Weekly Tarot Predictions | ఏప్రిల్ 17-ఏప్రిల్ 23, 2022 వరకు రాశి ఫలాలు-weekly tarot card readings for april 17 april 23 2022 libra to pisces ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weekly Tarot Predictions | ఏప్రిల్ 17-ఏప్రిల్ 23, 2022 వరకు రాశి ఫలాలు

Weekly Tarot Predictions | ఏప్రిల్ 17-ఏప్రిల్ 23, 2022 వరకు రాశి ఫలాలు

HT Telugu Desk HT Telugu
Apr 17, 2022 08:56 AM IST

Weekly Tarot Card Readings: ఏప్రిల్ 17-ఏప్రిల్ 23, 2022 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులా, వృశ్చికం, మకర, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి పుట్టిన తేదీ ఆధారంగా టారో అనలిస్ట్ మనీషా కౌషిక్ అందించిన రాశి ఫలాలు.

<p>Weekly Horoscope</p>
Weekly Horoscope (Pixabay)

మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య రాశుల ఈ వారం రాశి ఫలాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తులా రాశి (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)

తులా రాశి వారికి మంచి కాలం ముందుంది. మీ ఓపిక, పట్టుదల ఈ వారం మీకు మంచి ఫలితాలను తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి. మీ ప్రయత్నాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారిలో కొంతమంది అవార్డులు, విలువైన ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రసిద్ధ సంస్థలో ఉద్యోగం పొందవచ్చు. వృత్తిపరంగా పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తితో ఒక అవగాహనకు రావొచ్చు, ఇది మిమ్మల్ని మరింత చేరువ చేస్తుంది. పెళ్లి ఆలోచనలు చేస్తున్న వారికి ఇది శుభ తరుణం, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులు, బంధువులు నుంచి మీకు ప్రోత్సాహం ఉంటుంది. అయితే ఈ వారం తులా రాశి వారికి ఆర్థిక పరంగా పరిస్థితులు కాస్త అస్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ ఆదాయం, ఖర్చుల మధ్య అసమతుల్యత కనిపిస్తుంది. కాబట్టి వృధా ఖర్చులకు దూరంగా ఉండండి. ఏకాగ్రత సాధించడం కోసం యోగా, ధ్యానం లాంటివి చేయండి.

వృశ్చిక రాశి (అక్టోబర్ 24-నవంబర్ 22)

మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఈ వారం మంచి ప్రయోజనాలను అందిస్తాయి. మీ పాజిటివ్ ఆలోచనలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీలో కొందరు ఉన్నత స్థానానికి ఎదుగుతారు, దీంతో మీపై బాధ్యతలు మరింత పెరుగుతాయి. మీ ప్రేమజీవితం సానుకూల మార్పును చూసే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో మీపై గౌరవం పెరుగుతుంది. ఈ వారం మీ ఆరోగ్యంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. చిన్న సమస్యలే అని నిర్లక్ష్యం చేస్తే అవి పెద్దగా పరిణమించవచ్చు. వైద్యుల సలహా మేరకు నడుచుకోండి. అదనపు మూలాల నుంచి వచ్చే లాభాలు మీ సంపదను మరింత పెంచుతాయి. వ్యాపార విస్తరణకు ఈ వారం అనుకూలంగా ఉంది.

ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21)

మీ ముక్కుసూటితనం, మీ నిష్కపటమైన వైఖరి మిమ్మల్ని ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. మీరు జీవితంలో గొప్ప విజయం సాధిస్తారు. మీరు చేసే ప్రయత్నాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. మీ తెలివి, సమయస్ఫూర్తితో పెట్టే పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ షేర్లు మీకు గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తాయి. కుటుంబంలోకి కొత్త సభ్యుల రాక ఉంటుంది. శుభవార్తలు వింటారు. మీ గృహంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట విపరీతమైన పనిభారం ఉంటుంది, సమయం చిక్కకపోవచ్చు. అయినప్పటికీ కష్టపడి పనులు పూర్తిచేస్తారు. అవివాహితులకు ఇంతకాలంగా ఉన్న ఎదురుచూపులు తొలగిపోతాయి. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలు మీకు ఉత్సాహాన్ని కలిగించవచ్చు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం విషయంలో, తినే తిండి విషయంలో జాగ్రత్త అవసరం. వారసత్వంగా లభించే ఆస్తుల విషయంలో ఈ వారం మీకు అనుకూలంగా ఉంది.

మకరం (డిసెంబర్ 22-జనవరి 21)

ఈ వారం కొన్ని మంచి అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటిని అందిపుచ్చుకోండి, రాబోయే రోజుల్లో మీకు ప్రయోజనం చేకూరుతుంది. సృజనాత్మకంగా ఆలోచిస్తారు, ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వృత్తిరంగంలో వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్‌ను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించండి, మీకు ఇచ్చిన ప్రాజెక్టుల విషయంలో శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త అవసరం. ఈ వారం మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లోనూ అప్రమత్తత అవసరం. బంధువుల వైపు నుంచి మిమ్మల్ని ఆర్థిక సహాయం కోరే అవకాశం ఉంది. అవి మీకు తిరిగి చెల్లించే విషయంలో అస్పష్టత ఉంది. కాబట్టి కచ్చితంగా వ్యవహరించండి.

కుంభం (జనవరి 22-ఫిబ్రవరి 19)

కొత్త ఆలోచనలు చేస్తారు, రిస్క్ తీసుకోవాలనుకుంటే ఫలితం వచ్చేంత వరకు పట్టుదలగా ప్రయత్నించండి. మీ నిబద్ధత, పోటీతత్వం మిమ్మల్ని మీ ప్రత్యర్థులపై పై చేయి సాధించేలా చేస్తుంది. మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటారు. మీ సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మీకున్న చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. అయితే ఈ వారం మీ జీవిత భాగస్వామి నుంచి మీరు విడిపోయే పరిస్థితులు తలెత్తవచ్చు. మీరు బాంధవ్యాల విషయంలో ఒంటరి కావొచ్చు, ప్రతికూల ఆలోచనలతో మీరు స్థిరంగా ఉండలేరు. ప్రేమతో దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తే అంతా సక్రమంగా ఉంటుంది. విహారయాత్రలు కలిసి వస్తాయి, మీ బంధాలు దృఢపరుచుకునే అవకాశం దక్కుతుంది.

మీనం (ఫిబ్రవరి 20-మార్చి 20)

మీ జీవితంలో ఒక సానుకూల మార్పు రావడానికి సిద్ధంగా ఉందు. మీ శక్తి మేర ప్రయత్నాలు చేయండి. మీరు కెరీర్‌లో స్థిరంగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి, వీలైతే శిక్షణ తీసుకోండి. మీన రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంది, పాత బకాయిలు చేతికందే అవకాశం ఉంది.ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.ఇక మీ తోబుట్టువులకు సంబంధించిన వివాదంలో మీరు చిక్కుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మీ ఆత్మీయులతో మీ సమస్యలను పంచుకోండి.  

Whats_app_banner

సంబంధిత కథనం