Breakfast Recipes : అమెరికన్ స్టైల్​లో ఎగ్​ టోస్ట్​.. ఈజీ రెసిపీ.. -today breakfast recipe is egg in a blanket here is the recipe and ingredients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipes : అమెరికన్ స్టైల్​లో ఎగ్​ టోస్ట్​.. ఈజీ రెసిపీ..

Breakfast Recipes : అమెరికన్ స్టైల్​లో ఎగ్​ టోస్ట్​.. ఈజీ రెసిపీ..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 22, 2022 07:36 AM IST

వర్షాకాలంలో కాస్త స్పైసీగా.. కొత్తగా ఏమైనా తినాలనిపిస్తుంది. కానీ ఈజీగా చేసుకునేందుకు రెసిపీలు మీకు అందుబాటులో లేకపోవచ్చు. ఆ సమయంలో మీరు ఈ అమెరికన్ స్టైల్ ఎగ్​ రెసిపీని ట్రై చేయవచ్చు. ఎక్కువ టైమ్ తీసుకోకుండా.. కొత్తగా, టేస్టీగా తినాలనుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు.

<p>ఎగ్ రెసిపీ</p>
ఎగ్ రెసిపీ

Breakfast Recipes : మీరు ఎగ్​ టోస్ట్​ను ఎన్నోసార్లు మీ బ్రేక్​ఫాస్ట్​లో చేర్చుకుని ఉండొచ్చు. కానీ ఈ సారి మీరు కొత్తగా.. కాస్త ఫన్నీగా ట్రై చేయాలనుకుంటే అమెరికన్ స్టైల్​లో ఎగ్​ ఇన్​ ఎ బ్లాంకెట్​ రెసిపీని ట్రై చేయవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎక్కువ సమయం కూడా తీసుకోదు. అంతేకాకుండా ఇది రుచికరమైనది.. ఆరోగ్యకరమైనది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు చుద్దాం.

కావాల్సిన పదార్థాలు

* గుడ్లు - 2

* బ్రౌన్ బ్రెడ్ - 2

* వెన్న - 2 స్పూన్స్

* చిల్లీ ఫ్లేక్ - రుచికి తగినంత

* ఒరేగానో - రుచికి తగినంత

* ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం

గుండె ఆకారంలో లేదా వేరే ఇతర ఆకరంలోనైనా ఉన్న కుకీ కట్టర్‌ని తీసుకోండి. దానితో ఒక్కో బ్రెడ్​ స్లైస్​ల మధ్య భాగాన్ని కత్తిరించండి. అనంతరం పాన్‌లో 1 స్పూన్ బటర్‌ వేసి వేడి చేయండి. వేడి అయినా తర్వాత.. ఒక బ్రెడ్ స్లైస్‌ను బటర్​పై ఉంచండి. మంటను తక్కువగా ఉంచి.. అది గోధుమ రంగులోకి మారేవరకు ఉంచండి. తర్వాత దానిని మరో వైపు తిప్పండి.

ఇప్పుడు గుండె ఆకారపు లేదా వేరే ఇతర ఆకారాల్లో బ్రెడ్​ స్లైస్​ మధ్యలో గుడ్డును నెమ్మదిగా పగలగొట్టండి.  అనంతరం పాన్‌ను ఒక మూతతో కప్పి.. 3-4 నిమిషాలు ఉడికించాలి. గుడ్డు ఉడికిందో లేదో తనిఖీ చేయండి. ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత దానిని ప్లేట్‌లోకి తీసుకోండి. ఇతర బ్రెడ్ స్లైస్‌తో ఇదే ప్రక్రియను పునరావృతం చేయండి. ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానోతో సీజన్ చేయండి. వేడి వేడిగా లాగించేయండి. 

Whats_app_banner

సంబంధిత కథనం