Vitamin E | చర్మ సౌందర్యానికి విటమిన్ ఇ వాడండి.. ఎందుకంటే..-vitamin e benefits for skin care and protection ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Vitamin E Benefits For Skin Care And Protection

Vitamin E | చర్మ సౌందర్యానికి విటమిన్ ఇ వాడండి.. ఎందుకంటే..

HT Telugu Desk HT Telugu
Apr 28, 2022 11:19 AM IST

ఏ సీజన్​లో అయినా ఆ సీజన్​కు తగ్గట్లుగా చర్మ సమస్యలు రావడం సహజం. అందుకే చర్మాన్ని కాపాడుకునేందుకు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వేలకు వేలు ఖర్చు పెట్టి.. సెలూన్​లకు వెళ్లి, బ్యూటీ ప్రొడెక్ట్స్ వాడినా ఫలితాలు దక్కవు. ఇవేమి లేకుండా జస్ట్ ఓ విటమిన్​తో మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు. అదే విటమిన్ ఇ. ఒకసారి దీనిని వాడటం మొదలుపెడితే మీరు అసలు ఆపలేరు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ ఇ ఉపయోగాలు
విటమిన్ ఇ ఉపయోగాలు

Vitamin E Benefits | విటమిన్ ఇ. ఇది ఒక అద్భుత పదార్థమని చెప్పవచ్చు. ఇది పూర్తిగా చర్మ సంరక్షణ ప్రయోజనాలతో నిండి ఉంటుంది. ఇది పర్యావరణ కాలుష్య కారకాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. అది మీ చర్మాన్ని తేమగా చేస్తుంది. దీనిని రాత్రిపూట అప్లై చేస్తే.. అపారమైన యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను ఇస్తుంది. మీ ముఖానికి సహజమైన మెరుపు ఇస్తుంది. కాబట్టి మీరు తప్పక విటమిన్ ఇ ఉపయోగించవచ్చు. దాని వల్ల కలిగే ప్రయోజనాలు, దానిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేస్ మాస్క్‌తో కలిపి..

మీ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేయడానికి మీ ఫేస్ మాస్క్‌కి విటమిన్ ఇ ఆయిల్ కలిపి తీసుకోండి. ఇది మీ చర్మాన్ని రక్షిస్తుంది. తేమను ఇస్తుంది. ఏదైనా నష్టం వల్ల కలిగే ప్రభావాలను తగ్గిస్తుంది. ముల్తానీ మట్టిలో ఐదు-ఎనిమిది చుక్కల విటమిన్ ఇ నూనె వేసి బాగా కలపాలి. దాన్ని ముఖమంతా అప్లై చేసి.. కాసేపు ఉంచి.. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

మాయిశ్చరైజర్‌తో కలిపి..

మీ రెగ్యులర్ మాయిశ్చరైజర్‌కు విటమిన్ ఇ జోడించడం వల్ల మీ చర్మానికి అదనపు హైడ్రేషన్ అందుతుంది. అంతేకాకుండా మీ చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఇది పూర్తిగా యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో నిండి ఉంటుంది. వేసవిలో చర్మానికి కలిగే ఇబ్బందిని తగ్గిస్తుంది. మీ చర్మ పనితీరును బలపరుస్తుంది. మీ మాయిశ్చరైజర్‌లో మూడు-నాలుగు చుక్కల విటమిన్ ఇ ఆయిల్‌ని మిక్స్ చేసి, మీ స్కిన్ టోనర్, సీరమ్‌ని అప్లై చేసిన తర్వాత రోజూ వాడండి.

కంటి కింద క్రీమ్‌గా..

కొల్లాజెన్-ప్రొటెక్టింగ్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన విటమిన్ ఇ.. మీ కంటి కింద ఉన్న సున్నితమైన ప్రాంతంలో డార్క్ సర్కిల్స్, ఫైన్ లైన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ పదార్ధం కంటి కింద వాపును తగ్గిస్తుంది. మీ చర్మంలో కొల్లాజెన్‌ను రిపేర్ చేస్తుంది. అంతేకాకుండా నల్ల మచ్చలను తగ్గిస్తుంది. విటమిన్ ఇ నూనెను జోజోబా నూనెతో కలపండి. ఈ ఆయిల్ మిక్స్‌తో మీ కంటి కింద భాగానికి మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచండి.

సీరమ్‌గా ఉపయోగించండి..

మార్కెట్‌లో లభించే ఖరీదైన సీరమ్‌లలో పెట్టుబడి పెట్టే బదులు, మీ రోజువారీ చర్మ సంరక్షణలో విటమిన్ ఇని ఫేస్ సీరమ్‌గా ఉపయోగించండి. ఇది మొటిమలు, హైపర్పిగ్మెంటేషన్, ఫైన్ లైన్లను తగ్గిస్తుంది. యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. నాలుగు-ఐదు చుక్కల విటమిన్ ఇ ఆయిల్‌తో మీ చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసి.. ఆపై మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి. విటమిన్ ఇ మీ చర్మంలోకి శోషించడానికి సమయం పడుతుంది కాబట్టి రాత్రివేళల్లో దీన్ని ఉపయోగించండి.

గోళ్ల పెరుగుదలకై..

మీ గోళ్లు చిట్లిపోవడం, పగుళ్లు రావడం, ఊడిపోవడం వంటి వాటితో బాధపడుతుంటే.. మీరు ఖరీదైన పార్లర్‌లోని మానిక్యూర్ సెషన్‌లను వదిలేయండి. ఇంట్లోనే మీ గోళ్లను విటమిన్ ఇ ఆయిల్‌ కాపాడుకోండి. నిద్రవేళలో కొన్ని నిమిషాల పాటు నూనెతో మీ వేళ్లను, గోళ్లను మసాజ్ చేయండి. ఆరోగ్యకరమైన, బలమైన గోర్లు పొందడానికి రాత్రి వేళల్లో దీనిని ఉపయోగించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్