Chocolate Day । చాక్లెట్ రసగుల్లా.. నోరూరించేలా ఇలా చేసుకోవచ్చు!
World Chocolate Day 2022 | కొందరికి చాక్లెట్లంటే ఇష్టం ఉంటుంది, మరికొందరికి రసగుల్లా అంటే నోరూరుతుంది. ఈ రెంంటిని కలిపి చాక్లెట్ రసగుల్లా చేస్తే అది ఇంకా టేస్టీగా ఉంటుంది. అదెలాగో ఇక్కడ రెసిపీ ఉంది. ట్రై చేయండి.
మద్యం అతిగా సేవించేవారిని ఆల్కాహాలిక్ అంటారు, మరి చాక్లెట్లను అతిగా తినేవారిని ఏమంటారో తెలుసా? చాకోలిక్స్ అంటారు. కొంత మందికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలకు చాక్లెట్స్ తినడం అంటే చాలా క్రేజ్. అమ్మాయిలకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక మంచి చాక్లెట్ ను కూడా ఇవ్వవచ్చు. అంతేకాదు పీరియడ్స్ సమయంలో డార్క్ చాక్లెట్ తింటే నొప్పి నుంచి ఉమశమనం లభిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.
తియ్యని రుచితో వివిధ రకాల ఫ్లేవర్స్ తో లభించే చాక్లెట్లు మనం జరుపుకునే వేడుకల్లో భాగం అవుతాయి. అందంగా ఉండేవారిని చాక్లెట్ గార్ల్, చాక్లెట్ బోయ్, రసగుల్లా అంటూ పోలుస్తారు కూడా. సరే, ఏదైతేనేం జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవం (World Chocolate Day) సందర్భంగా మీకు ఒక స్పెషల్ చాక్లెట్ రెసిపీని పరిచయం చేస్తున్నాం. దానిపేరే చాక్లెట్ రసగుల్లా. ఒకసారి క్యాలరీల గురించి చింతించడం మరచిపోండి, మధురమైన రుచిలో మైమరిపోండి. చాక్లెట్ రసగుల్లా ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
- చిక్కని పాలు 1/2 లీటర్
- నిమ్మరసం 4 టీస్పూన్లు
- కోకో పౌడర్ - 4 టీస్పూన్లు
- పంచదార- 1 కప్పు
- పిస్తా - 2 టీస్పూన్లు
తయారీ విధానం
- ముందుగా పాలు వేడి చేసి అందులో నిమ్మరసం పిండాలి. దీంతో పాలు విరిగిపోయి పనీర్ లాగా తయారవుతుంది.
- ఆ తర్వాత చల్లటి నీరుపోసి ఫిల్టర్ ద్వారా నీటిని తీసేసి పనీర్ వడకట్టాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
- పనీర్ లో కోకో పౌడర్ కలపండి. కోకోపౌడర్ మొత్తం కలిసిపోయేలా మిశ్రమాన్ని బాగా కలపండి.
- ఆపై ఈ కోకోపౌడర్ పనీర్ ను ముద్దలుగా చేసుకొని పక్కనపెట్టండి.
- ఇప్పుడు కొన్ని నీటిని వేడిచేసి అందులో శక్కరి వేసి షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి.
- ఈ వేడివేడి షుగర్ సిరప్ లో పనీర్ బాల్స్ వేసుకొని 5-10 నిమిషాలు ఉడికించండి.
- అనంతరం చల్లబరిచి పిస్తా పలుకుల తురుమును పైనుంచి చల్లి ఫ్రీజర్లో ఉంచండి.
అంతే, రుచికరమైన చాక్లెట్ రసగుల్లాలు రెడీ అయినట్లే.. చల్లగా ఉన్నప్పుడు తినండి.
సంబంధిత కథనం