Breakfast Dairies : ఓట్స్ దహీ మసాలా.. తింటుంటే నోరూ ఊరాలా-today breakfast is oats dahi masala here is the recipe and ingredients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Dairies : ఓట్స్ దహీ మసాలా.. తింటుంటే నోరూ ఊరాలా

Breakfast Dairies : ఓట్స్ దహీ మసాలా.. తింటుంటే నోరూ ఊరాలా

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 09, 2022 07:01 AM IST

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే చాలా మంది తమ డైట్​లో ఓట్స్​ను చేర్చుకుంటారు. అయితే ఓట్స్​ను డిఫరెంట్​గా తినాలనుకునే వారికి ఓట్స్ దహీ మసాలా ఓ మంచి ఎంపిక. ఇది భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. పైగా దీనిని తయారు చేయడం కూడా సులభం.

<p>ఓట్స్ దహీ మసాలా</p>
ఓట్స్ దహీ మసాలా

Breakfast Dairies | ఓట్స్​ హెల్త్​కి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది తమ బ్రేక్​ఫాస్ట్​లో ఓట్స్​ చేర్చుకుంటారు. సాధారణంగా పాలతో కలిపి ఓట్స్​ తీసుకుంటారు. కానీ మీరు వెరైటీగా ట్రై చేయాలనుకుంటే.. ఓట్స్​ దహీ మసాలా ట్రై చేయవచ్చు. మరీ ఈ వంటకం తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* ఓట్స్ - 1 కప్పు

* పెరుగు - 1/2 కప్పు

* ఉల్లిపాయ - 1 తరిగిన

* టొమాటో - 1 తరిగిన

* క్యారెట్ - 1 తరిగిన

* కారం - 1/2 టీస్పూన్

* నల్ల మిరియాలు - 1/2 టీస్పూన్

* ఉప్పు - తగినంత

* ఆవాలు - 1/2 టీస్పూన్

* జీలకర్ర గింజలు - 1/2 టీస్పూన్

* కరివేపాకు - 4-5

* ఎండు మిర్చి - 2

తయారీ విధానం

ఓట్స్​ను ఓ గిన్నెలో వేసి.. దానిలో నీరు పోసి.. అది మెత్తబడే వరకు ఉడకబెట్టాలి. అప్పటి వరకు ఉల్లిపాయలు, క్యారెట్‌లు, టొమాటోలు లేదా మీకు నచ్చిన ఏదైనా కూరగాయలను సన్నగా తరగాలి. అనంతరం ఉడికించిన ఓట్స్​ను సిద్ధం చేసుకుని ఓ గిన్నెలో వేయండి. కూరగాయలు, పెరుగు వేసి బాగా కలపండి. కారం, మిరియాల పొడి, ఉప్పు వంటి మసాలా దినుసులను వేసి.. బాగా కలపండి.

ఇప్పుడు ఒక చిన్న పాన్‌లో కొంచెం నూనె వేసి వేడి చేసి.. దానిలో ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి, జీలకర్ర వేసి తాలింపు వేయాలి. దీనిని ఓట్స్ మిశ్రమంలో కలిపి సేవించండి. అంతే సింపుల్​ ఓట్స్ దహీ మసాలా రెడీ.

Whats_app_banner

సంబంధిత కథనం