Tomato Rice Recipe : టొమాటో రైస్​తో లంచ్.. తయారు చేయడం చాలా సింపుల్..-tomato rice for lunch here is the simple recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato Rice Recipe : టొమాటో రైస్​తో లంచ్.. తయారు చేయడం చాలా సింపుల్..

Tomato Rice Recipe : టొమాటో రైస్​తో లంచ్.. తయారు చేయడం చాలా సింపుల్..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 04, 2024 01:46 AM IST

Tomato Rice Recipe : టొమాటో కర్రీ అందరికీ తెలిసిందే. సింపుల్​గా చేసుకోగలిగే కర్రీలలో ఇది ఒకటి. అందుకే బ్యాచిలర్స్ ఎక్కువగా టొమాటోలు తీసుకెళ్తారు. అయితే రోజూ ఆ కర్రీ తిని బోర్​ కొడితే.. వాటితో మీరు చక్కని డిష్ తయారు చేసుకోవచ్చు. అదే టొమాటో రైస్. దీనిని తయారు చేయడం చాలా సులభం కూడా.

టొమాటో రైస్
టొమాటో రైస్

Tomato Rice Recipe : మధ్యాహ్నం లంచ్​ వండుకోవాలంటే బద్ధకంగా ఉందా? అయితే మీరు ఈజీగా, టేస్టీగా లంచ్ తయారు చేసుకోగలిగే ఓ రెసిపీ ఇక్కడ ఉంది. అదే టొమాటో రైస్. దీనిని తయారు చేయడం చాలా సులభం. అంతేకాకుండా రొటీన్​గా అన్నం, కర్రీ తినకూడదు అనుకునేవారికి.. ఆఫీస్​కి హాడావుడిగా వెళ్లేవారికి ఈ రెసిపీ చాలా నచ్చుతుంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

yearly horoscope entry point

కావాల్సిన పదార్థాలు

* బియ్యం - 2 కప్పులు (కడిగి నానబెట్టినవి)

* పుదీనా - 2 టేబుల్ స్పూన్లు (కట్ చేసినవి)

* కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు (కట్ చేసినవి)

* నెయ్యి - పావు కప్పు

* దాల్చిన చెక్క పొడి - 1/4 టీస్పూన్ లేదా చిన్న చెక్క వేసుకోవచ్చు..

* లవంగాలు - 4

* ఏలకులు - 2

* ఉల్లిపాయలు - అరకప్పు (తరిగినవి)

* అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు

* టమాటాలు - 5 (ప్యూరీ చేసుకోవాలి)

* పచ్చిమిర్చి - 4

* ఉప్పు - తగినంత

* కొత్తిమీర - గార్నిష్ కోసం

టొమాటో రైస్ తయారీ విధానం

ముందుగా టొమాటోలను ఉడకబెట్టి.. బ్లెండర్​లో వేసి ప్యూరీ చేయండి. ఇప్పుడు ఓ పాన్ తీసుకుని.. దానిలో నెయ్యి వేసి వేడి చేయండి. దానిలో దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయండి. అనంతరం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించండి. అవి వేగాక.. దానిలో టమోటో ప్యూరీ వేసి బాగా వేయించండి. పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపండి. బియ్యం, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలపండి. ఇప్పుడు దానిలో 3 కప్పుల నీరు వేసి మరిగించాలి. వేడిని తగ్గించి, మూతపెట్టి, ద్రవం అంతా పీల్చుకునే వరకు అన్నం ఉడికించాలి. అంతే వేడి వేడి టొమాటో రైస్ రెడీ. కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించేసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం