Basil leaves | తులసి ఆకుల కషాయంతో.. రోగ నిరోధక శక్తి
Basil leaves | వాతావరణంలో మార్పుల వల్ల అనారోగ్యాలు మామూలే. జలుబు, దగ్గు, జ్వరం తదితర సమస్యలతో బాధపడుతుంటాం. అలాంటప్పుడు తులసి కషాయంతో రోగ నిరోధక శక్తిని పెంచుకుని ఈ అనారోగ్యాల బారిన పడకుండా ఉండొచ్చు.
సీజన్ మారినప్పుడు దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వస్తాయి. వీటిని ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తిని పెంచే తులసి కషాయం తాగుతుండాలి. తులసి కషాయం తాగడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను తగ్గించడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి దోహద పడతాయి. ఇలా తులసి కషాయాన్ని పరగడుపునే తాగటం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులను పచ్చిగా తినడం కంటే కషాయంగా తయారు చేసుకొని తాగడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
తయారు చేసుకునే విధానం
కొద్దిగా నెయ్యి వేసుకుని జీలకర్ర, నల్ల మిరియాలను దోరగా వేయించుకుని పొడి చేసి పెట్టుకోవాలి. మరొక గిన్నెలో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు నీటిని పోసి మరిగిస్తుండాలి. ఈ నీరు కొద్దిగా దగ్గర పడగానే అందులో మిరియాలు, జీలకర్ర పొడి వేసి ఉడికించాలి. తరువాత ఈ నీటిలో కొన్ని తులసి ఆకులను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ తులసి కషాయంలో కొద్దిగా తేనె కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగవచ్చు.
తులసి కషాయం చేయడం ఇబ్బంది అనుకుంటే మార్కెట్లో తులసీ రసంతో చేసిన ఆయుర్వేద ఉత్పత్తులు చాలా లభిస్తున్నాయి. మీ సమస్యకు ఉపశమనం లభించే ఉత్పత్తులను గమనించి వాడవచ్చు. లేదా ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినా ప్రయోజనకరంగా ఉంటుంది.
సంబంధిత కథనం