Chaitra pournami 2024: చైత్ర పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఈ పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి?
Chaitra pournami 2024: చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి? ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి అనే వివరాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
Chaitra pournami 2024: చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్దాంత పంచాంగ గణితం ఆధారంగా చైత్ర మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి 23 ఏప్రిల్ 2024 మంగళవారం రోజు వచ్చింది. చైత్ర శుద్ద పౌర్ణమి లేదా మదన పూర్ణిమగా దీని గురించి చెప్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ రోజున పరమేశ్వరుడిని, విష్ణువుని, హనుమంతుడిని పూజించాలని చిలకమర్తి తెలియచేశారు. ఈ పౌర్ణమి రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. దశరథ మహారాజు పుత్ర కామేష్టి యాగాన్ని చేయడంతో పాటు, మదన పౌర్ణమినాడు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించి, కుమారులను పొందారని చెబుతారు.
కృష్ణ పక్షంలో సాధారణంగా పర్వదినములు అరుదు. అయినా చైత్ర కృష్ణ త్రయోదశి శతభిషా నక్షత్రంలో వస్తే వారుణి అనే శుభయోగం శనివారం, శతభిషతో కలిస్తే మహావారుణి అని శాస్త్రం. చైత్ర కృష్ణ చతుర్దశిన శివసన్నిధిలో స్నానం చేసినా మంగళవారంతో కూడిన చతుర్దశి నాడైతే గంగాస్నానం చేసినా పిశాచత్వం నశిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మదన పూర్ణిమ రోజు రామాయణ పారాయణం శుభ ప్రదం. మదన పూర్ణిమ రోజు సాయంత్రం దీపాలు వెలిగించడం చాలా మంచిది అని చిలకమర్తి తెలిపారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి అనువైన రోజు మదన పూర్ణిమ రోజు.