Sinus Pain Remedies | ఉదయాన్నే సైనస్ సమస్య వేధిస్తుందా? ఈ చిట్కాలతో తక్షణ ఉపశమనం!-waking up with a congested stuffy nose here are home remedies to relieve from morning sinusitis ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sinus Pain Remedies | ఉదయాన్నే సైనస్ సమస్య వేధిస్తుందా? ఈ చిట్కాలతో తక్షణ ఉపశమనం!

Sinus Pain Remedies | ఉదయాన్నే సైనస్ సమస్య వేధిస్తుందా? ఈ చిట్కాలతో తక్షణ ఉపశమనం!

HT Telugu Desk HT Telugu
Apr 11, 2023 08:31 AM IST

Sinus Pain Remedies: ఉదయాన్నే సైనస్ సంబంధింత సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయా. నిరంతరం తలనొప్పి, నాసికా రంధ్రాలు మూసుకుపోడం, శ్లేష్మం వంటివి బాధించినపుడు ఈ కింది నివారణ మార్గాలు పాటించండి.

Sinus Pain Remedies
Sinus Pain Remedies (Unsplash)

Sinusitis: సైనసైటిస్ చాలా మంది వేధించే సమస్య. సాధారణంగా సీజన్ మారినపుడు, ఉష్ణోగ్రతలలో మార్పువచ్చినపుడు సైనస్ వలన కలిగే ఇబ్బందులు ఎక్కువవుతాయి. నిరంతరమైన తలనొప్పి, మొఖం భారంగా మారినట్లు అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలను అనుభవిస్తారు. చాలా మందికి ఉదయాన్నే ఈ రకమైన సైనస్ సంబంధిత బాధలు ఉంటాయి, ఎందుకంటే నిద్రిస్తున్నప్పుడు శ్లేష్మం అంతా నిండుకుంటుంది, ఉదయానికి దాని ప్రభావం ఉంటుంది.

సైనస్ నొప్పికి ఫార్మసీ మందులు తాత్కాలిక ఉపశమనాన్ని అందించగలవు, అయితే సహజ నివారణలు (Natural Home Remedies) ఉపయోగించి చికిత్స తీసుకోవడం పలు విధాల శ్రేయస్కరం.. సైనస్ బాధ నుంచి ఉపశమనం కలిగించే ప్రభావవంతమైన ఇంటి నివారణ మార్గాలు (Sinus Pain Remedies) ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఆవిరి పీల్చడం

ఆవిరి పట్టడం ద్వారా మీకు సైనస్ సహా ఇతర సాధారణ అనారోగ్యాల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఆవిరి పీల్చడం చేస్తే మీ నాసికా భాగాలు తెరుచుకుంటాయి, తద్వారా సైనస్ నొప్పి నుండి వేగంగా ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఒక కుండ నీటిని మరిగించి, కొన్ని చుక్కల యూకలిప్టస్ లేదా పిప్పరమెంటు నూనెను కలపండి. మీ తలను టవల్‌తో కప్పి, 10 నుండి 15 నిమిషాల పాటు ఆవిరిని పీల్చుకోండి.

ఉప్పు నీరు

సైనస్ నొప్పికి సెలైన్ సొల్యూషన్ (Salt Water) మరొక ఎఫెక్టివ్ రెమెడీ. ఇది మీ నాసికా భాగాలలో శ్లేష్మం సన్నబడటానికి సహాయపడుతుంది, మీ శ్వాసను సులభతరం చేస్తుంది. సెలైన్ ద్రావణాన్ని తయారు చేయడానికి, రెండు కప్పుల గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలపండి. మీ నాసికా భాగాలలో ద్రావణాన్ని ఫ్లష్ చేయడానికి నేతి పాట్ లేదా బల్బ్ సిరంజిని ఉపయోగించండి.

అల్లం

అల్లం ఒక సహజమైన నొప్పి నిరోధక మూలకం. ఇది సైనస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఉదయాన్నే ఒక కప్పు వేడివేడి అల్లం టీని తాగండి. ప్రత్యేకంగా అల్లం డికాక్షన్ లాగా చేసుకొని తాగితే చాలా ప్రయోజనం. కొన్ని అల్లం ముక్కలను నీటిలో 10 నిమిషాలు మరిగించి, ఆపై కప్పులో వడకట్టండి, వేడివేడిగా త్రాగాలి. మీరు తినే ఆహారంలోనూ అల్లం కలుపుకొని తింటూ ఉంటే అది మీకు చాలా మంచిది.

పసుపు

తాజా పసుపులో కర్కుమిన్ ఉంటుంది, ఇది సైనస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. మీరు పసుపును మీ ఆహారంలో కలిపి తినడం లేదా పసుపు టీ తాగడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.. పసుపు టీ చేయడానికి, ఒక టీస్పూన్ తాజా పసుపు కొమ్మును నీటిలో 10 నిమిషాలు ఉడకబెట్టి, ఆపై ఈ నీటిని వడకట్టి త్రాగాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ సైనస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తాగండి. రుచికోసం ఒక టీస్పూన్ తేనెను కూడా కలపవచ్చు.

ఎసెన్షియల్ ఆయిల్స్

యూకలిప్టస్, పిప్పరమెంటు, లావెండర్ వంటి సుగంధ నూనెలు సైనస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మీరు ఈ నూనెలను కొన్ని చుక్కలు డిఫ్యూజర్‌లో కలిపి, ఆ సువాసనను పీల్చుకోవడంద్వారా ఉపశమనం పొందవచ్చు. స్నానం చేసేటపుడు గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల సుగంధ తైలం కలిపి స్నానం చేస్తే హాయిగా అనిపిస్తుంది. మీపై భారం దిగిపోయిన అనుభూతి కలుగుతుంది.

ఈ చిట్కాలతో మీ సైనస్ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే మీకు సైనస్ సమస్య ఉన్నప్పుడు పుష్కలంగా నీరు త్రాగడం, హైడ్రేటింగ్ గా ఉండటం కూడా చాలా ముఖ్యం. మీరు నీరు సమృద్ధిగా తాగితే సైనస్ నుంచి వేగంగా కోలుకోవచ్చు. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగండి. ఆల్కహాల్, కెఫిన్‌లను నివారించండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ సైనస్ నొప్పి కొనసాగితే, తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం