Kia Seltos X Line : మార్కెట్‌లో సునామీ సృష్టించిన కియా సెల్టోస్.. మరో కొత్త రంగుతో రోడ్ల పైకి
Kia Seltos X Line : కియా కార్లు మార్కెట్లోకి వచ్చాక ఎక్కువగా అమ్ముడయ్యాయి. చాలా మంది కియా కార్లను తీసుకునేందుకు ఇష్టపడ్డారు. అయితే కియా ఇండియా తన వ్యూహంలో భాగంగా మరో కొత్త రంగుతో కియా సెల్టోస్‌ను విడుదల చేసంది. ఆ వివరాలు మీ కోసం..
కియా సెల్టోస్ SUV తక్కువ సమయంలో బాగా అమ్ముడవుతూ భారతదేశంలో సునామీ సృష్టించింది. కొత్త అప్‌డేట్‌లతో కియా సెల్టోస్‌ను భారతదేశంలో ప్రారంభించింది. సెల్టోస్ ఇప్పుడు మిడ్-సైజ్ SUV X-లైన్ వెర్షన్‌లో నలుపు రంగును పరిచయం చేసింది. ఇది చాలా స్టైలిష్ లుక్‌లో ఉంది.
సెల్టోస్ SUVలో మూడు ప్రధానంగా ఉన్నాయి. అవి టెక్ లైన్, జీటీ లైన్, X-లైన్. అయితే సెల్టోస్ ఎక్స్-లైన్ ఇప్పటి వరకు గ్రే రంగులోనే దొరికేది. కొత్తగా కియా నలుపు రంగులో సెల్టోస్‌ను విడుదల చేసింది.
ఈ కొత్త రంగు సెల్టోస్‌లో ఎక్స్-లైన్ స్టైలింగ్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఈ మార్పులు కేవలం ఎక్ట్సీరియర్‌కే పరిమితం కాకుండా ఇంటీరియర్‌కు కూడా విస్తరిస్తాయని కంపెనీ తెలిపింది. అరోరా బ్లాక్ పెర్ల్‌లోని సెల్టోస్ ఎక్స్-లైన్ క్యాబిన్ బ్లాక్, స్ప్లెండిడ్ సేజ్ గ్రీన్ 2-టోన్ కాంబినేషన్‌లో విభిన్న రంగులను పొందుతుంది. వెనుక బంపర్‌పై ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్లు, ఔటర్ రియర్ మిర్రర్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, టెయిల్‌గేట్ గార్నిష్, ఫాక్స్ ఎగ్జాస్ట్ వంటి కొన్ని వెర్షన్‌లలో అనేక బ్లాక్ ఫినిషింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. స్కిడ్ ప్లేట్లు, సైడ్ డోర్ గార్నిష్, వీల్ సెంటర్ క్యాప్స్‌పై ఆరెంజ్ యాక్సెంట్‌లు ఉన్నాయి.
కియా సెల్టోస్ X-లైన్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, X-లైన్ బ్యాడ్జ్‌తో వస్తుంది. ఇవన్నీ కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఎక్స్-లైన్ ట్రిమ్ కొనుగోలుదారులను ప్రభావితం చేసిందని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ జున్సు చో అన్నారు. సెల్టోస్ డిమాండ్, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా బ్లాక్ కలర్ ఆప్షన్‌ను పరిచయం చేశామని చెప్పారు. కస్టమర్‌ల అభిరుచులకు సరిపోయేలా మరిన్ని ఎంపికలను అందిస్తామన్నారు.
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ SUVలో పెట్రోల్ ఇంజన్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ IMT యూనిట్, CVT యూనిట్, 6-స్పీడ్ డ్యూయల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో వస్తాయి.
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ SUVలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా పరిచయం చేసింది. ఈ ఇంజన్ 113 బిహెచ్‌పీ పవర్, 144 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 6-స్పీడ్ iMT గేర్‌బాక్స్ లేదా CVT గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌లో 1.5-లీటర్, టర్బోచార్జ్డ్, డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఈ ఇంజన్ 114bhp, 250Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో జత చేయవచ్చు.