Men Thinking | సెక్స్ తర్వాత మగవారు ఏం ఆలోచిస్తారు?-what does men think after sex with women ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Men Thinking | సెక్స్ తర్వాత మగవారు ఏం ఆలోచిస్తారు?

Men Thinking | సెక్స్ తర్వాత మగవారు ఏం ఆలోచిస్తారు?

Maragani Govardhan HT Telugu
Mar 05, 2022 08:00 AM IST

సాధారణంగా మగవారు సెక్స్ విషయంలో కొంచెం ఆధిపత్యాన్ని చెలాయించాలని భావిస్తారు. దీని గురించి ముందు నుంచే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆడవారు మాత్రం కోరికలను నియంత్రణలో ఉంచుకుని పడకగదిలో ఆ సంతోషాన్ని అనుభూతి చెందుతారు. అయితే సెక్స్ తర్వాత కూడా పురుషులు ఆ ప్రక్రియే గురించే ఆలోచిస్తారట.

<p>శృంగారం&nbsp;</p>
శృంగారం (Unsplash)

శృంగారం అనేది ఈ సృష్టిలో ప్రతి జీవికి అనుభూతి చెందే సహజ ప్రక్రియ. ఆకలి, సంతోషం, బాధ మాదిరిగా సెక్స్ కూడా ప్రతి ఒక్కరిలోనూ కలిగి భావన. అయితే మానవ సమాజంలో దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. స్త్రీ, పురుషుల మధ్య ఉండే ప్రేమకు ఇది ఏకాంత రూపం. లైంగికంగా ఇరువురు సమానంగా సంతృప్తి చెందినప్పుడే వారి జీవితం కూడా ఎలాంటి అరమరికలు లేకుండా సాఫీగా సాగుతుంది. సాధారణంగా మగవారు ఈ విషయంలో కొంచెం ఆధిపత్యాన్ని చెలాయించాలని భావిస్తారు. దీని గురించి ముందు నుంచే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆడవారు మాత్రం కోరికలను నియంత్రణలో ఉంచుకుని పడకగదిలో ఆ సంతోషాన్ని అనుభూతి చెందుతారు. అయితే సెక్స్ తర్వాత కూడా పురుషులు ఆ ప్రక్రియే గురించే ఆలోచిస్తారట. తమ భాగస్వామిని సంతృప్తి పెట్టామా? వారిని పడక గదిలో సంతోష పెట్టగలిగామా? అనే అంశాల గురించి ఆలోచిస్తారని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ విషయం గురించి క్లుప్తంగా ఇప్పుడు చూద్దాం.

మహిళల అభిప్రాయం కోసం చూస్తారు..

మగవారు తమ భాగస్వామి సంతోషం గురించి ఎక్కువగా ఆలోచిస్తారట. శృంగార పరంగా ఆమె అభిప్రాయం తెలుసుకోవాలని ఆశిస్తారట. తమ మాదిరిగానే ఈ ప్రక్రియను పూర్తిగా ఆస్వాదించారా లేదా అని ఆలోచిస్తారట. ఒకవేళ తమ భాగస్వామి సంతోషంగా ఉందనిపిస్తే మరోసారి సెక్స్‌కు ఉపక్రమిస్తారట.

భావప్రాప్తి పొందారా లేదా?

మగవారిలో చాలా మంది భావప్రాప్తి గురించి సందేహాస్పదంగా ఉంటారు. సాధారణంగా మహిళల కంటే పురుషులు వేగంగా పతాక స్థాయికి చేరతారు. కాబట్టి తమ భాగస్వామి కూడా భావప్రాప్తిని పొందారా లేదాని మగవారు ఆలోచిస్తారు. ఒకవేళ వారు సంతృప్తి చెందలేదని తెలిస్తే మాత్రం పురుషుల అహం దెబ్బతిని ఎక్కువగా బాధపడతారు.

సెక్స్ తర్వాత ఉండాలా వద్దా?

హుకప్స్ లేదా క్యాజువల్ సెక్స్‌లో పాల్గొన్న పురుషులు ఆ ప్రక్రియ తర్వాత అక్కడే ఉండాలా వద్దా అని ఆలోచిస్తారు. సాధారణ సంబంధాల్లో శృంగారంలో పాల్గొనడం ప్రధాన ప్రాధాన్యత కాబట్టి చాలా వరకు మహిళలు ప్రక్రియ తర్వాత ఉండటానికి ఇష్టపడకపోవచ్చు లేదా ఇబ్బందికరంగా ఫీల్ అవ్వవచ్చు.

త్వరగా పూర్తి చేశానా?

శృంగార ప్రక్రియలో ప్రతి పురుషుడు పూర్తి సంతృప్తి పొందాలనే చూస్తారు. అయితే కొంతమంది సెక్స్‌ను చాలా త్వరగా పూర్తి చేస్తారు. అనంతరం బాధపడతారు. తమ భాగస్వామి కూడా అసంతృప్తిగా ఉందని ఫీల్ అవుతారు. కొన్నిసార్లు ఇబ్బంది పడతారు.

బెస్ట్ ఇచ్చానా?

భాగస్వామికి అత్యుత్తమ శృంగారం అనుభూతిని ఇవ్వాలని మగవారు కోరుకుంటారు. సెక్స్ తర్వాత కూడా ఇదే భావన ఎదుటివారిలో ఉందా లేదా అని ఆలోచిస్తారు. ఒకవేళ బెస్ట్ ఇచ్చినట్లయితే చాలా సంతోషపడతారు. ఎప్పుడూ భిన్నంగా ప్రయత్నించాలనే ఆరాటపడుతుంటారు.

మరొక్కసారి..

స్త్రీ, పురుషులు ఏకాంతంలో అద్భుతమైన శృంగారానుభావాన్ని పొందిన తర్వాత ఇద్దరూ మరో పర్యాయం కోసం ఆరాటపడతారు. లేదా మళ్లీ ఎప్పుడు అనే విషయం గురించి ఆలోచిస్తారు. సాధారణ సంబంధం కాకపోయినప్పటికీ పురుషుడు తను ప్రేమించిన స్త్రీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు.

Whats_app_banner