Tips For Workouts | వ్యాయామానికి వయసు అడ్డు కాదు.. -tips for workouts to fit at the age of 50 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips For Workouts | వ్యాయామానికి వయసు అడ్డు కాదు..

Tips For Workouts | వ్యాయామానికి వయసు అడ్డు కాదు..

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 19, 2022 09:57 AM IST

యాభైల తర్వాత జీవితాన్ని గడుపుతున్న చాలా మంది వ్యక్తులు చెప్పినట్లు.. వయస్సు కొన్నిసార్లు మానసిక అవరోధం మాత్రమే. మీరు మీ మనస్సును, హృదయంపై ఏకాగ్రత ఉంచితే చాలు. అవును.. మీరు 50 ఏళ్లు దాటిన తర్వాత వ్యాయామం చేయడానికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. కానీ దీనిని సాధ్యం చేయవచ్చు అంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంలో సాధారణ అలవాట్లను జోడించడం ద్వారా 50 తర్వాత వ్యాయామం చేయవచ్చంటున్నారు.

<p>హెల్తీ లైఫ్</p>
హెల్తీ లైఫ్

50 తర్వాత వ్యాయామం అసాధ్యం కాదు. కానీ కొంచెం స్పృహతో ఉండటం వలన.. కొన్ని దినచర్యలను అనుసరించడం వల్ల కూడా వ్యాయామం చేయవచ్చు అంటున్నారు నిపుణులు. 50 ఏళ్ల వయస్సులో వ్యాయామం చేయడం చాలా ముఖ్యమంటున్నారు ఫిట్‌నెస్ ఔత్సాహికుడు రాబిన్ బెహ్ల్. మనసు, శరీరాన్ని చురుకుగా ఉంచడానికి 50 ప్లస్ వ్యక్తులు ఈ పద్ధతులను పాటించాలని సూచించారు.

1. రోజూ 30-45 నిమిషాల కార్డియో అవసరం

నడక, జాగింగ్, మెట్లు ఎక్కడం లేదా స్కిప్పింగ్. ఇలా మీకు నచ్చినది ఏదైనా చేయండి. కానీ పగటిపూట కార్డియోను చేర్చండి. రక్తం ప్రవహించేలా చేయడానికి ఇది ఉత్తమ మార్గం. రోజంతా శక్తివంతంగా ఉండేందుకు ఇది కీలకం.

2. వెన్నెముక ఆరోగ్యం, భుజం, మోకాలి పునరావాసంపై దృష్టి

మీ శరీరంలోని ఈ భాగాలపై దృష్టి కేంద్రీకరించడానికి రోజుకు 10-15 నిమిషాలు గడపండి. మీ కీళ్ళు, భుజం, వెన్నెముకను జాగ్రత్తగా చూసుకోవడంలో పని చేయడం అవసరం. ఇవి మనం చాలా కదలికల కోసం ఉపయోగించే భాగాలు. కాబట్టి వాటి ఫిట్‌నెస్ మన ఫిట్‌నెస్ స్థాయిలను నిర్వచిస్తుంది.

3. శక్తి శిక్షణ

మీరు తప్పనిసరిగా 20-25 నిమిషాల శక్తి శిక్షణను చేయాలి. పోస్ట్ 50 చేయవలసిన ఏకైక ముఖ్యమైన విషయం మీ కండరాలపై పని చేయడం. వయసు పెరిగే కొద్దీ మన కండర ద్రవ్యరాశి తగ్గుతుంది. పురుషులు, మహిళలు మీ ఎముకలను బలంగా చేయడానికి మీ వ్యాయామ దినచర్యలో శక్తి శిక్షణ తప్పనిసరిగా చేయాలి.

4. తగినంత నిద్ర

50 తర్వాత వర్కవుట్ కాకుండా, మీరు మీ జీవనశైలి అలవాట్లు ఉండేలా చూసుకోవాలి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రించడానికి ప్రయత్నించండి. నిజానికి, రాత్రిపూట శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మనం కండరాలు రికవరీ అవుతాయి. శారీరక ఆరోగ్యం వారీగా మాత్రమే కాదు.. సరైన నిద్ర మరుసటి రోజు శక్తివంతంగా పనిచేసే సామర్థ్యంతో రిఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది.

5. తగినంత నీరు త్రాగాలి

మీరు తప్పనిసరిగా 3-4 లీటర్ల నీటిని తీసుకోవాలి. ఏ వయసులోనైనా హైడ్రేషన్ తప్పనిసరి. కానీ మనం పెద్దయ్యాక, శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే చర్మానికి కూడా ఎక్కువ శ్రద్ధ అవసరం. హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు వచ్చేస్తాయి. ఇది స్పష్టమైన చర్మానికి దారి తీస్తుంది.

6. ప్రాసెస్ చేసిన చక్కెరను తగ్గించాలి

షుగర్ స్లో పాయిజన్ అని చెప్పడానికి కారణం ఉంది. శుద్ధి చేసిన చక్కెర తక్కువ శక్తి స్థాయిలకు దారి తీస్తుంది. మీరు 50 ఏళ్ళలో ఉండకూడదు. మీ ఆహారం నుంచి చక్కెరను తగ్గించడం వలన మీ శక్తి స్థాయిలను పెంచవచ్చు. మీ దృష్టి కేంద్రీకరించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం