Women Safety | మహిళలే వారి టార్గెట్.. భయపడి అంతా ఇచ్చేస్తున్నారు!-women safety cyber crime prevention against women and children ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women Safety | మహిళలే వారి టార్గెట్.. భయపడి అంతా ఇచ్చేస్తున్నారు!

Women Safety | మహిళలే వారి టార్గెట్.. భయపడి అంతా ఇచ్చేస్తున్నారు!

Rekulapally Saichand HT Telugu
Feb 28, 2022 04:26 PM IST

Women Safety.. నేటి డిజిటల్ ప్రపంచంలో ఒక్క క్లిక్‌తో ఏ సమాచారాన్ని అయినా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అయితే డిజిటల్ వినియోగం పెరిగిన కొద్దీ వాటిని ఆధారంగా చేసుకుని దోచుకునే నేరగాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలే లక్ష్యంగా వీళ్లు ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు.

<p>డిజిటల్ ప్రపంచంలో మహిళల రక్షణకు పొంచి ఉన్న ముప్పు</p>
డిజిటల్ ప్రపంచంలో మహిళల రక్షణకు పొంచి ఉన్న ముప్పు

ఇంటర్నెట్‌లో సైబర్ క్రైమ్ (Cyber crime) బ్లాక్ స్పాట్‌గా మారింది. సైబర్ నేరాలు రోజుకో కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. దాదాపు ప్రపంచం మొత్తం సైబర్ నేరాల వల్ల ఇబ్బంది పడుతోంది. దీంతో వాటిని నిరోధించే మార్గాలపై దృష్టి సారించారు. అయినప్పటికీ వాటి తీవ్రత మాత్రం ఆగడం లేదు.

ఇదీ సైబర్ నేరాల లెక్క

ఏటేటా సైబర్ ఆధారిత నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం చూస్తే 2019తో పోలిస్తే సైబర్‌ నేరాలు 2020లో 11.8 శాతం వరకు పెరిగాయి. 2019లో 44,735 నమోదు కాగా, 2020లో 50,035 వరకు నమోదయ్యాయి. వివిధ నేరాలకు సంబంధించిన కేసులను పరిశీలించినప్పుడు 60.2% వరకు సైబర్‌ మోసాలకు చెందిన కేసులే ఉన్నాయి. సైబర్ నేరాల విషయంలో అమెరికా, జపాన్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. 

ఫిర్యాదుకు వెనుకాడుతున్న మహిళలు

సైబర్ క్రైమ్‌ల బారిన పడిన మహిళలు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, భారత్‌లో కేవలం 35 శాతం మంది మహిళలే తమపై జరిగిన సైబర్ నేరాలపై ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ బాధితుల్లో 46.7 శాతం మంది మహిళలు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. వీటిలో ఎక్కువగా లైంగికపరమైన నేరాలు ఉన్నాయి. 

పరువు కోసం మహిళలు ఫిర్యాదు చేయడానికి సంకోచిస్తున్నారు. ముఖ్యంగా 18 నుండి 24 సంవత్సరాల వయసు గల యువతులు ప్రపంచవ్యాప్తంగా నేరాలకు గురవుతున్నారు. నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఉపయోగించే దేశాల్లో సగటున 5 మందిలో ఒకరు సైబర్ నేరాల బారిన పడుతున్నారు.

పటిష్టమైన సైబర్ చట్టాలతో చెక్

సైబర్ నేరాల నివారణకు ప్రస్తుతం ఉన్న చట్టాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సైబర్ నేరాల విషయంలో విదేశాలు తమ చట్టాలను కఠినతరం చేశాయి. దేశంలో తొలి ఐటీ యాక్ట్ (Information Technology Act) అక్టోబర్ 2000లో ప్రవేశపెట్టారు. 2008లో మళ్లీ కొన్ని కీలకమైన సవరణలు చేశారు. 

Whats_app_banner

సంబంధిత కథనం