దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. ఈ టిప్స్‌ పాటిస్తే మీరు సేఫ్‌.. లేదంటే?-tips on how to protect yourself against cybercrime ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. ఈ టిప్స్‌ పాటిస్తే మీరు సేఫ్‌.. లేదంటే?

దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. ఈ టిప్స్‌ పాటిస్తే మీరు సేఫ్‌.. లేదంటే?

Rekulapally Saichand HT Telugu
Feb 28, 2022 05:30 PM IST

నేషనల్‌ క్రైం రికా ర్డ్స్‌ బ్యూరో(ఎన్సీఆర్బీ)-2020 వెల్లడించిన నివేదికను పరిశీలిస్తే సైబర్ నేరాలు ఎంతలా పెరిగిపోతున్నాయనేది అర్థమవుతుంది. 2019తో పోలిస్తే సైబర్‌ నేరాలు 2020లో 11.8 శాతం పెరిగాయని ఎన్సీఆర్బీ పేర్కొన్నది. రోజుకో కొత్త రకమైన సైబర్‌ నేరాలు బయటపడుతున్నాయని, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉన్నారని తెలిపింది.

రోజురోజుకూ చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు
రోజురోజుకూ చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు (HT_PRINT)

Cyber Crime: ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కొద్దీ సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. నేటి సాంకేతిక యుగంలో సమాచారం అంతా డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉంది. దీంతో కొత్త తరహా నేరాల ప్రవృత్తి పెరిగిపోతోంది.  

సైబర్ క్రైమ్ అంటే ఏమిటి?

సైబర్ క్రైమ్ అనేది ఆన్‌లైన్ ద్వారా జరిగే ఏదైనా నేరం. కంప్యూటర్ నెట్‌వర్క్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు తరచూ నేరాలకు పాల్పడుతున్నారు.  సైబర్ క్రైమ్‌లలో అశ్లీలత, సైబర్-స్టాకింగ్, వేధింపులు, బెదిరింపులు, పిల్లల లైంగిక దోపిడీ, ఆర్థిక సమాచారాన్ని హ్యాక్ చేయడం వంటి ఎన్నో నేరాలు ఉన్నాయి.

సైబర్ క్రైమ్ నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి

ఇంటర్నెట్‌ని ఉపయోగించే ఎవరైనా కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలి. సైబర్ క్రైమ్‌ల పరిధి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సహాయపడే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.

1. పూర్తి సర్వీస్ ఇంటర్నెట్ సెక్యూరిటీ సూట్‌ని ఉపయోగించండి

హ్యాకర్లు పర్సనల్ కంప్యూటర్‌లోకి వైరస్‌ను చొప్పించి డేటా చోరీకి పాల్పడుతుంటారు. గతంలో ransomware, Malware వైరస్‌ల దాడులను చూశాం. ఇలాంటి వాటి నుండి నార్టన్ సెక్యూరిటీ కంప్యూటర్‌కు రక్షణ కల్పిస్తుంది. ఇది మీ ప్రైవేట్ డేటాను, ఆర్థిక సమాచారాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

2. బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి

అన్ని అకౌంట్స్‌కి ఒకే రకమైన పాస్‌వర్డ్‌లను వాడకండి. మీ పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా మార్చుకోండి. సరళమైనవి కాకుండా క్లిష్టమైన పాస్‌వర్డ్స్‌ను ఉపయోగించండి. అంటే కనీసం 10 డిజిట్స్ ఉండేవి. వాటిలో అంకెలు, స్పెషల్ క్యారెక్టర్స్ తో కూడిన పాస్‌వర్డ్‌ ఉపయోగించడం మంచిది. పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్ అప్లికేషన్ మీ పాస్‌వర్డ్‌లను లాక్ డౌన్‌ చేయడంలో మీకు సహాయపడుతుంది.

3. మీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోండి

మీ ఆపరేటింగ్ సిస్టమ్‌, ఇంటర్నెట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌‌ను అప్‌డేట్ చేస్తుండడం చాలా ముఖ్యం. సైబర్ నేరగాళ్లు మీ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో లోపాల ద్వారా చాలా ఈజీగా దోపిడీలకు పాల్పడుతుంటారు. ఇలాంటివి నివారించాలంటే వాటిని అప్‌డేట్ చేయాలి. దీని ద్వారా సైబర్ క్రైమ్‌కు లక్ష్యంగా మారే అవకాశం తక్కువగా ఉంటుంది.

4. మీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై నిఘా..

మీ సోషల్ అకౌంట్స్ ఎప్పుడూ ఓపెన్ ఉంచకుండా లాక్ డౌన్‌లో ఉంచండి. ఇప్పుడు జరుగుతున్న సైబర్ నేరాలలో ఎక్కువగా సోషల్ మీడియాకు సంబంధించినవే ఉంటున్నాయి. సైబర్ నేరస్థులు తరచుగా మీ వ్యక్తిగత సమాచారాన్ని మీరు పెట్టే పోస్ట్‌ల ద్వారా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పబ్లిక్‌గా ఎంత తక్కువ షేర్ చేస్తే అంత మంచిది. ఉదాహరణకు, కుటుంబ సభ్యుల వివరాలను, వక్త్యిగత సమాచారాన్ని పబ్లిక్‌గా షేర్ చేస్తే సైబర్ నేరస్థుల వలలో చిక్కుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

5. మీ హోమ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయండి

స్ట్రాంగ్ ఎన్‌క్రిప్షన్ పాస్‌వర్డ్‌తో పాటు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌(VPN) కలిగి ఉండడం మంచిది. VPN మీ డివైజ్‌ల ట్రాఫిక్ మొత్తాన్ని ఎన్‌క్రిప్షన్ చేస్తోంది. సైబర్ నేరస్థులు మీ కమ్యూనికేషన్ లైన్‌ను హ్యాక్ చేసినప్పుడు వారు ఎన్‌క్రిప్టెడ్ డేటాను అంతా ఈజీగా హ్యాక్ చేయలేరు. లైబ్రరీ, కేఫ్, హోటల్ లేదా ఎయిర్‌పోర్ట్‌లో మీరు పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లను వాడుతున్నప్పుడు VPNని ఉపయోగించడం మంచిది.

6. ఇంటర్నెట్‌పై పిల్లలకు అవగాహన కల్పించండి

ఈ మధ్య పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసుల కోసం మొబైల్, ల్యాప్ టాప్ వంటి డిజిటల్ డివైజ్ లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆ తర్వాత కూడా వాటిని వ్యసనంగా మార్చుకున్నారు. దీని పట్ల పిల్లలను జాగ్రత్తగా ఉంచాలి. వారు వాటిలో ఏం చూస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారా అనే విషయాలపై శ్రద్ద వహించాలి.

WhatsApp channel

సంబంధిత కథనం