Weekly Horoscope | ఈ వారం రాశి ఫలాలు.. ఏప్రిల్ 17-ఏప్రిల్ 23, 2022 వరకు
Weekly Tarot Card Readings: ఏప్రిల్ 17-ఏప్రిల్ 23, 2022 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి పుట్టిన తేదీ ఆధారంగా టారో అనలిస్ట్ మనీషా కౌషిక్ అందించిన రాశి ఫలాలు.
మేషం (మార్చి 21-ఏప్రిల్ 20)
దృఢమైన సంకల్పంతో కార్యసాధకులవుతారు. మీ లక్ష్యం మిమ్మల్ని నడిపిస్తుంది. మీ అభివృద్ధి కోసం స్నేహితుల, కుటుంబ సభ్యుల సూచనలను తీసుకోండి, ఇది దీర్ఘకాలంలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. పనిచేసే చోట మీ సామర్థ్యం, ఒత్తిళ్లను ఎదుర్కొనే మీ గంభీరమైన స్వభావం మీకు మంచి పేరు తీసుకువస్తుంది. మీ పై అధికారులు మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అందించే సూచనలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామికి మీపై ప్రేమ పెరుగుతుంది, చాలాకాలం తర్వాత మంచి శృంగార సమయాన్ని ఆస్వాదించవచ్చు.
ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. స్టాక్ మార్కెట్‌లో లాభాలు, పెట్టుబడులు కలిసివచ్చే అవకాశం ఉంది. అయితే డబ్బును ఖర్చుపెట్టకుండా ఆదా చేయడం మంచిది. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధచూపితే, మరింత మెరుగ్గా రాణిస్తారు. ఏదిఏమైనా మేష రాశి వారికి ఈ వారం పూర్తి అనుకూలంగా ఉంది, ఉల్లాసంగా గడుపుతారు.
వృషభం (ఏప్రిల్ 21-మే 20)
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదైనా పనిచేసేటపుడు అవరోధాలు ఏర్పడవచ్చు, అయినప్పటికీ పట్టుదలతో పనులు పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. మీ భవిష్యత్ ప్రణాళికలను అమలు చేయడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. వివాహం కాని వారికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. ఈ విషయంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.
కుటుంబంలో సమస్యలు సామరస్యంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పేరేంట్స్ మద్ధతు మీకు లభిస్తుంది. ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం. ఫిట్‌నెస్ శిక్షణా కార్యకలాపాలు మొదలుపెట్టండి. ఇవి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది. మీ లక్ష్యాల కోసం అదనంగా శ్రమించాల్సి ఉంటుంది. అయినా కూడా సీనియర్ల మెప్పు పొందలేకపోవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి, పొదుపు మంత్రం పాటించండి.
జెమిని (మే 21-జూన్ 21)
గతంలో జీవించవద్దు. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన, మీ జీవితంపై ప్రతికూల ప్రభావితం చూపిన విషయాలను ఇకనైనా వదిలివేయడం నేర్చుకోండి. భవిష్యత్తుపై దృష్టిపెట్టి, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏవైనా ఉంటే వాటికోసం ప్రణాళికలు అమలుపరచండి.
మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు చేసే పనిపై దృష్టిపెట్టండి. పూర్తి ఆత్మవిశ్వాసంతో, మనస్పూర్తిగా పనిచేస్తే విజయం మీదే.
ఈవారం మీకు ఆర్థికపరంగా కలిసివచ్చే అవకాశం ఉంది. మంచి లాభాలు మీ చేతికందే సూచనలు ఉన్నాయి. గతంలో చెలరేగిన అపార్థాలు, విభేదాలు శాంతిపూర్వకంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. గాసిప్స్ కు దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఇది మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచుతుంది. ఆరోగ్యం విషయంలో చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి.
కర్కాటకం (జూన్22-జూలై 22)
కర్కాటక రాశి వారికి ఈ వారం పనులు మీరు ఊహించిన దానికంటే కొంచెం భిన్నంగా సాగుతాయి. అసహనానికి గురికావద్దు ఏకాగ్రతతో పనులు చేయండి. కొన్నిసార్లు మీరు ఊహించిన దాని కంటే ఫలితం ఇంకా మెరుగ్గా కూడా ఉండవచ్చు. మీ ప్రేమ జీవితంలో ఆశ్చర్యకరమైన క్షణాలు మీకు ఎదురుపడతాయి. మీ ప్రియమైన వారితో ప్రేమగా బంధాన్ని మెరుగుపరువుకోవడం వల్ల అది భవిష్యత్తులో మరింత బలపడుతుంది. మీ ఆత్మీయుల పట్ల మీరు చూపే అంకితభావం మీపై గౌరవాన్ని మరింత పెంచుతుంది. కుటుంబ సభ్యులు మీ సలహాలను స్వీకరిస్తారు. ఈ వారం ఖర్చులు మీరు ఊహించిన దానికంటే ఎక్కువే అవ్వొచ్చు, కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. డబ్బును ఆదా చేసుకుంటూ ఉండండి. ఇక పనిచేసే చోట మీ పోటీదారుల కంటే వెనకబడి ఉండవచ్చు. మీ పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన సమయం ఇది. మీరేంటో మరోసారి నిరూపించుకోవాల్సిన సమయం. కాబట్టి విభిన్నంగా ప్రయత్నించండి.
సింహం (జూలై 23-ఆగస్టు 23)
సింహరాశి వారికి ఈ వారం ఉత్సాహంగా ఉంటుంది. చప్పగా సాగుతున్న జీవితంలో హుషారు నింపే ప్రయత్నం చేస్తారు. ఏదైనా సాహసం చేయాలనుకుంటారు. ఈ వారం మీరు పూర్తిగా పాజిటివ్ ఆలోచనలతో నిండి ఉంటారు. ఈ వారం మీరు అనేక సంఘటనలను చూడవచ్చు. స్నేహితులు లేదా కుటుంబ సమేతంగా ఏవైనా వేడుకల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు చిన్న చిన్న ఒత్తిళ్లు ఉంటాయి. ఏకాగ్రతతో పనిచేస్తే తక్కువ సమయంలోనే అనుకూల లక్ష్యాలను సాధిస్తారని గుర్తుంచుకోండి. మితంగా తినడం, ఏదైనా పరిమితికి లోబడి స్వీకరించడంపైనే ఈ వారం మీ ఆరోగ్యంతో ముడిపడి ఉంది. క్రమంతప్పకుండా వ్యాయామాలు చేయడం మంచిది. మీ కోరికలను అదుపులో ఉంచుకోవాలి. మీ ప్రియమైన వ్యక్తులతో దూరం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి.
కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23)
కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఇంతకాలం చేసిన శ్రమకు మంచి ఫలితాలు వస్తాయి. కొందరు అవార్డులు స్వీకరించే అవకాశం ఉంది. వృత్తిపరంగా పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే మీకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ప్రమోషన్ లాంటివి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఈ వారం ఉల్లాసంగా గడుపుతారు. మీ భాగస్వామికి మీరు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తారు. మీ మధ్య బంధం శృంగార సంబంధంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. డబ్బు విషయంలో అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. మీ ఇంట్లో గానీ కుటుంబ సభ్యులతో గానీ విభేదాలు లేదా ఏవైనా సమస్యలు ఉంటే ఈ వారం మీకు ఒక మంచి అవకాశం మీకు లభిస్తుంది. ఆ అవకాశంతో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఇది మీ కుటుంబ వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది.
మిగతా రాశుల వారి రాశి ఫలాలను లింక్ క్లిక్ చేసి చూడండి (తులా, వృశ్చికం, మకర, ధనుస్సు, కుంభం, మీన రాశుల రాశి ఫలాలు)