Idly with Rice | రాత్రి వండిన అన్నం మిగిలిపోయిందా? అయితే ఇడ్లీలు చేసేయండి..-today breakfast recipe is idly with left over rice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Idly With Rice | రాత్రి వండిన అన్నం మిగిలిపోయిందా? అయితే ఇడ్లీలు చేసేయండి..

Idly with Rice | రాత్రి వండిన అన్నం మిగిలిపోయిందా? అయితే ఇడ్లీలు చేసేయండి..

HT Telugu Desk HT Telugu
May 25, 2022 07:52 AM IST

ఎంత కాదనుకున్న ఒక్కోసారి వండిన అన్నం మిగిలిపోతుంది. కొందరు పులిహరో, ఫ్రైడ్ రైసో ఏదోకటి చేసుకుని తినేస్తారు. అయితే ఉదయాన్నే అన్నం తినాలని అనిపించని వాళ్లు దానిని ఏమి చేయాలో తెలియక పడేస్తారు. అలా పడేయకుండా రైస్​తో మంచిగా ఇడ్లీలు చేసుకుని ఆస్వాదించేయండి.

<p>మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీలు</p>
మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీలు

Idly with Leftover Rice | మిగిలిన అన్నం పడేస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. కానీ ఉదయాన్నే అన్నం తినాలని అనిపించదు. అలాంటివారు మంచిగా మిగిలిన అన్నంతో ఇడ్లీలు చేసుకుని తినేయండి. మిగిలిన అన్నంతో ఇడ్లీలా అనుకుంటున్నారా? వాటిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* వండిన అన్నం - 1½ కప్పు (మిగిలినది)

* రవ్వ - 1 కప్పు

* నీరు - 1 కప్పు

* పెరుగు - 1 కప్పు

* ఉప్పు - తగినంత

తయారీ విధానం

ముందుగా బ్లెండర్​లో వండిన అన్నం తీసుకుని.. నీరు కలపండి. దానిని మెత్తని పేస్ట్ అయ్యేలా చేయండి. ఆ పిండిని పెద్ద గిన్నెలోకి తీసుకుని.. పక్కన పెట్టండి. ఒక పాన్‌లో రవ్వను వేసి పొడిగా వేయించండి. ఇది కాస్త సుగంధమైన వాసన వచ్చేవరకు తక్కువ మంటపై కాల్చండి. పూర్తిగా చల్లారిన తర్వాత.. అన్నం పిండిలో దీనిని వేయాలి.

దానితో పాటు పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. పిండి బాగా కలిసే వరకు 3 నిముషాల పాటు బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని 20 నిముషాలు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు పిండి స్థిరత్వాన్ని సర్దుబాటు చేయడానికి అవసరమైనన్ని నీటిని జోడించాలి.

ఇప్పుడు ఇడ్లీ పిండిని నూనెరాసిన ఇడ్లీ ప్లేట్​లో పోయాలి. మీడియం మంట మీద 13 నుంచి 15 నిముషాలు ఆవిరి చేయండి. అంతే రైస్ ఇడ్లీ రెడీ. హాట్ హాట్ చట్నీతో దీనిని లాగిస్తే సరి. మరి ఇంకేం ఆలస్యం మీ ఇంట్లో కూడా మిగిలిపోయిన అన్నం ఉందా? ట్రై చేసేయండి ఈ ఇడ్లీలు..

 

Whats_app_banner

సంబంధిత కథనం