World Listening Day 2022 । ఏమండోయ్.. ఇది విన్నారా? ఈరోజు ప్రపంచ శ్రవణ దినోత్సవం!
నేను ఉన్నాను, నేను విన్నాను.. అని చెబుతుంటారు. అంటే ఒకరు మన మాట వింటే అది ఎంత ఉపయోగమో అది తెలుపుతుంది? మరి మీరు వింటున్నారా? అసలేంటి ఈ గోల అనుకుంటున్నారా? ఈరోజు World Listening Day 2022. ఇది ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోండి.
మీరు వింటున్నారా? ఏం వినాలి.. ఎందుకు వినాలి అనుకుంటున్నారా? నిశబ్ధ వాతావరణంలో కూడా మనసు పెట్టి వింటే ఎన్నో శబ్దాలు వినిపిస్తాయి. పక్షుల కిలకిల రావాలు, వీచే గాలి నుంచి వచ్చే శబ్దం, చెట్ల కొమ్మలు ఊగినపుడు వచ్చే శబ్దం, కళ్లు మూసుకొని మీ అంతరాత్మను గమనిస్తే మీ గుండె చేసే శబ్దం ఇలా ఎన్నో ఉంటాయి.
ప్రకృతిని ఆస్వాదించడం అంటే కేవలం అందమైన దృశ్యాన్ని చూడటం మాత్రమే కాకుండావినడం కూడా చేయాలి. అప్పుడే పరిపూర్ణతత లభిస్తుంది. దాని నుంచి కొన్ని విషయాలు గ్రహించవచ్చు. ఓర్పుగా వినటం కూడా ఒక కళ. ఇలా వినడం ద్వారా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతూ ప్రతి ఏడాది జూలై 18న ప్రపంచ శ్రవణ దినోత్సవం (World Listening Day) గా నిర్వహిస్తున్నారు.
ఈ రోజును జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం వినడం, ఓర్పుగా వినటాన్ని సాధన చేయడం. తద్వారా ప్రపంచంలోని సంస్కృతులు, సమాజాలు, పర్యావరణం, నాగరికతలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. మనిషి అలాగే ప్రకృతి మధ్య సంబంధాన్ని మరింత లోతుగా విశ్లేషించుకోవడం. ఆ సంబంధంలోని అంతర్లీన అంశాలను అర్థం చేసుకోవడం దీని ఉద్దేశ్యం.
ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యత
ప్రతి శబ్దంలో ఒక స్వరం ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది. ఇలా శబ్దాలను అధ్యయనం చేయటానికి అంటూ ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. శ్రవణంలోని ప్రాముఖ్యత, దీని విలువను గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. శ్రవణ నైపుణ్యాలను మెరుగుపరచడం, క్లిష్టమైన సౌండ్‌స్కేప్‌లను కాపాడుకోవడంపై ప్రపంచ దృష్టిని ఆకర్షించటానికి ఏర్పాటుచేశారు. ప్రజలు చూడటం, మాట్లాడటం, రుచి, వాసనలు గ్రహించటం ఎలాగో వినడం ద్వారా కూడా వారి ఇంద్రియాలను సక్రియం చేసుకోవచ్చు.
కెనడియన్ స్వరకర్త, ఎకౌస్టిక్ పర్యావరణవేత్త అయిన రేమండ్ ముర్రే షాఫెర్ పుట్టినరోజును పురస్కరించుకుని జూలై 18న వరల్డ్ లిజనింగ్ డే జరుపుకోవడం ప్రారంభమైంది.
వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఓర్పుగా
వినడం ద్వారా కొత్తగా ఏదైనా నేచుకోవచ్చు. ఇది బలమైన సంఘర్షణను పరిష్కరించగలుగుతుంది. సంబంధాలను పెంచుతుంది. ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. సమస్యలను గుర్తించడానికి లేదా ఎదురుచూడడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మరింత జ్ఞానాన్ని పెంపొందించడానికి మీకు సహాయపడుతుంది. అందుకే చెప్పేది వినాలి అని చెబుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్