Wednesday Motivation : నువ్వు ఏమి ఇస్తే.. కాస్త ఆలస్యమైనా కర్మ నీకు అదే ఇస్తుంది..
Wednesday Motivation : కొందరు తమ జీవితంలో చాలా అహంకారంతో ఉంటారు. ఇతరులను చాలా చులకనగా చూస్తారు. అలాగే వాళ్లను ఎవరైనా చులకనగా చూస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఇంతకాలంగా తాము చేస్తుంది ఇదే అని కూడా వాళ్లు గ్రహించలేరు.
Wednesday Motivation : కొన్ని సందర్భాల్లో మనుషులను అహం చుట్టూ ముట్టేస్తుంది. నేనే గొప్ప. వీళ్లంతా నా ముందు జుజ్జూబి అనుకుంటారు. ఆ అహంకారం, పొగరుతోనే.. చుట్టూ ఉన్నవారిని చులకనగా చూస్తారు. కనీసం వాళ్లకి రెస్పెక్ట్ ఇవ్వకుండా.. వాళ్లని మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయకుండా.. వాళ్లు పుట్టిందే తమకు దాస్యం చేయడానికే అన్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈక్రమంలో తమను ఎవరైనా ఇలానే ట్రీట్ చేస్తే మాత్రం చచ్చినా తీసుకోలేరు. నన్ను ఇలా అంటాడా.. అలా చూస్తాడా అని ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటారు.
ఎవరైనా గ్రహించాల్సింది ఏమిటంటే కర్మ. నువ్వు ఏమి ఇస్తే అదే నీకు తిరిగి వస్తుందని నువ్వు గుర్తించుకోవాలి. అది ఈ రూపంలోనే వస్తుందని చెప్పలేము కానీ.. ఏ రూపంలోనైనా.. నీ దగ్గరకు అది కచ్చితంగా వస్తుంది. ఈ విషయం ఇప్పుడుకాకున్నా.. ఎప్పటికైనా తెలుస్తుంది. నువ్వు ఓ వ్యక్తికి ప్రేమను ఇచ్చి.. నాకెందుకు ప్రేమ తిరిగి రావట్లేదు అనుకోనవసరం లేదు. నీకు తెలియకుండానే.. నీ జీవితంలోకి ప్రేమ ఏ రూపంలోనైనా వస్తుంది. అలాగే నువ్వు చెడు చేస్తే.. ఆ చెడు కూడా కచ్చితంగా నీకు వచ్చి తీరుతుంది. అందుకు ఏ పని చేసే ముందు అయినా.. మనం చేసేది.. మంచా? చెడా? అని ఆలోచించుకుని ఆ పని చేయండి.
కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఎదుటి వారి పట్ల నీ అహం చూపిస్తే.. వారు కూడా నీకు అదే అహాన్ని చూపించే అవకాశం లేకపోలేదు. ఈ రోజు మీది అయినా.. రేపు వారిది అవుతుందేమో. ఆ సమయంలో మీకు భరించడం తప్పా.. ఎదురు తిరిగే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే మీరు అప్పటికే వారికి మీ శాడీజం చూపించేశారు కాబట్టి. మీకు తలవంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకరు మీతో మంచిగా ప్రవర్తించాలని కోరుకుంటే సరిపోదు. మీరు కూడా ఇతరులతో మంచిగానే ప్రవర్తించాలి. మీరు అహంకారాన్ని చూపిస్తూ.. ఇతరుల మీకు మంచిని చూపించాలంటే ఎలా కుదురుతుంది.
ముందు మీరు చేసిన తప్పులను గుర్తించండి. మీరు ఎవరి పట్ల అయితే తప్పుగా ప్రవర్తించారో వారిని క్షమించమని అడగండి. వాళ్లు క్షమిస్తారా లేదా అనేది సెకండరీ. కనీసం ఇక నుంచైనా.. మనుషులను మనుషుల్లానే ట్రీట్ చేయండి. బానీసలుగా కాదు. లేదు నేనెందుకు వాళ్లకి సారీ చెప్పాలి అనుకుంటే మాత్రం.. మీ జీవితంలో జరిగే అవమానాలకు సిద్ధమైపోండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఎంత ముఖ్యమో.. ఎదుటివాళ్లకి కూడా అంతే ముఖ్యం. మీరు దీనిని అర్థం చేసుకోకపోతే.. మిమ్మల్ని ఎవరూ బాగుచేయలేరు.
సంబంధిత కథనం