Richest cat: ఈ పిల్లి ఆస్తి 839 కోట్ల రూపాయలు, అదంతా ఎవరో దీనికి రాసిచ్చిన ఆస్తి కాదు, దాని కష్టార్జితమే-this cats property is 839 crore rupees all that property was acquired by the cat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Richest Cat: ఈ పిల్లి ఆస్తి 839 కోట్ల రూపాయలు, అదంతా ఎవరో దీనికి రాసిచ్చిన ఆస్తి కాదు, దాని కష్టార్జితమే

Richest cat: ఈ పిల్లి ఆస్తి 839 కోట్ల రూపాయలు, అదంతా ఎవరో దీనికి రాసిచ్చిన ఆస్తి కాదు, దాని కష్టార్జితమే

Haritha Chappa HT Telugu
Sep 04, 2024 12:30 PM IST

Richest cat: పిల్లలకి, కుక్కలకు వాటిని పెంచుకున్న యజమానులు తమ ఆస్తిని రాయడం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. అలా కొన్ని పిల్లులు, కుక్కలు కోటీశ్వరులు అయ్యాయి. కానీ ఇక్కడ ఉన్న పిల్లి చాలా స్పెషల్. దానికి కష్టార్జితంతోనే అది కొన్ని కోట్లు సంపాదించింది.

అత్యంత సంపన్న పిల్లి నలా
అత్యంత సంపన్న పిల్లి నలా (Instagram)

Richest cat: కొందరు యజమానులు తాము పెంచుకున్న కుక్కలు, పిల్లులు మీద విపరీతమైన అభిమానంతో తమ ఆస్తిని రాసేస్తూ ఉంటారు. అలా కొన్ని మూగజీవులు కోటీశ్వరులుగా మారాయి. ఇక్కడ ఉన్న పిల్లి మాత్రం చాలా స్పెషల్. దీని పేరు నలా. ఇది తనకు తానుగా 839 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించింది. మీరు ఆశ్చర్యపోతున్నా ఇది నిజమే. ఎలాగో తెలుసుకోండి.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి నలా. ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటుంది. సియామీ - టాబి అనే రెండు జాతుల సంకరణ వల్ల పుట్టిన పిల్లి ఇది. దాని యజమానులు నటాషా, లూయిస్ కలిసి ఒక జంతు సంరక్షణ కేంద్రం నుంచి తెచ్చి పెంచుకున్నారు. అప్పుడు దాని వయసు కేవలం ఐదు నెలలు.

తాము పెంచుకున్న పిల్లి ఫోటోలను స్నేహితులు, నెటిజన్లతో పంచుకునేందుకు నలా పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రొఫైల్ ను క్రియేట్ చేశారు దాని యజమానులు. ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో నలా క్యూట్ ఫోటోలను అప్లోడ్ చేసేవారు. ఇది నెటిజన్లకు ఎంతో నచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 4.5 మిలియన్ల మంది నలా ఖాతాను అనుసరించడం మొదలుపెట్టారు. దీంతో 2020లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా నలాకు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఇంతమంది అనుసరించే ఒక పిల్లిగా అది టైటిల్‌ను సాధించింది.

నిజానికి నలా ఇల్లు రైల్వే స్టేషన్‌కి పది నిమిషాల దూరంలోనే ఉంటుంది. తరచూ నలా రైల్వే స్టేషన్‌కు వచ్చి ఒక చోట క్యూట్ గా కూర్చునేది. ప్రయాణికులు దాన్ని ఫోటోలు తీసేందుకు ఇష్టపడేవారు. అలా ఎంతోమందికి ఇది దగ్గరయింది. దీనికి దాని యజమానులు జిపిఎస్ ట్రాకింగ్ పరికరాన్ని కూడా అమర్చారు. దీనివల్ల నలా ఎక్కడికి వెళ్తున్నాడో, ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి యజమానులకు సులువు అవుతుంది. అంతేకాదు దాని మెడలో తన యజమాని వివరాలతో కూడిన ఒక కాలర్ కూడా ఉంటుంది.

గతేడాది నలా ను పెంచుకుంటున్న వారు ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ నలా’ పేరుతో ఫేస్‌బుక్ పేజీని సృష్టించారు. ఇది కూడా ఇంటర్నెట్లో ప్రజాదరణ పొందింది. ఎంతోమంది ప్రజలు నలా ఫోటోలు చూడడానికి ఫేస్‌బుక్ ఫాలో అయ్యేవారు. జాతీయ మీడియా దృష్టిని కూడా నలా ఆకర్షించింది. బీబీసీ, స్కై న్యూస్ వంటి వారు నలా గురించి స్టోరీలు తయారు చేసి ప్రసారం చేసేవారు. టిక్ టాక్ ఇన్ స్టాగ్రామ్‌లో కూడా విపరీతంగా నలాకు ఫాలోయింగ్ ఉంది.

దీంతో నలా వల్ల యజమానులకు ఆర్థికంగా కలిసి రావడం మొదలుపెట్టింది. వారు ‘లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్ అకార్డింగ్ టు నలా క్యాట్’ అనే ఈబుక్ ను మొదలుపెట్టారు. ఈబుక్ ను చదవడానికి కొంత సబ్ స్క్రిప్షన్ ఫీజు కట్టాల్సి వస్తుంది. అలా సంపాదన మొదలైంది. అలాగే ‘లవ్ నాలా’ పేరుతో ప్రీమియం క్యాట్ ఫుడ్ బ్రాండ్ కూడా మొదలుపెట్టారు.

ఇన్‌స్టాగ్రామ్ లో విపరీతంగా ప్రకటనలు కూడా రావడం మొదలుపెట్టాయి. ఎన్నో రకాల కంపెనీలతో నలా టైప్ అయింది. అలా ప్రతి ఏడాది దాని సంపాదన పెరుగుతూ వచ్చింది. సోషల్ మీడియా ద్వారా నలా వందల కోట్లు సంపాదించింది. ఇప్పుడు దీని ఆస్తి మొత్తం లెక్కపెడితే 839 కోట్ల రూపాయలుగా తేలింది. అందుకే ప్రపంచంలోనే అత్యంత ధనిక పిల్లిగా ఇది మారింది. సోషల్ మీడియాని ఉపయోగించుకొని కేవలం మనుషులే కాదు జంతువులు కూడా ఆస్తులు సంపాదించుకుంటున్నాయి.

టాపిక్