Fuel and AC : మీ కారులో గంటసేపు ఏసీ పెడితే ఎంత పెట్రోల్ వాడుతుంది?-how much fuel consumed in a car when ac is running for 1 hour and air conditioner effects car mileage ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fuel And Ac : మీ కారులో గంటసేపు ఏసీ పెడితే ఎంత పెట్రోల్ వాడుతుంది?

Fuel and AC : మీ కారులో గంటసేపు ఏసీ పెడితే ఎంత పెట్రోల్ వాడుతుంది?

Anand Sai HT Telugu
Aug 19, 2024 05:42 PM IST

Fuel and AC : కారులో ఏసీ పెట్టుకుని ప్రయాణం చేస్తుంటే వచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. హాయిగా.. లగ్జరీగా అనిపిస్తుంది. కారులో ఏసీ పెట్టుకుంటే ఇంధనం తగ్గుతుందని అందరికీ తెలుసు. కానీ గంటసేపు ఏసీని ఉపయోగిస్తే ఎంత ఇంధనం ఖర్చు అవుతుందో తెలుసుకోవాలి. దాని గురించిన సమాచారం మీ కోసం..

కారులో ఏసీ వాడితే ఎంత ఇంధనం ఖర్చు అవుతుంది?
కారులో ఏసీ వాడితే ఎంత ఇంధనం ఖర్చు అవుతుంది? (Unsplash)

కారులో ఏసీని ఆన్ చేయడం వల్ల అదనపు ఇంధనం ఖర్చవుతుంది. ఈ విషయం విషయం తెలిసిందే. అయితే ఎంత ఇంధనం ఖర్చవుతుందో ఎవరికీ తెలియదు. కారు యజమానులందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. కారు రకం దాని ఇంజిన్ సామర్థ్యం, AC పనితీరుపై ఆధారపడి, కార్లు ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. దాని గురించి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

ఏసీ ఉపయోగించడం వలన ఇంధనం ఖర్చు గురించి కారు ఇంజిన్ సామర్థ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా చిన్న కార్లు ఒకలా ఖర్చు చేస్తే.. పెద్ద కార్లలో ఏసీ కారణంగా ఇంధనం ఖర్చులో మార్పు ఉంటుంది. ఇంజిన్ కెపాసిటీ మీద కూడా ఇంధనం ఖర్చు ఆధారపడి ఉంటుంది. పెద్ద ఇంజన్లు కారు నడుస్తున్నప్పుడు ఏసీ ఉపయోగిస్తే ఎక్కువ ఇంధనాన్ని తాగుతాయి.

ఉదాహరణకు 2L ఇంజన్ కెపాసిటీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న కార్లు రన్నింగ్‌లో ఒక గంట పాటు నిరంతరంగా ఏసీ ఉపయోగిస్తే 0.5 నుంచి 0.7 లీటర్ల ఇంధనాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే 1.2 నుండి 1.5 లీ. చిన్న కెపాసిటీ ఉన్న కార్లు గంటకు 0.2 నుంచి 0.4 లీటర్ల పెట్రోల్‌ను ఉపయోగించవచ్చు.

ముఖ్యంగా ఏసీని ఉపయోగించినప్పుడు కారు వేగాన్ని బట్టి ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది. AC వినియోగంతో సంబంధం అనే విషయానికి వాహన వేగం కూడా పాత్ర పోషిస్తుంది. సాధారణంగా నడుస్తున్న వాహనంలో ఏసీని ఉపయోగించడం వల్ల పార్క్ చేసిన కారులో కంటే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. అంటే ఇంజిన్‌పై అదనపు లోడ్ కారణంగా ఇది మొత్తం మైలేజీని తగ్గిస్తుంది.

ప్రతి కారులోని AC వ్యవస్థ ఇంధన వినియోగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కారు క్యాబిన్‌ను చల్లబరచడానికి కంప్రెసర్ ఎక్కువ పని చేస్తుంది. బయట వాతావరణం చాలా వేడిగా ఉంటే ఈ మొత్తం AC సిస్టమ్‌కు శక్తినివ్వడానికి ఎక్కువ ఇంధనం ఉపయోగించబడుతుంది. AC హై.. కాకుండా మీడియం మీద ఉంచడం ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తాజా కొత్త కార్లు అధునాతన సాంకేతికతను కలిగి ఉన్నందున పాత కార్లతో పోలిస్తే కొత్త కార్లు AC ఉపయోగంలో ఉన్నప్పుడు ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడతాయి.

ఏసీ ఆన్ చేసినప్పుడు ఇంధన ఖర్చు అధికం అవ్వడంలో సరైన నిర్వహణ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏసీ నిర్వహణ చాలా ముఖ్యం. వీలైనంత వరకు నీడలో కార్లను పార్కింగ్ చేయడం వల్ల డ్రైవింగ్‌లో ఏసీ సిస్టమ్‌పై ఒత్తిడి తగ్గడంతో పాటు ఎక్కువ మైలేజీని పొందవచ్చు. అందుకే కార్లను కూడా సరిగా మెయింటెన్ చేయాలి.

Whats_app_banner