Breakfast Recipe : మలై టోస్ట్.. ఒక్కసారి తింటే అవుతుంది మీ ఫెవరెట్
Malai Toast : ఉదయాన్నే సింపుల్‌గా తయారు చేసుకోగలిగే అల్పాహారాలలో ఒకటి బ్రెడ్ టోస్ట్. అయితే దీనిని మలైతో కలిపి తీసుకుంటే ఆహా అనాల్సిందే. మరి సింపుల్, టేస్టీ మలై టోస్ట్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Malai Toast : రుచికరమైన టోస్ట్ ఏ సమయంలోనైనా మీ మనసు దోచేస్తుంది. రుచికరం అంటే ఎక్కువ సమయం పడుతుంది అనుకుంటున్నారెమో.. చాలా తక్కువ టైమ్‌లో దీనిని రెడీ చేసుకోవచ్చు. అదే మలై టోస్ట్. దీనిని మలై క్రీంతో పాటు చక్కెరతో కలిపి చేస్తారు కాబట్టి ఇది గొప్ప రుచిని అందిస్తుంది. ఈ క్రిస్పీ టోస్ట్ ఒక కప్పు వేడి టీతో మరింత రుచిగా ఉంటుంది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రెండింగ్ వార్తలు
కావాల్సిన పదార్థాలు
* మలై - 3 టేబుల్ స్పూన్లు
* చక్కెర - 1 టేబుల్ స్పూన్
* బ్రెడ్ - 2
మలై టోస్ట్ తయారీ విధానం
ముందుగా టోస్టర్లో బ్రెడ్ స్లైస్‌లను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు టోస్ట్ చేయండి. అవి ఫ్రై అయ్యాయని నిర్ధారించాక.. దానిపై మలై క్రీమ్‌ను వేయండి. దానిపై పంచదార వేస్తే సరి. మీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ. దీనిని ఒక కప్పు వేడి టీతో తీసుకుంటే.. హాయిగా ఉంటుంది.
సంబంధిత కథనం
Breakfast Recipe : ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంచే.. బ్రోకలీ ఓట్స్ స్మూతీ
September 03 2022
Breakfast Recipe : స్వీట్ తినాలనే కోరికను ఇలా హెల్తీగా తీర్చుకోండి..
September 02 2022
Breakfast Recipe : పోషకాలకు పవర్‌హౌస్.. పుచ్చకాయ, స్ట్రాబెర్రీ స్మూతీ..
September 01 2022