Wednesday Thoughts : అలసిన మనసుతో కాదు.. ప్రశాంతమైన మనసుతో ఆలోచించు..
Wednesday Motivation : ఆలోచనలు ప్రశాంతగా ఉంటే.. నిర్ణయాలు ప్రశాంతమైనవే ఉంటాయి. అల్లకల్లోలమైన మనుసుతో ఆలోచిస్తే.. జరిగే పరిణామాలు తర్వాత వేరుగా ఉంటాయి. నిర్ణయం తీసుకున్న సమయంలో వాటి తీవ్రత అర్థం కాదు.. కొన్ని రోజులు గడిచాక.. తెలుస్తుంది.
శారీరకారోగ్యం ఎంతో అవసరమో.. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కొన్ని నిర్ణయాలు ఆలోచించకుండా.. తీసుకుంటాం. తర్వాత వచ్చే పరిణామాలను ఎదుర్కొవడం చాలా కష్టం. అందుకే నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. తీసుకున్నాక.. ఆలోచిస్తే.. ఏం లాభం ఉండదు. కాలం వెనక్కు రాదు.. కానీ గతంలో తీసుకున్న నిర్ణయాలే.. ప్రస్తుతం మీద ప్రభావం చూపిస్తాయి.. భవిష్యత్ ను అల్లకల్లోలం చేస్తాయి. అందుకే ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ మీద ప్రభావం ఉండకుండా చూసుకోవాలి. ఏ విషయాన్నైనా ప్రశంతంగా ఆలోచించాలి. ఇక్కడో స్టోరీ ఉంది.. మీకోసం..
ఒక రైతు ధాన్యం కొట్టులో తన చేతి గడియారాన్ని పోగొట్టుకున్నాడు. అదంటే రైతుకు చాలా ఇష్టం. తన కొడుకు బహుమతిగా ఇచ్చింది. దాని కోసం ఎంత వెతికినా.. దొరకలేదు. ఇక పోయిందిలే అని బాధపడుతున్నాడు రైతు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. వాళ్లను పిలిచి.. గడియారం వెతికి ఇస్తే.. మంచి బహుమతి ఇస్తానని చెబుతాడు. పిల్లలు ఎంత వెతికినా.. దొరకదు.
ఓ పిల్లాడు వచ్చి.. నేను వెతికిస్తా.. అని చెబుతాడు. పిల్లాడి కళ్లలో రైతుకు నిజాయితీ కనిపిస్తుంది. సరే అని చెబుతాడు. కాసేపటికి పిల్లాడు గడియారం తీసుకొచ్చి రైతుకు ఇస్తాడు. ఎలా దొరికిందని.. అడుగుతాడు. మీరంతా అల్లరి చేస్తూ.. మాట్లాడుతూ.. వెతికారు. మీరు కొడుకు ఇచ్చిన గడియారం పోయిందనే బాధలో వేరో ఆలోచనల్లో ఉంటూ వెతికారు. కానీ నేను ప్రశాంతంగా చెవులు రిక్కించి విన్నాను. చిన్నగా టిక్ టిక్ అని శబ్ధం వచ్చిన వైపు వెళ్లి వెతికారు. అంతే గడియారం దొరికింది అని చెప్పాడు. పిల్లాడికి రైతు బహుమతి కొని ఇచ్చాడు.
అలా ప్రశాంతంగా ఉన్న మనసు తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉంటాయి. వాటితో సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే ఏవేవో ఆలోచనలతో.. ఎమోషనల్ గా తీసుకునే నిర్ణయాలతో చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తిరిగి చూస్తే.. ఏం ఉండదు. కోల్పోయిన జీవితం మిమ్మల్ని చూసి నవ్వుతుంది. తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని వెక్కిరిస్తాయి. అందుకే ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
చివరిగా నీకంటూ మిగిలేది.., జీవితంలో గడచిన సంవత్సరాలు కాదు.., ఆ సంవత్సరాలలో నువ్వు ఆస్వాదించిన జీవితం..
సంబంధిత కథనం