Thunderclap headache: పిడుగులా వచ్చిపడే తలనొప్పి, ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇబ్బంది పెట్టేస్తుంది-what is thunderclap headache symptoms and treatment of thunderclap headache ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thunderclap Headache: పిడుగులా వచ్చిపడే తలనొప్పి, ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇబ్బంది పెట్టేస్తుంది

Thunderclap headache: పిడుగులా వచ్చిపడే తలనొప్పి, ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇబ్బంది పెట్టేస్తుంది

Haritha Chappa HT Telugu
Jul 19, 2024 09:30 AM IST

Thunderclap headache: తలనొప్పి ఎప్పుడు ఎవరినీ ఇబ్బంది పెడుతుందే చెప్పడం కష్టం. తలనొప్పిలో ఒకరకం పిడుగు తలనొప్పి. వీటిని ‘థండకర్ క్లాప్’ తల నొప్పి అంటారు.

పిడుగు తలనొప్పి
పిడుగు తలనొప్పి (Unsplash)

ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమయంలో తలనొప్పి వస్తూనే ఉంటుంది. కొంతమందికి మైగ్రేన్ తలనొప్పులు ఎంతో వేధిస్తాయి. అలాగే తలనొప్పిలో మరో రకం ఉంది. అదే ‘పిడుగు తలనొప్పి’. దీన్ని Thunder clap Headache అంటారు. అంటే ఒకేసారి అకస్మాత్తుగా ప్రారంభమయ్యే తలనొప్పి ఇది. ఒకేసారి తీవ్రంగా వచ్చే ఈ తలనొప్పిని తట్టుకోవడం కష్టమే. తలనొప్పి మొదలైన కొన్ని క్షణాల్లోనే అది విపరీతంగా పెరిగిపోతుంది. పిడుగుపాటు తలనొప్పి అనేది ఆకస్మికంగా ప్రారంభమయ్యే తీవ్రమైన తలనొప్పి, ఇది ప్రారంభమైన ఒక నిమిషం లేదా అంతకంటే తక్కువ సమయంలో దాని గరిష్ట తీవ్రతను చేరుకుంటుంది. తీవ్రమైన అంతర్లీన పరిస్థితులను సూచించే సామర్థ్యం ఉన్నందున తక్షణ వైద్య సహాయం అవసరం.

పిడుగు తలనొప్పి లక్షణాలు

పిడుగు తలనొప్పి రావడానికి ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఈ తలనొప్పితో వికారం, వాంతులు, స్పృహ తప్పడం, గందరగోళం, మూర్ఛలు, మెడ బిగుతుగా మారడం, కాంతి - ధ్వని వంటివి తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. `

పిడుగు తలనొప్పి రావడానికి కారణాలు

పిడుగులా వచ్చిపడే తలనొప్పిని తేలికగా తీసుకోకూడదు. ఇది కొన్ని ప్రమాదకరమైన సమస్యలకు కారణం అవుతుంది.

సుబారాక్నోయిడ్ రక్తస్రావం: మెదడు, దాని చుట్టుపక్కల పొరల మధ్య రక్తస్రావం జరిగినప్పుడు ఇలా పిడుగులాంటి తీవ్రమైన తలనొప్పి వచ్చిపడుతుంది.

రివర్సిబుల్ సెరిబ్రల్ వాసోకాన్స్ట్రిక్షన్ సిండ్రోమ్: మెదడులోని రక్త నాళాలు తాత్కాలికంగా కుచించుకుపోయినప్పుడు కూడా ఇలా తీవ్రమైన తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

ఎప్పుడు వైద్య సహాయం తీసుకోవాలి?

పిడుగు తలనొప్పిని ప్రతిసారీ తేలికగా తీసుకోకూడదు. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి ఒక నిమిషంలోనే తీవ్ర స్థాయికి చేరితే, వెంటనే వైద్య సహాయం తీసుకోండి. మెదడులోని ఏర్పడిన సమస్యలను నివారించడానికి వైద్యుడిని సంప్రదించడం లేదా సమీప ఆసుపత్రికి చేరుకోవడం చాలా ముఖ్యం.

రోగ నిర్ధారణ, చికిత్స

మొదల ఆర్డర్ బ్రెయిన్ ఇమేజింగ్ (సిటి లేదా ఎంఆర్ఐ) వంటి న్యూరోలాజికల్ పరీక్ష చేస్తారు. మెదడులో రక్తస్రావంలాంటివి జరిగాయేమో తెలుసుకుంటారు. రోగనిర్ధారణ జరిగాక చికిత్సను ఆరంభిస్తారు. ఇందులో నొప్పి తగ్గేందుకు ఇస్తారు. అనూరిజం లేదా ధమనుల విచ్ఛేదనలకు శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావచ్చు.

నివారణ చిట్కాలు

అధిక రక్తపోటు పెరిగిపోయినా , ధూమపానం లేదా అధిక మద్యపానాన్ని నివారించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. చిన్నచిన్న జీవనశైలి మార్పులతో థండర్క్లాప్ తలనొప్పిని నివారించవచ్చు. అయినప్పటికీ, పిడుగు తలనొప్పి బారిన పడితే నాడీ సంబంధిత వ్యాధులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి.

Whats_app_banner