Dreams and Meanings : మీరు కలలో వేరే వారి పాదాలను తాకితే అర్థమేంటి?
Meaning Of Dream : స్వప్న శాస్త్రం ప్రకారం కలలు వివిధ అర్థాలను చెబుతాయి. కలలో మనం చూసేవి భవిష్యత్‌కు సూచన అని అంటుంటారు. కలలో మీరు ఎవరివైనా పాదాలను తాకినట్టైతే దానికి అర్థం వేరే ఉంటుంది.
Swapna Shastra : దాదాపు అందరికీ కలలు వస్తాయి. కొన్ని కలలు మనల్ని సంతోషపరుస్తాయి, కొన్ని కలలు భయాన్ని కలిగిస్తాయి. మరికొన్ని కలలు మీ మెదడులో అలానే ఉండిపోతాయి. ఏదో తెలియని విషయం వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి కలలు వాటి అర్థాల గురించి స్వప్నశాస్త్రం చెబుతుంది.
మనం కనే ప్రతి కల వెనుక ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు వాటి వెనుక అర్థాన్ని కనుగొనడం కష్టం. మన కలలకు, జీవితాలకు చాలా లోతైన సంబంధం ఉంది. నిద్రపోతున్నప్పుడు మీకు వచ్చే కలలను మీరు నిర్లక్ష్యం చేయకూడదు.
ఒకరి పాదాలను తాకడం, ఆశీర్వాదం పొందడం హిందూ సంస్కృతిలో మంచి పద్ధతిగా పరిగణిస్తారు. మనం ఒకరి పాదాలను తాకినప్పుడు మన శరీరంలో శక్తి పుడుతుందని అంటారు. అదేవిధంగా మీ కలలో పాదాలను తాకినట్లు కనిపిస్తే, దాని అర్థం ఏంటో తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రం ఎవరి పాదాలను తాకినట్లు కల వస్తే అది శుభప్రదంగా చూడాలో చెబుతుంది. ఈ రకమైన కలలు రాబోయే రోజుల్లో మీకు మంచి జరుగుతాయని శుభ సందేశాలు ఇస్తాయని వివరించింది. ఈ కలలో అనేక రకాలు ఉన్నాయి, వాటి గురించిన సమాచారం ఇక్కడ ఉంది.
మీరు మీ కలలో వృద్ధుల పాదాలను తాకినట్లయితే, మీ జీవితంలో మీకు అభివృద్ధి తలుపులు తెరుచుకుంటున్నాయని అర్థం.
మీరు కలలో ఎవరైనా మీ పాదాలను తాకినట్లయితే, మీరు మీ జీవితంలో గౌరవాన్ని, మానవత్వాన్ని మేల్కొల్పుతున్నారని అర్థం.
మీరు ఒకరి పాదాలకు నమస్కరిస్తే మీరు వారి శక్తిని మీ వైపునకు లాగుతున్నారని కూడా అర్థం.
ఒక వ్యక్తి యొక్క శక్తి బొటనవేలులో ఉందని అంటారు. మీరు కలలో వేరేవారి కాలి వేళ్లను తాకినట్లయితే, మీ అదృష్టం మారుతుందని సూచన.
కాలిని తాకితే మరికొన్ని అర్థాలు కూడా ఉన్నాయి. ఈ కల మీరు మీ జీవితంలో ఏదో తప్పు చేశారని, దానిని సరిదిద్దినట్లు కూడా సూచించవచ్చు.
మరో అర్థం ఏంటంటే.. మీరు ఎవరినైనా సవాలు చేయబోతున్నారని, అలాగే ఈ సవాలులో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం తప్ప మీకు వేరే మార్గం లేదని ఈ కల సూచించవచ్చు. మరో అర్థం ప్రకారం మీరు త్వరలో విజయాల మెట్లు ఎక్కుతారని కూడా చెబుతారు. మీరు ఒకరి పాదాన్ని తాకినట్లు కలలుగన్నట్లయితే పైన పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి జరుగుతుందని స్వప్నశాస్త్రం చెబుతుంది.
గమనిక : పైన ఇచ్చిన కథనం విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.. ఇందులోని అంశాలను ఆమోదించదు. మీ విచక్షణ ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. సమాచారం అందించేందుకు మాత్రమే కథనం ఇచ్చాం.