Xiaomi 12 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో Xiaomi 12 ప్రో.. స్పెసిఫికేషన్స్ ఇవే!-xiaomi 12 pro full specification take on android flagship phones ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Xiaomi 12 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో Xiaomi 12 ప్రో.. స్పెసిఫికేషన్స్ ఇవే!

Xiaomi 12 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో Xiaomi 12 ప్రో.. స్పెసిఫికేషన్స్ ఇవే!

HT Telugu Desk HT Telugu
May 06, 2022 07:09 PM IST

Xiaomi 12 Pro: Xiaomi తన ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ షావోమీ 12 ప్రోను భారత్‌ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇక ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.

<p>Xiaomi 12 Pro</p>
Xiaomi 12 Pro

స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం Xiaomi తన కొత్త వేరియంట్ Xiaomi 12 ప్రోను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ న్యూ ఫ్లాగ్‌షిప్ ఫోన్ OnePlus 10 Pro, Samsung Galaxy S22 ఫోన్స్‌తో పోటీపడుతుంది. ఈ ఫోన్‌లో 120Hz E5 AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలతో పాటు స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Xiaomi 12 ప్రో గరిష్టంగా 120W ఫాస్ట్ వైర్డ్ ‌తో 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పని చేస్తోంది.

Xiaomi 12 ప్రో స్పెసిఫికేషన్‌లు

డిస్‌ప్లే: ఈ ఫోన్ 6.73-అంగుళాల WQHD+ (1,440x3,200 పిక్సెల్‌లు) E5 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లేలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ లేయర్‌ను పిక్స్ చేశారు. ఇది LTPO సాంకేతికతతో పని చేస్తోంది. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిచారు . డిస్‌ప్లే డాల్బీ విజన్, HDR10+కి సపోర్ట్ చేస్తోంది. Xiaomi 12 Pro.. octa-core Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌తో చాలా వేగంగా ఆపరేట్ అవుతుంది.

స్టోరేజ్: ఇక ఈ ఫోన్‌ స్టోరేజ్ విషయానికి వస్తే.. 8GB, 12GB RAM వేరియంట్‌లలో 256GB స్టోరేజ్‌తో రూపొందించారు. బడ్జెట్‌ను బట్టి RAM ఎక్సటెన్షన్ ఉంటుంది.

కెమెరా: ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్‌‌తో ఉండగా ఇది సోనీ IMX707 సెన్సార్‌తో పని చేస్తోంది ఇది కాకుండా,  50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్ కెమెరాలను  కూడా ఈ ఫోన్‌లో అమర్చారు. ఇక సెల్ఫీ కెమెరా 32 MPలును కలిగి ఉంది. వెనుక కెమెరా నుండి 8K నాణ్యతతో వీడియో రికార్డ్ చేయవచ్చు.

బ్యాటరీ: Xiaomi 12 ప్రోలో 4600mAh బ్యాటరీ బ్యాకప్‌‌ను అందించారు. ఇది 120W  హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ 50W వైర్‌లెస్ టర్బో ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం