Healthy Family Relationships । బంధాలను సజీవంగా ఉంచుకోండి.. బలగం పెంచుకోండి!-tips to strengthen your bonding for healthy family relationships ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Family Relationships । బంధాలను సజీవంగా ఉంచుకోండి.. బలగం పెంచుకోండి!

Healthy Family Relationships । బంధాలను సజీవంగా ఉంచుకోండి.. బలగం పెంచుకోండి!

HT Telugu Desk HT Telugu
May 12, 2023 08:00 PM IST

Healthy Family Relationships: కుటుంబం అన్నాక సమస్యలు రాకుండా ఉండవు, కుటుంబ సభ్యులతో గొడవలు జరగకుండా ఉండవు. బంధాలు సజీవంగా ఉంచుకోవడంలో మార్గాలు చూడండి.

Healthy Family Relationships
Healthy Family Relationships (unsplash)

Healthy Family Relationships: కుటుంబం అన్నాక సమస్యలు రాకుండా ఉండవు, కుటుంబ సభ్యులతో గొడవలు జరగకుండా ఉండవు. అప్పుడప్పుడు పొరపాట్లు, తప్పులు అనేవి దొర్లుతాయి. తప్పులు చేయకుండా ఏ ఉక్కరు ఉండరు. అయితే బంధం దృఢంగా ఉండాలంటే ఎదుటివారి తప్పులను కూడా క్షమించే దయాగుణం కలిగి ఉండాలి. వారు మారటానికి అవకాశం ఇవ్వాలి. తమను తాము మెరుగుపరచుకోవడానికి కొంత అవకాశం ఇవ్వాలి. అందరూ అన్ని మంచి గుణాలనే కలిగి ఉండరు, అందరూ మీలాగా ఉండాలని కోరుకోవడమూ తప్పే.

కుటుంబంలో కొందరి మొండి వైఖరి తరచూ మిమ్మల్ని ఇబ్బందులపాలు చేస్తుండవచ్చు. మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుండవచ్చు. అయితే వారిలోని చెడు మాత్రమే కాకుండా మంచిని కూడా చూడండి. వారి ప్రవర్తనకు కారణం గ్రహించండి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎంత మానసిక వేధనను అనుభవిస్తున్నారో వారికే తెలుస్తుంది. బయటకు కఠినంగా కనిపించినా, లోలోపల చాలా సున్నితమైన మనస్కులు కూడా ఉంటారు. వారిలో తెలియని భయాలతో సతమతమవుతుండవచ్చు. అలాంటి వారితో అదేస్థాయిలో మీరు వ్యవహరిస్తే ఇంట్లో సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. నిత్యం ఘర్షణ వాతావరణం ఉంటుంది, అప్పుడు మీకే ప్రశాంతత కరువవుతుంది.

గౌరవంగా మాట్లాడండి

ఏ సంబంధానికైనా గౌరవమే ఆధారం. కుటుంబ సభ్యులు అందరూ ఒకరినొకరు పరస్పరం గౌరవించుకున్నప్పుడే వారి బంధంలో ఎలాంటి చీలికలు రావు. చిన్న, పెద్దా అని చూడకూడదు. నేను లేకపోతే మీకు చూసుకునే వారు ఎవరూ లేరు, ఎంతగానో మీ కోసం శ్రమిస్తున్నాను వంటివి ఎదుటివారిలో ఇబ్బందిని కలుగజేస్తాయి. అలాగే, ఎప్పుడైనా ముందు ఒకటి, వెనకొకటి మాట్లాడకూడదు. వారి ఉన్నపుడు మంచిగా మాట్లాడి, వారు లేనప్పుడు వారి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఎప్పుడైనా ఒకేలా ధైర్యంగా మాట్లాడటమే ఆ బంధానికి మీరు ఇస్తున్న ఒక గౌరవం.

అతిహాస్యం

ఆటపట్టించడం, హాస్యం చేయడం అనేది ఏ బంధంలో అయిన ఒక భాగమే. కానీ, గీత దాటకుండా జాగ్రత్త వహించాలి. ఎదుటి వారి గురించి అవహేళన చేస్తూ మాట్లాడకండి. వారి రంగు, రూపం, శరీరాకృతి గురించి లేదా వారి బలహీనతల గురించి పదేపదే ఎత్తిచూపకూడదు.

గొడవను కొనసాగించకండి

గొడవ సద్దుమణిగాక మళ్లీ తట్టిలేపినపుడు అది మరింత పెద్దగా మారుతుంది. దీర్ఘకాలం పాటు గొడవను కొనసాగించటం వలన బంధాలు దూరమవుతాయి. ఒకసారి దూరం అయిన బంధాలు మళ్లీ ఏదో సందర్భంలో కలిసిపోయినా, పాత జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. పగిలిన అద్దం అతికిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీ బంధం.

Whats_app_banner

సంబంధిత కథనం