TS Cop Carries Devotee : నల్లమల కొండల్లో 4 కి.మీ భక్తురాలిని వీపుపై మోసిన కానిస్టేబుల్-nallamala saleshwaram jatara ts cop carries devotee on terrain 4 kilometers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Cop Carries Devotee : నల్లమల కొండల్లో 4 కి.మీ భక్తురాలిని వీపుపై మోసిన కానిస్టేబుల్

TS Cop Carries Devotee : నల్లమల కొండల్లో 4 కి.మీ భక్తురాలిని వీపుపై మోసిన కానిస్టేబుల్

Bandaru Satyaprasad HT Telugu
Apr 27, 2024 04:25 PM IST

TS Cop Carries Devotee : నల్లమల సళేశ్వరం జాతరకు వచ్చిన ఓ వృద్ధురాలిని కానిస్టేబుల్ నాలుగు కిలోమీటర్లు వీపుపై మోశారు. కొండల్లో వృద్ధురాలి ఇబ్బందులు చూసి తాను ఈ పనిచేసినట్లు కానిస్టేబుల్ చెప్పారు.

భక్తురాలిని వీపుపై మోసిన కానిస్టేబుల్
భక్తురాలిని వీపుపై మోసిన కానిస్టేబుల్

TS Cop Carries Devotee : తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా పేరొందిన నల్లమల సళేశ్వరం(Nallamala Saleshwaram) జాతర వైభవంగా జరుగుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సళేశ్వరుడి దర్శనానికి వస్తున్నారు. దట్టమైన నల్లమల(Nallamala Forest) అటవీ ప్రాంతంలో, కొండలు గుట్టలు దాటుతూ సళేశ్వరుడిని దర్శించుకుంటున్నారు. లోయల్లో కాలి నడకన కర్రల సాయంతో భక్తులు ప్రయాణించాల్సిందే. అయితే ఓ భక్తులు కొండపైకి ఎక్కేందుకు ఇబ్బంది పడుతుంటే ఓ కానిస్టేబుల్ (TS Police)ఔదార్యం చాటుకున్నాడు. భక్తురాలిని తన వీపుపైకి (TS Cop Cop Carries Devotees))ఎక్కుంచుకుని కొండపైకి తీసుకెళ్లారు. ఆయన గతంలో ఓ తొక్కిసలాట సమయంలో గాయపడిన ఇద్దరు భక్తులను తన భుజాలపై వేసుకుని వారిని రక్షించారు.

భక్తురాలిని నాలుగు కిలోమీటర్ల మోసిన కానిస్టేబుల్

అచ్చంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన రమావత్ రామదాస్(Constable Ramavath Ramdas) అనే కానిస్టేబుల్ నల్లమల అడవిలో సళేశ్వరం ఆలయం వద్ద భద్రత సిబ్బందిగా ఉన్నారు. నాగర్ కర్నూల్ కు చెందిన ఓ వృద్ధ భక్తురాలు కొండపైకి ఎక్కేందుకు ఇబ్బంది పడుతుంటే..నా వీపుపై ఎక్కించుకుని నాలుగు కిలోమీటర్లు తీసుకెళ్లారు. 70 ఏళ్ల భక్తురాలు సళేశ్వరుడి దర్శనం తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుండగా... కొండపైకి ఎక్కేందుకు ఆమె కష్టపడడాన్ని గమనించారు కానిస్టేబుల్ రాందాస్.

కానిస్టేబుల్ కు ప్రశంసలు

"మేము చాలా పేదవాళ్లం, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను అన్ని రకాల కూలి పనులు చేయాల్సి వచ్చింది. ఈ పక్కనే ఉన్న మన్ననూర్ గ్రామం మాది. జాతర సమయంలో జనరేటర్ సెట్ ను ఏర్పాటు చేయడానికి పనిచేసేవాడిని. జాతర సమయంలో భారీ జనరేటర్ల(Genset)ను కొండ ప్రాంతాల్లోకి తీసుకెళ్లేందుకు నేను పనిచేసేవాడిని" అని కానిస్టేబుల్ రామదాస్ చెప్పారు. భక్తురాలిని నాలుగు కిలోమీటర్ల కొండల్లో తీసుకెళ్లిన కానిస్టేబుల్ రామదాస్ ను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

నల్లమల సళేశ్వర క్షేత్రం

నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అడవులలో సళేశ్వరం(Nallamala Saleshwaram Temple) క్షేత్రం ఉంది. ప్రధాన రహదారి నుంచి 30 కి.మీకుపైగా లోపలకి వెళ్లాలి. ఆ తర్వాత 5 కిమీ వరకు నడవాల్సి ఉంటుంది. లోయలో ఉన్న సళేశ్వరుడి దర్శనానికి రాళ్లు, రప్పలు,కొండలు, గుట్టలు కర్రల సాయంతోనే నడవాల్సి ఉంటుంది. ఇదే ప్రాంతంలో నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కూడా కనిపిస్తుంది. సళేశ్వరుడి కొలువుదీరిన ప్రాంతంలో పై నుంచి నీటి దార ప్రవహిస్తుంది. చాలా ఎత్తైన ప్రాంతం నుంచి ఈ జలాలు వస్తాయి. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి సళేశ్వరుడిని దర్శించుకుంటారు.

ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి సందర్భంగా ఇక్కడ జాతర నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే యాత్ర ఏప్రిల్ 25వ తేదీతో ముగిసింది. గతంతో పోల్చితే ఈ ఏడాది యాత్రికుల సంఖ్య తగ్గిందని అధికారులు తెలిపారు. గతంలో కేవలం మూడు రోజులు మాత్రమే దర్శనానికి అనుమతించేవారు. కానీ ఇప్పుడు ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. దఫాల వారీగా ఇక్కడికి యాత్రికులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ఈసారి జాతరకు యాత్రికుల సంఖ్య కొంతమేర తగ్గింది.

సంబంధిత కథనం