Toyota Fortuner GR- S | మరింత దృఢంగా, స్పోర్టియర్ లుక్‌తో టయోట ఫార్చ్యూనర్ కార్!
టయోటా ఫార్చ్యూనర్ GR స్పోర్ట్ SUV కారు భారత మార్కెట్లో విడుదల అయింది. దీని ధర ఎంత, ప్రత్యేకతలు ఏమున్నాయి? తదితర విషయాలు ఇక్కడ తెలుసుకోండి..
జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా తాజాగా 'ఫార్చ్యూనర్ GR స్పోర్ట్' SUV వాహనాన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది చూడటానికి ప్రామాణిక ఫార్చ్యూనర్ లెజెండర్ కారుకు కొద్దిగా స్పోర్టియర్ లుక్‌ను కలిగి ఉంటుంది. ఇందులో GR అంటే టయోటా పనితీరులో మెరుగైన యూనిట్‌గా పేర్కొనే 'గజూ రేసింగ్' అనే అర్థాన్ని సూచిస్తుంది.
సరికొత్త ఫార్చ్యూనర్ GR స్పోర్ట్ రాకతో భారత మార్కెట్లో ఫార్చ్యూనర్ కారు ఇప్పుడు మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. మొదటిది ఫార్చ్యూనర్ స్టాండర్డ్ మోడల్ ధర, రూ. 31.79 లక్షలు ఉండగా, లెజెండర్ ధర, రూ. 40.91 లక్షలు ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి టాప్- ఎండ్ వెర్షన్‌గా వచ్చిన ఫార్చ్యూనర్ GR-S ధర, ఎక్స్-షోరూం వద్ద రూ. 48.3 లక్షలుగా నిర్ణయించారు.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఫార్చ్యూనర్ GR-Sలో ఫీచర్స్ దాదాపు లెజండర్ మోడల్‌లో ఉన్నట్లుగానే ఉంటాయి. అయితే కొత్తగా ఈ కారులో స్టీరింగ్ వీల్‌స్టార్ట్-స్టాప్ బటన్‌పై GR బ్యాడ్జింగ్, కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్పోర్టివ్‌గా కనిపించే పెడల్స్, GR-S వైర్‌లెస్ ఛార్జర్, JBL సౌండ్ సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్, 8.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇచ్చారు.
ఇంజన్ కెపాసిటీ
టయోటా ఫార్చ్యూనర్ GR స్పోర్ట్ 2.8-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 500 Nm గరిష్ట టార్క్‌తో 201 bhp శక్తిని విడుదల చేస్తుంది. ఈ పవర్‌ప్లాంట్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, పాడిల్-షిఫ్టర్‌లతో వస్తుంది. ఇందులో పెట్రోల్ వెర్షన్ అందుబాటులో లేదు.
సంబంధిత కథనం