Parenting Tips : వీకెండ్ సమయంలో పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేయండి..
Parenting Tips : ఇప్పుడిప్పుడే స్కూల్స్ మొదలవుతున్నాయి. రెండు సంవత్సరాలుగా ఇంట్లో ఉన్న పిల్లలు స్కూల్స్‌కు వెళ్లేందుకు మారం చేస్తారు. సరే పోనిలే స్కూల్‌కి వెళ్లారా అనుకునేలోపు వీకెండ్ వచ్చేసింది. ఆడుకోవడానికి బయటకు పంపిద్దాం అనుకుంటే బయట వర్షం ఆపేస్తుంది. మరి ఈ వారాంతంలో పిల్లలతో ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.
Parenting Tips : బిజీ లైఫ్‌లో పిల్లలతో గడపడానికి సమయం ఉండదు. అటువంటి పరిస్థితిలో మీరు పిల్లలతో స్పెషల్ టైమ్ గడపడానికి వారాంతం ఈజ్ ద బెస్ట్. ఈ సమయంలో మీరు పిల్లలకోసం కొన్ని వినోద కార్యక్రమాలను ప్లాన్ చేయవచ్చు. పిల్లలతో కలిసి ఆడుతూ, పాడుతూ మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవచ్చు. పిల్లలకు వేటి గురించి ఆసక్తిగా ఉందో తెలుసుకోవచ్చు. అయితే వారికి మిమ్మల్ని దగ్గరగా చేసే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రెజర్ హంట్ ప్లాన్
పిల్లల్లో ఉత్సుకతను పెంచడానికి మీరు ట్రెజర్ హంట్ ప్లాన్ చేయవచ్చు. దీనిలో భాగంగా పిల్లలకు ఇష్టమైన వాటిని దాచిపెట్టి.. ఆపై కొన్ని చిట్‌లను తయారు చేయండి. దానిని చదివి.. వాటిని వెతుక్కునేలా పిల్లలకు సహాయం చేయండి. ఇలా వారు గమ్యానికి చేరుకున్న తర్వాత వారికి ఓ బహుమతి ఇవ్వండి.
మ్యాజిక్ ట్రిక్స్
కుటుంబ కార్యకలాపాల కోసం మీరు పెద్ద స్క్రీన్‌పై పిల్లలతో కలిసి మ్యాజిక్‌ను చూడవచ్చు. మీరు, మీ పిల్లలతో కలిసి మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకోవచ్చు. లేదా మీకు తెలిసిన మ్యాజిక్ ట్రిక్స్‌ను వారికి నేర్పించవచ్చు.
ఇంట్లో క్యాంపింగ్
మీరు పిల్లలతో ఇంట్లో క్యాంపింగ్ కూడా చేయవచ్చు. దీని కోసం ఇంటిలోని గార్డెన్లో లేదా పెద్ద హాలు ఉంటే అక్కడ మీరు టెంట్ వేసి.. పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. వారితో కలిసి ఇష్టమైన ఆటలు ఆడవచ్చు. వారికి ఇష్టమైన ఫుడ్ తినిపించవచ్చు.
ప్లే విత్ కలర్స్
మీరు కూడా పిల్లలతో కలిసి రంగులు వేయవచ్చు. కొత్త షర్టులు, సాక్స్‌లు, దుప్పట్లు, పిల్లో కేస్‌లపై DIYలు ట్రై చేయవచ్చు. కలర్స్‌తో ఆడుకోవడం పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది.
కొన్ని లెక్కలు ఇచ్చి ఈ టైమ్‌లోపు చేసేయాలని.. అలా చేస్తే గిఫ్ట్ ఇస్తానని చెప్పి వారిని చదువు వైపు కూడా తీసుకెళ్లవచ్చు. కాబట్టి.. మీరు కూడా ఈ ట్రిక్స్‌ను వారాంతంలో ట్రై చేయండి.
సంబంధిత కథనం