Breakfast Recipes: బరువు తగ్గించే రుచికరమైన అల్పాహారాలు ఇవే!-weight loss healthy breakfast recipes in hindi weight loss breakfast recipes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   Breakfast Recipes: బరువు తగ్గించే రుచికరమైన అల్పాహారాలు ఇవే!

Breakfast Recipes: బరువు తగ్గించే రుచికరమైన అల్పాహారాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Jun 30, 2022 05:57 PM IST

బరువు తగ్గడమనేది ఇప్పటి నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది ఎదర్కొంటున్న అతిపెద్ద సమస్య బరువు పెరగడం. బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యం ఉదయం తీసుకునే అల్పాహారం విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి

<p>Breakfast Recipes</p>
Breakfast Recipes

బరువు తగ్గడంలో అల్పాహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉదయం తీసుకునే బ్రెక్ పాస్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఏది పడితే అది కాకుండా ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తినడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు కూడా తగ్గవచ్చు. అలాంటి అల్పాహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వోట్స్ ఉత్తప్ప

ఓట్స్, సెమోలినాను మిశ్రమంగా గ్రైండ్ చేసి, ఇంగువ వేయండి. ఇప్పుడు పెరుగు, జీలకర్ర, ఎర్ర మిరపకాయ, సోడా, అల్లం అవసరమైనంత నీరు వేసి మందపాటి పిండిని సిద్ధం చేయండి. ఈ పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టండి. అందులో ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి. నాన్ స్టిక్ పాన్ వేడి చేసి దానిపై కొద్దిగా నూనె వేయండి. ఇప్పుడు కొంచెం పిండిని పోసి చూట్టూ తింపండి. ఇది బంగారు గోధుమ రంగులోకి మారే వరకు ఉంచాలి. తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

పోహ

పోహను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగాలి. కడిగిన తర్వాత, దాని నీళ్లన్నీ ఫిల్టర్ చేసి, అందులో కొంత నీటిని ఉంచండి. తర్వాత ఉప్పు, రుచి ప్రకారం అర టీస్పూన్ చక్కెర వేసి 15 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు బాణలిలో చెంచా నూనె వేసి వేడయ్యాక అందులో శనగపిండి వేసి వేయించాలి. వేరుశెనగలు వేయించిన తర్వాత వాటిని తీసి విడిగా ఉంచాలి. తర్వాత అదే బాణలిలో ఒకటి నుంచి ఒకటిన్నర టీస్పూన్ నూనె వేసి అందులో ఆవాలు వేయాలి. తర్వాత అందులో సోపు, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. తర్వాత అందులో పసుపు, చిన్న ముక్కలుగా తరిగిన బంగాళదుంపలు వేయాలి. మూతపెట్టి బంగాళాదుంపలు ఉడికినంత వరకు ఉడికించాలి. తర్వాత అందులో పోహా వేసి తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అందులో సగం నిమ్మకాయ రసం వేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. తరిగిన నిమ్మకాయ , కావలసిన దానిమ్మ గింజలు లేదా తురిమిన కొబ్బరి, సాల్టెడ్ సెవ్‌తో సర్వ్ చేయండి.

తేప్లా

శెనగపిండి, గోధుమపిండి, ఎర్ర మిరపకాయ, పసుపు, ధనియాల పొడి, పెరుగు, ఉప్పు, క్యారమ్ గింజలు, తరిగిన మెంతులు, 2 టీస్పూన్ల నూనెను ఒక పాత్రలో వేసి, మెత్తగా పిండిలా పిసికి, అవసరమైనంత నీరు కలపండి. ఇప్పుడు పిండిపై మూత పెట్టి.. 15 నిముషాల తర్వాత పిండిని మళ్లీ మెత్తగా పిసికి పిండి బాల్స్ చేయండి. పొడి పిండిని ఉపయోగించి రోటీ లాగా చుట్టండి. ఈలోగా, మీడియం మంట మీద పాన్‌ను వేడి చేయండి. తవా వేడి అయ్యాక, కొంచం నూనె రాసి, తక్కువ వేడి మీద థెప్లాస్ ఉడికించాలి. కొద్ది సేపటి తర్వాత తేప్లాస్ ఊరగాయ, పెరుగు లేదా చట్నీతో సర్వ్ చేయండి.

మూంగ్ దాల్ చిల్లా

పెసరు పప్పును కొద్దిసేపు నీటిలో ఉంచి. ఆ తర్వాత నీటి నుండి వడపోసి.. మిరపకాయ, అల్లం, జీలకర్ర వేసి కలపండి. ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని అందులో పసుపు, కొత్తిమీర తరుగు, ఇంగువ ఉప్పు వేయాలి. తర్వాత దానికి కొంచెం నీళ్ళు పోసి పలుచన చేసి బాగా కలపాలి. ఇప్పుడు గ్యాస్‌పై ప్యాన్ వేడి చేసి నూనెతో గ్రీజు వేయండి. తర్వాత పాన్‌పై చిల్లా పిండిని పోసి మెత్తగా వేయండి. చీలా చుట్టూ నూనె పోసి మీడియం మంట మీద కాల్చాలి. తర్వాత 3 నుంచి 5 నిమిషాల తర్వాత చీలాను మరో వైపు తిప్పుతూ ఉడికించాలి. ఇది రెండు వైపుల నుండి ఉడికిన తర్వాత, బ్రేక్ ఫాస్ట్‌గా సర్వ్ చేసుకోండి. గ్రీన్ చట్నీ, టీ లేదా సాస్‌తో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది

Whats_app_banner

సంబంధిత కథనం