White Colour Car: తెలుపు రంగు కార్ కొంటారా? ఈ రంగు కారు లాభనష్టాలు తెల్సుకోండి
White car pros and cons: తెలుపు రంగు కార్ కొనాలనుకుంటున్నారా? దాంతో కొన్ని లాభాలు, నష్టాలు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకుని కార్ కొనడం ఉత్తమం. అవేంటో తెల్సుకోండి.
మనదేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే కారు రంగు ఏదో తెలుసా? తెలుపు. చాలా మంది రకరకాల రంగుల కార్లు కొనాలనుకుని ఆలోచించి చివరికి తెలుపు రంగు కారు కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. మీరూ తెలుపు రంగు కార్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే దాని లాభనష్టాలు ఒకసారి బేరీజు వేసుకుంటే మంచిది.
తెలుపు రంగు కార్ లాభాలు:
1. వేడి తక్కువ గ్రహిస్తుంది:
వేసవిలో నాలుగు చక్రాల కొలిమిలో ఉన్నట్లు అనిపించకూడదంటే తెలుపు రంగు కార్ మంచి ఎంపిక. పైన ఫొటోలో చూయించినట్లు తెలుపు రంగు మిగతా రంగులతో పోలిస్తే చాలా తక్కువ వేడిని గ్రహిస్తుంది. దీంతో మిగతా కార్ల కన్నా తెలుపు రంగు కార్ల ఇంటీరియర్ కాస్త చల్లగా ఉంటుంది. ఎండలో గంటసేపు పార్క్ చేశాక కార్లో కూర్చుంటే నిప్పుల్లో కూర్చున్న అనుభూతి తెలుపు రంగు కాస్త తగ్గిస్తుందనే చెప్పాలి.
2. విజిబిలిటీ:
తెలుపు రంగు కార్లు రోడ్ల మీద దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాల్లో, వాతావరణం సరిగ్గా లేనప్పుడు ఈ రంగుకున్న లక్షణం లాభదాయకంగా ఉంటుంది.
3. దుమ్ము:
పొడి దుమ్ముదూళి ముదురు రంగు కారు మీద పడితే దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది. కానీ తెలుపుతో ఆ ఇబ్బంది ఉండదు. ముదురు రంగుల్లాగా బయటికి వెళ్లి రాగానే దుమ్ము దులపాల్సిన ఇబ్బంది కాస్త తక్కువే.
తెలుపు రంగు కార్ నష్టాలు:
1. ప్రత్యేకంగా ఉండదు:
ఎక్కువ మంది కొనేకారు రంగు ఇదే కాబట్టి మీ కార్ ప్రత్యేకంగా కనిపించకపోవచ్చు. ఇది ఎప్పటికీ వన్నె తగ్గని రంగు కారు. కానీ మీరు అందరిలోనూ ప్రత్యేకంగా, విభిన్నంగా లుక్ ఉండే కార్ కొనాలనుకుంటే వేరే రంగులు ఎంచుకోవడం మేలు. ఎక్కడైనా ఎక్కువ కార్లు పార్క్ చేసి ఉన్నచోట మీ కార్ దూరం నుంచి గుర్తించడం కూడా కాస్త కష్టమే. ఎక్కువగా తెలుపు కార్లు ఉండటమే దానికి కారణం. బదులుగా ప్రత్యేకంగా ఉండే మెటాలిక్ బ్లాక్, మజెంటా, గ్రే లాంటి రంగులు ఎంచుకోవచ్చు.
2. వర్షాకాలంలో:
తడి నేలలు, బురద, వర్షాకాలంలో తెలుపు రంగు నడపాలంటే సాహసమే. తెలుపు రంగు కార్ మీద. పొడి దూళి ఎంత తక్కువగా కనిపిస్తుందో.. బురద అంత ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతిసారీ వాష్ చేయాల్సి రావచ్చు.
3. రంగు మారడం:
తెలుపు రంగు కార్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా, కార్ వాషింగ్, సర్వీసింగ్ చేయకపోతే క్రమంగా తెలుపు రంగు కారు కాస్త పసుపుపచ్చగా మారుతూ వస్తుంది.
ప్రతి రంగుకు వాటి లాభనష్టాలుంటాయి. ఎక్కువగా ఎంచుకునే కార్ తెలుపు రంగు కాబట్టి దాని లాభనష్టాలు తెల్సుకోవడం మంచిదే. అన్ని రంగులకు వేటి ప్రత్యేకత వాటికి తప్పకుండా ఉంటుంది.
టాపిక్