఓ టైలర్‌ షాపులో ఆర్పీఎఫ్‌ ఎస్సై డ్రెస్‌ కుట్టించుకుంది. నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకుని ఆర్పీఎఫ్‌ ఎస్సైగా చలామణీ కావడం మొదలు పెట్టింది.

సికింద్రాబాద్‌లో స్టోర్స్‌లో ఆర్పీఎఫ్‌ లోగో స్టార్స్‌, షోల్డర్‌ బ్యాడ్జీలు, బెల్టు కొనుగోలు చేసిన్టు గుర్తించారు. యూనిఫాంతో వీటన్నింటినీ ధరించి ఏడాదిగా ఎస్సైలా నటిస్తోంది. నిత్యం ఇంటి నుంచి ఆర్పీఎఫ్‌ యూనిఫాంలో బయలుదేరి నల్గొండ నుంచి సికింద్రాబాద్‌ వరకు రైల్లో ప్రయాణించేది. దారిలో ఆర్పీఎఫ్‌ ఎస్సైనని తనిఖీలు కూడా చేసేది.

ఆమె ప్రయాణించిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో తరచూ తనిఖీలు చేసినట్టు గుర్తించారు. నల్గొండలో బంధువుల ఇళ్లలో జరిగిన పలు శుభకార్యాలకూ కూడా ఆర్పీఎఫ్‌ యూనిఫాంలోనే వెళ్లింది. నల్గొండలో ఓ సంస్థ నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొని ప్రసంగించింది. నిర్వాహకులు ఆమెకు సన్మానం కూడా చేశారు. స్థానిక ప్రముఖులు, డీసీపీ స్థాయి అధికారుల్ని కూడా ఎస్సైనంటూ పరిచయం చేసుకుంది. యూనిఫాం ధరించి రీల్స్‌ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసినట్టు గుర్తించారు.

ఇటీవల ఓ యువకుడితో పెళ్లి కుదరడంతో ఆమె డ్రామా క్లైమాక్స్‌కు వచ్చింది. యూనిఫాంలోనే పెళ్లి చూపులకు వెళ్లింది. ఆమెతొో పెళ్లి కుదరడంతో యువతి గురించి వాకబు చేసే క్రమంలో ఆమె సంగతి వెలుగు చూసింది. ఆర్పీఎఫ్‌లో మాళవిక పేరుతో ఎస్సై లేరని తెలిసి అవాక్కయ్యాడు. నల్గొండ ఆర్పీఎఫ్‌ ఎస్సై, జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాళవిక కదలికలపై నిఘా పెట్టారు. మంగళవారం స్టేషన్‌కు వచ్చిన సమయంలో జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేసి.. రిమాండుకు తరలించారు.

Whats_app_banner

సంబంధిత కథనం