Milk Shakes Recipes | మిల్క్​షేక్​లంటే ఇష్టమా? ఇంట్లోనే తయారు చేసుకోండిలా..-you can beat the summer with these milkshakes and recipes are here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Milk Shakes Recipes | మిల్క్​షేక్​లంటే ఇష్టమా? ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

Milk Shakes Recipes | మిల్క్​షేక్​లంటే ఇష్టమా? ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

HT Telugu Desk HT Telugu
Apr 30, 2022 03:04 PM IST

సమ్మర్​లో మిల్క్​షేక్​లకు మంచి డిమాండ్ ఉంటుంది. సమ్మర్​ హీట్​ను బీట్​ చేసేందుకు ఎక్కువ మంది మిల్క్​షేక్​నే ఎంచుకుంటారు. అయితే ప్రతీసారి బయట దీనిని కొనాలంటే.. ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. అదే మీరు ఇంట్లో తయారు చేసుకుంటే.. తక్కువ ఖర్చులో ఇంకా హ్యాపీగా వాటిని ఆస్వాదించేయొచ్చు.

<p>మిల్క్ షేక్స్ తయారీ</p>
మిల్క్ షేక్స్ తయారీ

Milk Shakes Recipes | వేసవిలో ఆహారం కన్నా ఎక్కువ శీతల పానీయాల వైపే మనసు లాగుతుంది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మిల్క్​షేక్స్. ఎండలో తిరిగి వచ్చినా లేదా చల్లని సాయంత్రం వేళ తాగాలన్నా.. రుచికరమైన మిల్క్​షేక్​ని మనసు కోరుకుంటుంది. సరే కదా అని ఆర్డర్ ఇస్తే వందల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాని కన్నా ఇంట్లో తయారు చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. ఇంట్లోని అందరూ మంచిగా మిల్క్​షేక్​ని ఎంజాయ్ చేయవచ్చు. ఉత్తమమైన మిల్క్‌షేక్‌లను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

రోజ్ సిరప్ మిల్క్ షేక్

మీరు ఒక్కసారి గులాబి మిల్క్‌షేక్‌ని ప్రయత్నిస్తే.. మీరు మళ్లీ మళ్లీ దానితో ప్రేమలో పడతారు. వెనీలా ఐస్ క్రీంకు.. మీకు నచ్చిన రోజ్ సిరప్, ఐస్ క్యూబ్స్, పాలు కలపండి. దీనికి మంచి షేక్ ఇచ్చి.. పొడవైన గ్లాసులో పోయండి. పైన ఒక స్కూప్ ఐస్ క్రీం వేసి.. ఆనందించండి.

బనాన మిల్క్ షేక్

అరటి పండు మిల్క్‌షేక్ ఈ వేసవిలో మీరు కోల్పోతున్న శక్తిని తిరిగి ఛార్జ్ చేయడానికి సరైన పానీయం. దీని రుచి మీరు ఉపయోగించే అరటిపండ్ల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండాలనుకునే వారు.. దీనిని తయారు చేసుకోవచ్చు. అరటిపండు, ఐస్ క్యూబ్స్, పాలు, ఖర్జూరాలను కలిపి మిక్స్ చేయండి. పొడవాటి గాజులో దీనిని తీసుకుని హ్యాపీగా లాగించేయండి.

మామిడి మిల్క్ షేక్

వేసవి కాలం మామిడి పండ్లకు పెట్టింది పేరు. మామిడిలోని సహజమైన తీపి, క్రీము వాటిని మీ మిల్క్ షేక్​ను అద్భుతంగా మార్చేస్తాయి. మామిడి మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి పండిన మామిడి పండ్లు, పాలు, వెనీలా ఐస్ క్రీం కావాల్సి ఉంటుంది. మామిడి ముక్కలను పాలు, వెనిలాతో కలిపి మిక్సీ చేసుకోవాలి. దానిని ఓ గ్లాసులో పోసి.. మామిడి ముక్కలతో గార్నిష్ చేసుకుని తాగితే.. అబ్బా అనాల్సిందే.

లేత కొబ్బరితో మిల్క్ షేక్

లేత కొబ్బరితో మిల్క్ షేక్ ఏంటి అనుకుంటున్నారా? కానీ నమ్మండి ఇది ఒక్కసారి ట్రై చేస్తే ఇది మీ ఫెవరెట్​ అవుతుంది. తాజా లేత కొబ్బరిని, పాలు, కొబ్బరి నీరు, తేనె కలపి మిక్స్ చేయండి. సర్వ్ చేసుకుని.. తాగేయండి.

పిస్తా మిల్క్ షేక్

ఇది బాదం పాలు లాగా చాలా రుచిగా ఉంటుంది. నట్స్ ప్రేమికులకు ఇది చాలా నచ్చుతుంది. బ్లెండింగ్ కోసం కాల్చిన, ఉప్పు వేయని పిస్తాలను ఉపయోగించండి. పాలు, పిస్తా, వెనిలా ఐస్‌క్రీమ్‌లను తీసుకుని మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి. ఒక గ్లాసులోకి తీసి.. తరిగిన పిస్తాపప్పులు, పుదీనా ఆకులతో అలంకరించండి.

Whats_app_banner

సంబంధిత కథనం