Kia EV9 Mileage : మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తున్న కియా ఎలక్ట్రిక్ కారు.. ఒక్క ఛార్జ్‌తో 541 కిలో మీటర్లు!
Kia EV9 In India : ఇండియాలో ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. ఇప్పటికే తయారు చేసిన కంపెనీల్ అప్‌డేట్ వెర్షన్ తీసుకొస్తున్నాయి. అయితే కియా ఇండియా కూడా కొత్త ఈవీని తీసుకువస్తుంది. కియా ఈవీ9 లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తుంటే ఈ వార్త మీ కోసమే. గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ ఇప్పటికీ ఏకపక్ష ఆధిపత్యాన్ని కలిగి ఉంది. భారతదేశంలో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ వాటా 65 శాతంగా ఉంది. వీటిలో టాటా నెక్సాన్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్ ఈవీ ఉన్నాయి. ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని కియా ఇండియా తన కొత్త ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది.
న్యూస్ వెబ్సైట్ గాడివాడిలో ప్రచురించిన ఒక వార్త ప్రకారం కంపెనీ రాబోయే కియా ఈవీ9ను అక్టోబర్ 3న లాంచ్ చేయనుంది. రాబోయే కియా ఈవీ9 ఫీచర్లు, పవర్ట్రెయిన్, రేంజ్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
కియా రాబోయే ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ-జిఎంపి ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లో కియా ఈవీ9 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 541 కిలోమీటర్ల డబ్ల్యూఎల్టీపీ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అల్ట్రా-ఫాస్ట్ 800V ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఇది కేవలం 15 నిమిషాల్లో 239 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరోవైపు కియా ఈవీ9లో హైవే డ్రైవింగ్ పైలట్ (హెచ్‌డీపీ) సిస్టమ్ వంటి సాంకేతికతలు కూడా ఉన్నాయి. కియా రాబోయే ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ధరలను ఇంకా ప్రకటించలేదు.
రాబోయే కియా ఈవీ9ను సీబీయీ మార్గం ద్వారా దేశానికి తీసుకురానున్నారు. ఇది 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో ఫుల్ లోడెడ్ ట్రిమ్‌లో అందించబడుతుందని భావిస్తున్నారు. డిజైన్ పరంగా కియా ఈవీ9 ఎక్ట్సీరియర్‌లో చిన్న క్యూబ్ ల్యాంప్స్ డ్యూయల్ క్లస్టర్లు, డిజిటల్ ప్యాట్రన్ లైటింగ్ గ్రిల్, వర్టికల్ హెడ్ ల్యాంప్స్, ప్రత్యేకమైన 'స్టార్ మ్యాప్' ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. జిటి లైన్ ట్రిమ్ దాని ప్రత్యేకమైన నలుపు రంగు ప్యాలెట్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది.