Preventing Pink Eye। కండ్లకలక మీకు రావొద్దంటే.. ఈ చిట్కాలు పాటించండి!
Preventing Pink Eye: కండ్లకలక దైనందిన జీవితానికి అంతరాయం కలిగిస్తుంది, సాధారణ కార్యకలాపాలపై దృష్టి పెట్టడంను కష్టతరం చేస్తుంది. కండ్లకలకను ఎదుర్కోవటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు తెలుసుకోండి.
Preventing Pink Eye: ఇటీవల కాలంలో చాలా మందికి కళ్లు మండటం, కంటిలో దురద, కళ్లు ఎరుపెక్కడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కంటి ఫ్లూ సాధారణ లక్షణాలు, దీనిని వైరల్ కంజక్టివిటిస్ లేదా కండ్లకలక అని కూడా పిలుస్తారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత గాలిలోని తేమ, ఉక్కపోత పరిస్థితులు బ్యాక్టీరియా, వైరస్లు వ్యాప్తి చెందడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తాయి. దీని వలన కండ్లకలక సోకే అవకాశాలు పెరుగుతాయి. కండ్లకలక కొన్నిసార్లు అంటువ్యాధిగా కూడా పరిణమిస్తుంది. ఈ పరిస్థితిలో ఇన్ఫెక్షన్ సోకిన ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కండ్లకలక దైనందిన జీవితానికి అంతరాయం కలిగిస్తుంది, సాధారణ కార్యకలాపాలపై దృష్టి పెట్టడంను కష్టతరం చేస్తుంది. కండ్లకలకను ఎదుర్కోవటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు తెలుసుకోండి.
మంచి పరిశుభ్రత పాటించడం
కండ్లకలక నివారణకు ప్రథమమైనది మంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం. బయట ఏవైనా ఉపరితలాలను తాకకుండా ఉండటం, సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం చేయాలి. ముఖ్యంగా డోర్క్‌నాబ్‌లు, హ్యాండ్‌రెయిల్‌లు లేదా షేర్డ్ పరికరాలను తాకిన తర్వాత చేతులు కడుక్కోవాలి. పరిశుభ్రంగా లేని చేతులతో కళ్లను తాకడం కూడా మానుకోవాలి. ఇది కళ్లలోకి జెర్మ్స్ , బ్యాక్టీరియా బదిలీకి దారి తీస్తుంది, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.
కళ్లను రుద్దకండి
వర్షాకాలంలో గాలిలో అనేక రకాల అలెర్జీ కారకాలు ఉంటాయి. ఇవి కళ్లలో దురదను కలిగిస్తాయి, అయితే దురద కలిగినపుడు కళ్లను మీ చేతులతో రుద్దకుండా ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది సంక్రమణను మరింత తీవ్రతరం చేస్తుంది. ఒకవేళ మీకు కంటిలో దురదను అనుభవిస్తే, ఒక శుభ్రమైన, మృదువైన వస్త్రాన్ని ఉపయోగించి ఆ ప్రాంతాన్ని సున్నితంగా నొక్కాలి.
లూబ్రికేటింగ్ కంటి చుక్కలు
కృత్రిమ కన్నీళ్లు లేదా లూబ్రికేటింగ్ కంటి చుక్కలు ఈ వర్షాకాలంలో మీ కళ్లకు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు. మీకు సున్నితమైన కళ్ళు ఉంటే, కంటి దురదతో ఇబ్బందిపడుతుంటే ఈ చుక్కలు మీ కళ్లను తేమగా ఉంచడంలో సహాయపడతాయి, మీ కళ్లలోకి ప్రవేశించిన అలెర్జీ కారకాలను కడిగివేయడంలో సహాయపడతాయి. అయితే స్టెరాయిడ్ కంటిచుక్కలను ఉపయోగించవద్దు. మీరు ఏదైనా ఐ డ్రాప్‌ను ఉపయోగించే ముందు కంటి వైద్య నిపుణుడిని తప్పకుండా సంప్రదించండి.
వస్తువులు పంచుకోవద్దు
వర్షాకాలం అంటే కండ్లకలక వేగంగా వ్యాపించే సమయం. ఇటువంటి సందర్భంలో మీ టవల్స్, రుమాలు, గాగుల్స్ లేదా మేకప్ సామాగ్రి వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవడం మానుకోవాలి, ఇతరుల వస్తువులను కూడా మీరు ఉపయోగించకుండా ఉండాలి. ఎందుకంటే ఈ వస్తువుల ద్వారా ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరి వ్యాప్తి అవుతుంది.
సన్ గ్లాసెస్ ధరించండి
మీరు వర్షాకాలంలో బహిరంగ కార్యకలాపాలను ప్లాన్ చేస్తుంటే, లేదా సమూహంలో తిరగాల్సి వస్తే సన్ గ్లాసెస్ వంటి రక్షణ కళ్లద్దాలను ధరించండి. ఇది హానికరమైన UV కిరణాల నుండి మీ కళ్ళను రక్షించడమే కాకుండా, దుమ్ము, చెత్త, వర్షపునీటి నుంచి మీ కళ్లకు రక్షణ కవచంలా పని చేస్తుంది, కండ్లకలక ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే సమూహంలో ఉన్నప్పుడు సామాజిక దూరం పాటించడం మరిచిపోవద్దు.
ఇంట్లో వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి
బయట తిరిగి ఇంటికి వచ్చినపుడు లేదా గాలి ద్వారా అనేక అలెర్జీ కారకాలు, జెర్మ్స్ ఇంట్లో చేరవచ్చు. దీనిని నివారించడానికి మీ నివాస స్థలాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, బాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.
మీరు మీ కళ్ళలో దురద లేదా మీ కళ్ల నుండి జిగట ఉత్సర్గ రావడం వంటి లక్షణాలను గమనిస్తే, వెంటనే కంటి వైద్య నిపుణుడిని సంప్రదించండి. కండ్లకలకను సమర్థవంతంగా నిర్వహించడంలో సకాలంలో రోగ నిర్ధారణ చేసి, తగిన చికిత్స తీసుకోవడం కీలకం.
సంబంధిత కథనం