ICAI CA Inter, Final results: సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాల వెల్లడి; సీఏ ఇంటర్ టాపర్ హైదరాబాద్ స్టుడెంట్ గోకుల్ సాయి శ్రీకర్
ICAI Inter, Final Results 2023: మే నెలలో జరిగిన సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్ష ఫలితాలను ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (Institute of Chartered Accountants of India ICAI) బుధవారం విడుదల చేసింది. విద్యార్థులు ఆ ఫలితాలను icai.nic.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
ICAI Inter, Final Results 2023: మే నెలలో జరిగిన సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్ష ఫలితాలను ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (Institute of Chartered Accountants of India ICAI) బుధవారం విడుదల చేసింది. విద్యార్థులు ఆ ఫలితాలను icai.nic.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర లాగిన్ వివరాలతో రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు.
Top ranker Hyderabadi: టాప్ ర్యాంకర్ హైదరాబాద్ వాసి
సీఏ ఫైనల్ (CA Final) పరీక్షలో మొత్తం 800 మార్కులకు గానూ, 616 మార్కులు సాధించిన అహ్మదాబాద్ కు చెందిన అక్షయ్ రమేశ్ తొలి ర్యాంక్ ను సాధించాడు. రెండో ర్యాంక్ ను చెన్నైకి చెందిన కల్పేశ్ జైన్ సాధించాడు. కల్పేశ్ మొత్తం 800 మార్కులకు గానూ 603 మార్కులు పొందాడు. సీఏ ఇంటర్ (CA Inter) లో మొదటి ర్యాంక్ ను హైదరాబాద్ కు చెందిన వై గోకుల్ సాయి శ్రీకర్ సాధించాడు. శ్రీకర్ కు సీఏ ఇంటర్ పరీక్షలో మొత్తం 800 మార్కులకు గానూ, 688 మార్కులు వచ్చాయి. రెండో ర్యాంక్ ను 682 మార్కులతో పటియాలాకు చెందిన నూర్ సింగ్లా, మూడో ర్యాంక్ ను 678 మార్కులతో ముంబైకి చెందిన కావ్య సందీప్ కొఠారీ సాధించారు.
ఫలితాలను చెక్ చేసుకోవడం ఎలా?
మే నెలలో జరిగిన ఏసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలను రాసిన విద్యార్థులు తమ ఫలితాలను ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ icai.nic.in లో చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ icai.nic.in ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీ పై కనిపించే ఇంటర్ రిజల్ట్ (Inter result), లేదా ఫైనల్ రిజల్ట్ (Final result) లింక్ ల్లో మీరు ఫలితాలు చూడాలనుకునే లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్ లను ఎంటర్ చేయాలి.
- స్క్రీన్ పై మీ రిజల్ట్ ఉన్న పేజీ డిస్ ప్లే అవుతుంది.
- రిజల్ట్ ను చెక్ చేసుకుని, ఆ పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి.
- భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ పేజీని ప్రింట్ తీసుకుని పెట్టుకోవాలి.
- సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ పరీక్షలు 2023 మే 2వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు జరిగాయి.