SUV Cars In India : రూ. 10 లక్షలలోపు ధరతో భారత్‌లోకి రానున్న కొన్ని కొత్త కార్లు!
SUV Cars : భారత్‌లో కార్లకు బాగా డిమాండ్ ఉంది. మధ్యతరగతివారు సైతం కార్లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కంపెనీలు ఇక్కడ కార్లను లాంచ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. కొన్ని ఎస్‌యూవీ కార్లు పది లక్షల రూపాయల ధరతో ఇండియాలోకి రానున్నాయి. ఆ కార్లేంటో.. వాటి వివరాలు ఏంటో చూద్దాం..
ఇండియా అతిపెద్ద కార్ మార్కెట్‌ను కలిగి ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కార్లు లాంచ్ అవుతూనే ఉంటాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు కూడా కూడా వచ్చే ఏడాది వినూత్న స్టైలింగ్, ఆకర్షణీయమైన ఫీచర్లతో అనేక కొత్త కార్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్కోడా, మారుతీ సుజుకి, హ్యుందాయ్, కియా, నిస్సాన్ కంపెనీల నుండి ఒక్కో కాంపాక్ట్ SUV అమ్మకానికి రానుంది. ఇవి రూ.10 లక్షల కంటే తక్కువ ఎక్స్-షోరూమ్ ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.
హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ
సెకండ్ జనరేషన్ హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ 2025 మధ్యలో మార్కెట్‌లోకి రానుంది. డిజైన్, ఫీచర్లలో చాలా మార్పులను ఉంటాయని అంటున్నారు. ఈ కారు ధర కూడా రూ.10 లక్షల లోపే ఉండవచ్చని అంచనా. హ్యుందాయ్ వెన్యూ వేరియంట్‌పై ఆధారపడి రూ. 7.94 లక్షల నుండి రూ. 13.48 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండనుంది.
స్కోడా కైలాక్ ఎస్‌యూవీ
స్కోడా కైలాక్ ఎస్‌యూవీ ఫిబ్రవరి 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. రూ. 8.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్త కారులో 1-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్, 6-స్పీడ్ మాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటాయి. స్కోడా కైలాక్‌లో ఐదుగురు సౌకర్యవంతంగా వెళ్లవచ్చు. ఇది అధునాతన డిజైన్‌ను కలిగి ఉంటుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఫుల్-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వివిధ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీ
ఫేస్‌లిఫ్టెడ్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీ అనేక కొత్త ఫీచర్లతో 2025 మధ్యలో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. ఇది హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్న ఫ్రాంక్‌ల ఎక్స్-షోరూమ్ ధర రూ.7.51 లక్షల నుంచి రూ.13.04 లక్షల మధ్య ఉంది. సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీ రూ.10 లక్షల వరకు ఎక్ షోరూమ్ ధరగా వచ్చే అవకాశం ఉంది.
నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ
కొత్త ఫేస్‌లిఫ్ట్ నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ 2025 ప్రారంభంలో అప్‌డేట్‌గా వచ్చే అవకాశం ఉంది. డిజైన్‌లో చాలా మార్పులు ఉంటాయి. ప్రస్తుత మాగ్నైట్ ధర రూ. 6 లక్షల నుండి రూ. 11.27 లక్షల వరకు ఉంది. 17.40 నుండి 20 kmpl మైలేజీని అందిస్తుంది.
కియా సిరోస్
కియా సిరోస్ ఎస్‌యూవీని 2025 మధ్యలో విడుదల చేయవచ్చు. ప్రస్తుతం ఈ కారు తయారీ దశలో ఉంది. రూ. 10 లక్షల లోపు విడుదల చేసే అవకాశం ఉంది. ఇది పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)తో సహా పలు ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.