Palak Vada recipe : క్రంచీగా, టేస్టీగా పాలకూర వడలు చేసేయండి.. హ్యాపీగా లాగించేయండి
Palak Vada recipe : ఒక్కోసారి మనసు టేస్ట్‌ని కోరుకుంటుంది. అలాంటప్పుడు డైట్‌ని పక్కన పెట్టి.. ఏదైనా తినేయాలి అనిపిస్తుంది. అయితే టేస్ట్‌తో పాటు.. ఆరోగ్యానికి మంచి చేసే ఫుడ్‌ని తీసుకోవడం ఈ సమయంలో మంచి ఎంపిక. కాబట్టి పాలకూర వడలు ట్రై చేయండి.
Palak Vada recipe : ఉదయాన్నే క్రంచీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తినాలనుకునేవారికి పాలకూర వడలు బెస్ట్ ఆప్షన్. ఇది డీప్ ఫ్రై చేస్తాము అని భాదపడినా.. దానిలోని పాలకూర మనకు కచ్చితంగా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. పైగా దీని రుచి కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మరి ఈ పాలకూర వడలు ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* పచ్చి శనగపప్పు - ఒకటిన్నర కప్పు (నానబెట్టినవి)
* పాలకూర - 1 కప్పు (కడిగి తరిగి పెట్టుకోవాలి)
* పచ్చిమిర్చి - 2-3
* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
* కారం - 1 టీస్పూన్
* సాల్ట్ - తగినంత
పాలకూర వడలు తయారు చేసే విధానం
ముందుగా నానబెట్టిన శనగ పప్పును మిక్సీలో వేసి మంచిగా పేస్ట్ అయ్యే వరకు మిక్సీ చేయాలి. దీనిలో పాలకూర, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతె పొడి, సాల్ట్, కారం వేసి బాగా కలపండి. దీనిలో కొద్దిగా నీరు (అవసరమైతే) వేసి కలపండి.
స్టౌవ్ వెలిగించి.. డీప్ ఫ్రై కోసం కడాయిలో నూనె వేయాలి. అది వేడిగా అయ్యాక.. పిండిని తీసుకుని చిన్న భాగాన్ని వడ లెక్క ఒత్తుకుని.. దానిని నూనెలో వేయాలి. వాటిని డీప్ ఫ్రై చేయండి. అంతే వేడి వేడి పాలకూర వడలు రెడీ. ఉదయాన్నే ఈ క్రంచీ వడలను కెచప్, పుదీనా లేదా చింతపండు చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోద్ది. లేదంటే.. మంచి అల్లం టీ పెట్టుకుని.. దానికి తోడుగా తీసుకున్నా.. మీ కడుపు ఫుల్ అయిపోతుంది.
సంబంధిత కథనం