Tonsillitis Prevention : మీ గొంతులో టాన్సిల్స్ ఉన్నాయా? ఇంటి నివారణ చిట్కాలు ఇవే
Tonsillitis Prevention : చిన్నపిల్లల్లో సాధారణంగా కనిపించే ఇబ్బందుల్లో టాన్సిల్స్లిటిస్ కూడా ఒకటి. ఇది కేవలం పిల్లలకే కాదు.. వయసుతో సంబంధం లేకుండా అందిరిని ఇబ్బంది పెడుతుంది. అసలు టాన్సిల్స్ రావడానికి కారణాలు ఏమిటి? దాని లక్షణాలు, నివారణ చర్యలు, ఇంటి చిట్కాలతో దీనినుంచి ఎలా ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Tonsillitis Symptoms & Treatment : టాన్సిల్స్లిటిస్ అనేది సాధారణ అనారోగ్యం. నోటిలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లతో టాన్సిల్స్ వస్తాయి. టాన్సిల్స్ మీ గొంతు వెనుక భాగంలో శోషరస కణజాలంలో గడ్డలను ఏర్పరుస్తాయి. టాన్సిల్స్‌కు బ్యాక్టీరియా లేదా వైరస్ సోకినప్పుడు అవి విస్తరిస్తాయి. ఇది పిల్లలలో ఒక సాధారణ వ్యాధి. అయితే చాలా సమయం తర్వాత.. దానంతట అవే క్లియర్ అవుతాయి. మరి దీని లక్షణాలు, ఇంటి నివారణ చిట్కాలు, నివారణ చర్యలు, చికిత్స వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాన్సిల్స్లిటిస్ లక్షణాలు ఏమిటి?
టాన్సిల్స్లిటిస్ లక్షణాలు గొంతు నొప్పి, మింగేటప్పుడు ఇబ్బంది లేదా నొప్పి, గీతలుగా ధ్వనించే స్వరం, జ్వరం, మెడ గట్టిపడటం వంటి లక్షణాలు కలిగి ఉంటాయి.
మెడలో శోషరస గ్రంథులు విస్తరించి.. మీ కడుపు, చెవులు, తలలో నొప్పులను కూడా అనుభవించవచ్చు. ఈ లక్షణాలు సాధారణ జలుబు మాదిరిగానే అనిపిస్తుంది.
టాన్సిలిటిస్‌కు కారణమేమిటి?
టాన్సిల్స్ తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మీ నోరు, ముక్కు ద్వారా మీ శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
సాధారణ జలుబు లేదా ఇన్ఫ్లుఎంజా వైరస్ టాన్సిలిటిస్‌ను ప్రేరేపించగలవు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, సాధారణంగా గ్రూప్ A స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా కూడా ఒక కారణం కావచ్చు. స్ట్రెప్, ఇతర బ్యాక్టీరియాలోని ఇతర జాతులు కూడా టాన్సిలిటిస్‌కు కారణం కావచ్చు.
ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు?
మీరు టాన్సిల్స్లిటిస్‌ను పూర్తిగా నిరోధించలేనప్పటికీ.. ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి మీరు కొన్ని ఫాలో అవ్వొచ్చు.
* టాన్సిలిటిస్‌ను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం మీ చేతులను కడగడం. ముఖ్యంగా తుమ్ములు లేదా దగ్గు తర్వాత మీ చేతులును శానిటైజ్ చేసుకోండి.
* నోటి పరిశుభ్రత పట్ల కచ్చితంగా కేర్ తీసుకోండి.
* ఇన్ఫెక్షన్ తర్వాత మీ టూత్ బ్రష్‌లను మార్చాలని గుర్తుంచుకోండి.
* ఆహారం, తాగే గ్లాసులు, నీటి సీసాలు లేదా పాత్రలను పంచుకోవడం మానుకోండి.
టాన్సిల్స్లిటిస్ కోసం ఇంటి నివారణలు
* గోరువెచ్చని నీటితో పుక్కిలించి నోటిని శుభ్రం చేసుకోండి. ఇది గొంతు నొప్పి, టాన్సిలిటిస్ వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
* అసౌకర్యాన్ని తగ్గించడానికి టీ లేదా కాఫీ వంటి వెచ్చని పానీయాలు తాగండి.
* మీ గొంతుపై ఐస్ క్యూబ్స్ పెట్టవచ్చు. ఇది నొప్పి, వాపు తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.
* హ్యూమిడిఫైయర్లను వాడండి. గాలి పొడిగా ఉంటే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
టాన్సిల్స్లిటిస్ కోసం చికిత్స
టాన్సిల్స్లిటిస్ చికిత్స అనేది ఇన్ఫెక్షన్ వైరల్ లేదా బాక్టీరియా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణ జలుబు దానంతటదే మాయమైనట్లే.. టాన్సిలిటిస్ అనేక కేసులు వాటంతట అవే నయం అవుతాయి.
పుష్కలంగా విశ్రాంతి, సరైన ఆర్ద్రీకరణ, నొప్పికి మందులు వంటి తగిన సహాయక సంరక్షణ సహాయకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక టాన్సిల్ ఇన్ఫెక్షన్ విషయంలో.. మీరు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం