Israel Palestine war: గాజా స్ట్రిప్ లో చెల్లాచెదురుగా 15 వందల మృతదేహాలు-at least 1 500 bodies of hamas militants found around gaza strip israeli army ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Israel Palestine War: గాజా స్ట్రిప్ లో చెల్లాచెదురుగా 15 వందల మృతదేహాలు

Israel Palestine war: గాజా స్ట్రిప్ లో చెల్లాచెదురుగా 15 వందల మృతదేహాలు

HT Telugu Desk HT Telugu
Oct 10, 2023 03:48 PM IST

గాజా స్ట్రిప్ చుట్టూ దాదాపు 15 వందల హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి కనిపించాయని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో వీరు చనిపోయారని తెలిపింది.

ఇజ్రాయెల్ లో హమాస్ మిలిటెంట్ల దాడుల అనంతరం దృశ్యం
ఇజ్రాయెల్ లో హమాస్ మిలిటెంట్ల దాడుల అనంతరం దృశ్యం

హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడుల అనంతరం, వెంటనే తేరుకున్న ఇజ్రాయెల్ గాజా సహా పాలస్తీనాలోని హమాస్ ఆధిపత్య ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. సరిహద్దులలో నుంచి ఇజ్రాయెల్ లోకి చొరబాటుకు ప్రయత్నిస్తున్న హమాస్ మిలిటెంట్లను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతోంది.

yearly horoscope entry point

1500 మృతదేహాలు

గాజా స్ట్రిప్ చుట్టూ దాదాపు 15 వందల మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి కనిపించాయని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి రిచర్డ్ హెచ్ వెల్లడించారు. సరిహద్దులపై ఇజ్రాయెల్ ఆర్మీ మళ్లీ నియంత్రణ సాధించిందన్నారు. సోమవారం రాత్రి నుంచి చొరబాట్లు ఏవీ చోటు చేసుకోలేదని, అయినా, తాము అత్యంత అప్రమత్తతతో ఉన్నామని తెలిపారు. సరిహద్దుకు సమీపంలో ఉన్న జనావాస ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సరిహద్దులో 35 బెటాలియన్ల సాయుధ ఇజ్రాయెల్ సైనికులు పహారా కాస్తున్నారన్నారు.

సరిహద్దును ధ్వంసం చేసి..

మొదట శనివారం హమాస్ ఇజ్రాయెల్ పైకి దాదాపు 5 వేల రాకెట్లను ప్రయోగించింది. అదే సమయంలో దాదాపు శత్రు దుర్భేద్యంగా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో ఇజ్రాయెల్ నిర్మించిన సరిహద్దును బుల్ డోజర్లతో ధ్వంసం చేసింది. ఆ భాగాల్లో నుంచి వందలాది హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ప్రజల మాన ప్రాణాలను హరించారు. రోడ్లపై, ఇళ్లల్లోకి చొరబడి ప్రజల ప్రాణాలు తీశారు. మహిళలను కిడ్నాప్ చేసి, వారిని వివస్త్రలుగా చేసి, చిత్ర హింసలు పెట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. హమాస్ దాడుల్లో దాదాపు 900 మంది ఇజ్రాయెలీలు మరణించారు. వెంటనే తేరుకున్న ఇజ్రాయెల్ హమాస్ పై తీవ్ర స్థాయిలో ఎదురుదాడిని ప్రారంభించింది.

Whats_app_banner