Google down : ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సేవలకు అంతరాయం!
Google down : గూగుల్ సేవలకు మంగళవారం ఉదయం అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది.. గూగుల్‌ను వినియోగించుకోలేకపోతున్నట్టు సమాచారం.
Google down : ప్రపంచవ్యాప్తంగా.. మంగళవారం ఉదయం గూగుల్ సేవలకు అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది. అనేకమంది.. గూగుల్‌ని వినియోగించుకోలేకపోతున్నట్టు సమాచారం.
ఇలాంటి ఔటేజ్‌లను ట్రాక్ చేసే డౌన్‌డిటెక్టర్.. ఈ విషయాన్ని వెల్లడించింది. గూగుల్ సేవలు వినియోగించుకోలేకపోతున్నట్టు ఇప్పటికే 40వేల ఫిర్యాదులు అందినట్టు వెల్లడించింది.
ఈ వ్యవహారంపై గూగుల్ ఇంకా స్పందించలేదు.
పేటీఏం డౌన్..
ఈ విధంగా.. ప్రముఖ సైట్ల సేవలు నిలిచిపోవడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. ఇటీవలే.. దేశంలో పేటీఎం సేవలకు కొన్ని గంటల పాటు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆన్లైన్ యాప్స్ సేవలను పరిశీలించే డౌన్డిటెక్టర్రు శుక్రవారం ఉదయం 10గంటల నాటికే 611 ఫిర్యాదులు అందాయి. ఫేటీఎం పనిచేయడం లేదని 66శాతం మంది వినియోగదారులు పేర్కొన్నారు. యాప్‌లో సమస్యలు ఉన్నట్టు 29శాతం మంది పేర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై , బెంగళూరు వంటి నగరాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.
పేటీఎంలో తలెత్తిన సమస్యలను ఉదయం 11:30 సమయంలో సంస్థ పరిష్కరించింది.
సంబంధిత కథనం