Vegan Breakfast | ఈ పుడ్డింగ్ తినండి.. బరువు తగ్గించుకోండి..-vegan gluten free and no cooking required breakfast recipe is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Vegan Gluten Free And No Cooking Required Breakfast Recipe Is Here

Vegan Breakfast | ఈ పుడ్డింగ్ తినండి.. బరువు తగ్గించుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 25, 2022 10:35 AM IST

ఉదయం లేచి వండుకోవాలి అనిపించనప్పుడు, కిచెన్​లో ఎక్కువ సేపు ఉండి బ్రేక్​ఫాస్ట్ చేయాలని లేనప్పుడు, హెల్తీగా ఏమైనా తినాలన్నప్పుడు ఈ పుడ్డింగ్ మీకు మంచి ఛాయిస్ అవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అంతే కాకుండా బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక మంచి బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

వేగన్ బ్రేక్ ఫాస్ట్
వేగన్ బ్రేక్ ఫాస్ట్

Healthy Breakfast | ఈ వేగన్ బ్రేక్​ఫాస్ట్​ను వండనవసరంలేదు. పైగా ఇది గ్లూటన్ ఫ్రీ అల్పాహారంగా చెప్పవచ్చు. ఇది పూర్తిగా మంచి కొవ్వులతో, కార్బ్స్, ఎక్కువ మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ రిచ్​తో నిండి ఉంటుంది. ఈ బ్రేక్ ఫాస్ట్ మీకు స్వీట్ తినాలనే కోరికలను అదుపులో ఉంచుతుంది. అంతే కాకుండా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* అరటిపండు- 1/2 కప్పు

* చియా సీడ్స్- ఒకటిన్నర టేబుల్ స్పూన్

* బాదం- 4 (నానబెట్టినవి)

* ద్రాక్ష- పావు కప్పు

* పీనట్ బటర్- ఒకటిన్నర టేబుల్ స్పూన్

* ఖర్జూరం- 2

* కొబ్బరిపాలు- పావు కప్పు

* నీరు- పావు కప్పు

తయారీ విధానం

అరటిపండును, ఖర్జూరం ముక్కలు కలిపి పేస్ట్ చేయాలి. దీనిలో చియా సీడ్స్ వేసి.. పీనట్ బటర్ వేయాలి. కొబ్బరి పాలు, నీరు కలిపి ఓ రాత్రంతా ఫ్రిజ్​లో స్టోర్ చేయాలి. మరుసటి రోజు ఉదయం ద్రాక్ష, బాదంతో గార్నీష్ చేసి.. లేదా నచ్చిన ఫ్రూట్స్, నట్స్​తో గార్నీష్ చేసి బ్రేక్ ఫాస్ట్​గా తీసుకోవచ్చు.

ఎందుకు ఆరోగ్యవంతమైనది..

దీనిలో మొత్తం 451 క్యాలరీలు ఉంటాయి. ప్రోటీన్ 8 గ్రాములు, ఫైబర్ 10.6 గ్రాములు, ఫ్యాట్స్ (మంచివి) 26 గ్రాములు, కార్బ్స్ 50.9 గ్రాములు ఉంటాయి. ఇది పూర్తిగా ఆరోగ్యవంతమైనదే కాకుండా.. మీ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తూ.. బరువును అదుపులో ఉంచుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్