Google Meet: సరికొత్త ఫీచర్లతో రానున్న గూగుల్ మీట్
Google Meet: టెక్ దిగ్గజం గూగుల్ తన వీడియో కాన్ఫరెన్స్ టూల్ గూగుల్ మీట్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
Google meet: గూగుల్ తన వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్ గూగుల్ మీట్‌లో కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. గూగుల్ డుయో ఫీచర్స్ అన్నింటినీ ఇప్పుడు గూగుల్ మీట్‌లో తెస్తూ డుయో, మీట్‌లను సింగిల్ ప్లాట్‌ఫారమ్‌గా విలీనం చేయనున్నట్టు ఇటీవలే ధ్రువీకరించింది.
మీట్ యూజర్లకు కేవలం వీడియో కాలింగ్ సదుపాయం మాత్రమే కాకుండా షెడ్యూలింగ్, జాయినింగ్ మీటింగ్స్, వర్చువల్ బ్యాక్ గ్రౌండ్స్, ఇన్-మీటింగ్ చాటింగ్ తదితర పలు కొత్త సదుపాయాలను అందిస్తున్నట్టు గూగుల్ తెలిపింది.
గూగుల్ మీట్‌లో లైవ్ షేరింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా యూజర్లు తమ తమ సమావేశ విరామాలను వినోదాత్మకంగా తీర్చిదిద్దవచ్చని గూగుల్ తెలిపింది.
రికరింగ్ షెడ్యూలు టైమ్‌తో క్లాస్‌మేట్స్‌ను కనెక్ట్ అవ్వొచ్చని, లేదా ఇన్‌స్టంట్ వీడియో కాల్ సదుపాయంతో అప్పటికప్పుడు స్నేహితులతో సంభాషించవచ్చని గూగుల్ తన బ్లాగ్ పోస్టులో తెలిపింది.
గూగుల్ మీట్ యూజర్స్ మీటింగ్‌కు ముందే తమ బ్యాక్‌గ్రౌండ్‌కు విజువల్ ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు. మీటింగ్ జరుగుతుందగా చాట్ చేయొచ్చు. ఈ సౌకర్యం మీటింగ్‌లో పార్టిసిపెంట్ల భాగస్వామ్యం మరింత పెరుగుతుందని గూగుల్ తెలిపింది. లైవ్ షేర్ ఫీచర్ కారణంగా కంటెంట్‌పై పార్టిసిపెంట్లు ఇంటరాక్ట్ అవ్వొచ్చని వివరించింది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఉమ్మడిగా యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చని, స్పాటిఫై మీద ప్లేలిస్ట్ క్యూరేట్ చేయొచ్చని వివరించింది. ఈ ఫీచర్ ఒక ఐస్ బ్రేకర్ సెషన్‌లా కూడా పనిచేస్తుందని వివరించింది.
ఈ వీడియో కాలింగ్ ప్లాట్‌ఫామ్‌పై మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు గూగుల్ ప్రకటించింది. యూజర్లు ఇంటరాక్ట్ అయ్యేందుకు, కనెక్ట్ అయ్యేందుకు వీలుగా, ఏ డివైజ్‌లోనైనా ఎక్కడైనా కనెక్ట్ అయి తమ అనుభవాలు పంచుకునేందుకు వీలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్టు తెలిపింది.
అయితే ఈ గూగుల్ మీట్ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవాలని, లేటెస్ట్ వెర్షన్ అప్ డేట్ చేసుకోవాలని కోరింది.