Valentines Day Singles Plans : మీకు లవర్ లేదా? నో ప్రాబ్లమ్.. ఆ రోజు ఇలా ప్లాన్ చేసేయండి-valentines day 2023 five unique ways to celebrate valentine s day for singles ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valentines Day Singles Plans : మీకు లవర్ లేదా? నో ప్రాబ్లమ్.. ఆ రోజు ఇలా ప్లాన్ చేసేయండి

Valentines Day Singles Plans : మీకు లవర్ లేదా? నో ప్రాబ్లమ్.. ఆ రోజు ఇలా ప్లాన్ చేసేయండి

Anand Sai HT Telugu
Feb 04, 2023 06:26 PM IST

Valentines Day 2023 : వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది. ఆ రోజున కొంతమంది సింగిల్స్ బాధ అంతా ఇంతా కాదు. అయ్యో నాకు లేవర్ లేదాయే.. అంటూ బాధపడుతుంటారు. కానీ లవ్ చేస్తూ.. తెచ్చుకునే తలనొప్పికంటే.. ఆ రోజున ఆనందంగా ఉండేందుకు కొన్ని ప్లాన్స్ వేసుకుంటే చాలు కదా.

వాలెంటైన్స్ డే సింగిల్స్ ప్లాన్
వాలెంటైన్స్ డే సింగిల్స్ ప్లాన్ (unsplash)

Valentines Day 2023 : ప్రేమ నెల వచ్చేసింది. వాలెంటైన్స్ వీక్(Valentines Week) ఫిబ్రవరి 7 నుంచి షురూ కానుంది. కొంతమంది సింగిల్స్ ప్రేమికుల రోజు.. అని ప్రశాంతంగా ఉండలేరు. అలా ఇంట్లో నుంచి బయటకు చూస్తే.. ఏదో ఒక ప్రేమ జంట కనిపిస్తూనే ఉంటుంది. చాలా జంటలు కనిపిస్తాయి. లవర్స్(Lovers) ఇచ్చుకునే గిఫ్ట్స్.., వాళ్లు తిరగడం చూసి.. సింగిల్స్ తెగ మండిపోతారు. అయితే వాలెంటైన్స్ డే(Valentines Day) కేవలం రిలేషన్ షిప్ లో ఉన్నవారికేనా.. సరిగా ప్లాన్ చేస్తే.. మీరు సింగిల్ అయినా ఎంజాయ్ చేయోచ్చు.

లవర్స్ డే(Lovers Day) అంటే.. కుటుంబం, స్నేహితుల పట్ల ప్రేమను, ముఖ్యంగా మన పట్ల మనకు ఉన్న ప్రేమను కూడా చూపించుకోవాలండి. ప్రేమికుల దినోత్సవం కేవలం జంటల కోసం మాత్రమే ఉద్దేశించినదని రాసి లేదు. ఒంటరిగా ఉన్నవారు ఆ రోజును జరుపుకోకూడదనే నియమం లేదు. నిజానికి ఇది.. మిమ్మల్ని మీరు అన్వేషించుకోడానికి ఓ గొప్ప రోజుగా చూసుకోండి. మన జీవితంలో చాలా మంది.. కుటుంబం, స్నేహితులతో గడిపేలా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆ రోజును ఎలా జరుపుకోవాలి అని ఆలోచిస్తున్నట్లయితే.. మీ కోసం కొన్ని టిప్స్.. ఇస్తున్నాం.

సోలో ట్రిప్ ఎప్పుడూ తప్పు కాదు. ప్రత్యేకించి మిమ్మల్ని మీరు కనుగొనే, మీ నిజమైన వ్యక్తిత్వాన్ని మీరు చూసుకునే మంచి అవకాశం. వాలెంటైన్స్ వీక్‌లో ఒంటరి ట్రిప్ మిమ్మల్ని మీతో ప్రేమ(Love)లో పడేలా చేస్తుంది. కావాల్సినంత దూరం ఒంటరిగా ప్రయాణం చేయండి. మీతో మీరు ప్రేమలో పడిపోతారు.

రోడ్డు ట్రిప్ ప్లాన్ చేసుకోండి. మీరు రొటీన్‌కు భిన్నంగా.. ప్రేమతో కూడిన ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ స్నేహితులతో కారులో వెళ్లండి.. మీకు ఇష్టమైన ప్లేలిస్ట్‌(Play List) పెట్టుకుని.. ఓ దూరమైన ప్రదేశానికి వెళ్లండి.

ఎక్కువ తిరగడం ఎందుకు అనుకుంటే.. వాలెంటైన్స్ డేను మీరు సింగిల్ గా ఎంజాయ్ చేయోచ్చు. మీరు ఫ్రెష్ గా ఉండేందుకు ఒక కప్పు కాఫీతో రోజును ప్రారంభించండి. మీకు ఇష్టమైన రెస్టారెంట్‌లోకి వెళ్లి లంచ్ చేయండి. మీకు నచ్చిన సినిమా(Cinema)కు సింగిల్ గా వెళ్లండి. సినిమాను మీతో మీరు ఎంజాయ్ చేస్తారు. అదంతా ఎందుకు అనుకుంటే.. ఇంట్లోనే ఉండి.. ఏదైనా వంటకం కొత్తగా ట్రై చేయండి.

మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను ఒకచోటకు రమ్మనండి. హౌస్ పార్టీ(House Party) ప్లాన్ చేయండి. మీకూ, మీ అతిథులకు నచ్చిన వంటకాలను వండండి. డిన్నర్ టేబుల్‌పై కూర్చొన్నాక.. చాలా ముచ్చట్లు వస్తాయి. నవ్వుతూ.. సంభాషణలతో ఆ రోజును ఆస్వాదించొచ్చు.

మీకు దగ్గరలో ఉండే ప్రకృతి ప్రదేశాలకు వెళ్లండి. పార్క్‌, సరస్సులాంటివి చూసుకుని వెళ్లొచ్చు. ఇంట్లో వాళ్లంతా ప్లాన్ చేసుకుని పిక్నిక్ వెళ్లండి. లంచ్ ప్యాక్ చేసి రోజంతా గడపొచ్చు. ఫిబ్రవరి 14న అలా కూడా ఎంజాయ్ చేయోచ్చు.

Whats_app_banner