Today Breakfast | బ్రెడ్​ లేకుండా శాండ్ విచ్.. సింపుల్​ రెసిపీ ఇదే..-today breakfast special is sandwich breakfast with out bread ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Special Is Sandwich Breakfast With Out Bread

Today Breakfast | బ్రెడ్​ లేకుండా శాండ్ విచ్.. సింపుల్​ రెసిపీ ఇదే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 04, 2022 07:10 AM IST

ఉదయాన్నే శాండ్ విచ్​ తినే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇది తేలికగా అయిపోతుందనే నమ్మకంతో చాలా మంది ప్రజలు దీని వైపు మొగ్గు చూపుతారు. అయితే బ్రెడ్​ లేకుండా శాండ్​ విచ్​ చేయడం ఎలానో మీకు తెలుసా? తెలియకపోతే మీరు కూడా బ్రెడ్​ లేకుండా శాండ్​ విచ్​ చేసుకుని.. ఆస్వాదించేయండి.

శాండ్ విచ్
శాండ్ విచ్

Today Breakfast | బ్రెడ్​ లేకుండా శాండ్ విచ్. వినడానికి వెరైటీగా ఉంది కాదా. వెరైటీనే కాదండోయ్.. ఇది చేయడం కూడా చాలా సులువు. అయితే ఈ శాండ్ విచ్​ చేయడానికి కావాల్సిన పదార్థాలేమిటో.. వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* రవ్వ - 1 కప్పు

* పెరుగు - కప్పు

* కారం - 1 స్పూన్

* ఉప్పు - తగినంత

* నీరు - కప్పు

* క్యారెట్ - 1 (సన్నగా తరగాలి)

* ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)

* స్వీట్ కార్న్ - 2 టేబుల్ స్పూన్లు

* క్యాప్సికమ్ - 1 (సన్నగా తరగాలి)

* కొత్తిమీర - (సన్నగా తరగాలి)

* వెన్న - తగినంత

* చీజ్ స్లైస్ - 1

తయారీ విధానం

ముందుగా ఒక పెద్ద గిన్నెలో రవ్వ, పెరుగు, కారం, ఉప్పు తీసుకుని బాగా కలపాలి. దానిలో కప్ నీరు వేసి బాగా కలపండి. క్యారెట్, ఉల్లిపాయ, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, కొత్తిమీర వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టేయండి.

అనంతరం కప్​ నీరు వేసి బాగా కలపండి. అప్పుడు అది మెత్తని పిండిలా తయారవుతుంది. ఇప్పుడు శాండ్‌విచ్ మేకర్‌కు కొద్దిగా వెన్నతో గ్రీజు పూయండి. పిండి నురుగుగా మారిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ పిండిని శాండ్‌విచ్ మేకర్‌కు బదిలీ చేయండి. చీజ్​ స్లైస్​ను ఉంచండి. అది శాండ్‌విచ్ పరిమాణంలో ఉండేలా చూసుకోండి.

అనంతరం దానిని పిండితో కప్పండి. అది ఏకరీతిలో ఉందని నిర్ధారించుకున్న తర్వాత.. శాండ్‌విచ్ మేకర్ మూతను వేసి గట్టిగా నొక్కండి. శాండ్‌విచ్ బంగారు గోధుమ రంగులోకి మారే వరకు, ఏకరీతిలో ఉడికినంత వరకు గ్రిల్ చేయండి. చివరిగా టొమాటో సాస్‌తో బ్రెడ్ లేకుండా శాండ్‌విచ్​ను ఆస్వాదించవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్