Relationship Advices : బంధాన్ని కాపాడుకోవడం కోసం అన్ని విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం లేదు..-things you should not compromise in a relationship ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationship Advices : బంధాన్ని కాపాడుకోవడం కోసం అన్ని విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం లేదు..

Relationship Advices : బంధాన్ని కాపాడుకోవడం కోసం అన్ని విషయాల్లో రాజీ పడాల్సిన అవసరం లేదు..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 09, 2022 12:10 PM IST

Relationship Advices : ఓ రిలేషన్ స్ట్రాంగ్​గా ఉండాలంటే రాజీపడాల్సిందే అంటారు. అలాగే ఓ రిలేషన్​లో ఉన్నప్పుడు మీరు కొన్ని విషయాల్లో అస్సలు రాజీపడకూడదు అంటారు. అయితే ఏ విషయాల్లో మనకి మనం స్టాండ్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బంధం కన్నా ఆత్మగౌరవం ముఖ్యం
బంధం కన్నా ఆత్మగౌరవం ముఖ్యం

Relationship Advices : రిలేషన్​ అయినా నిలబెట్టుకోవడానికి ఇద్దరు కృషి చేయాలి. ఎప్పుడూ ఒక్కరే కాదు.. ఇద్దరూ కాంప్రిమైజ్ అవ్వాలి. కానీ కొన్ని సందర్భాల్లో.. కొన్ని విషయాల్లో మనకి మనం స్టాండ్ తీసుకోవాలి. ఇతరులు ఎదుటివారి నిర్ణయాలు గౌరవించాలి. ఎందుకంటే లవ్ యువర్ సెల్ఫ్. మీరు రాజీపడే అన్ని విషయాలల్లో.. మిమ్మల్ని మీరు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేరొకరు మిమ్మల్ని ఎంతగా కోరుకున్నా.. మీరు వదిలిపెట్టకూడని విషయాలు ఉన్నాయి. నిజంగా మిమ్మల్ని ప్రేమించే, మీ ఆనందానికి విలువనిచ్చే వ్యక్తి కొన్ని ముఖ్యమైన విషయాలను వదులుకోమని మిమ్మల్ని ఎప్పటికీ అడగరని గుర్తుంచుకోండి. అయితే ఓ సంబంధంలో ఉన్నప్పుడు మీరు ఏ విషయాల్లో రాజీపడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఫ్రెండ్స్

మీ స్నేహితులు మీతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు.. మీ భాగస్వామి ఆందోళన చెందుతుంటే అది ప్రేమ అవుతుంది. అప్పుడు మీ భాగస్వామి చెప్పే సూచనలు మీరు తీసుకోవాలి. అంతేకానీ మొత్తం మీ ఫ్రెండ్స్​ని కలవొద్దని.. మీ ఫ్రెండ్స్​తో సంబంధాలు తెంచుకోమని చెప్తే కనుక మీరు కాంప్రిమైజ్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ మీకు ఆనందాన్ని ఇస్తారు అనుకుంటే.. మీ ప్రేమ కోసం వారిని త్యాగం చేయాల్సిన అవసరం లేదు.

మీ డ్రీమ్స్

మీ భవిష్యత్తు కోసం మీరు కనే కలలకు మీరు అర్హులు. వాటిని నెరవేర్చుకోవడం కోసం ఎవరి గురించి ఆలోచించవద్దు. మీ డ్రీమ్స్ తరువాతే ఎవరైనా. మీ కలలకు రెస్పెక్ట్ ఇచ్చి.. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేవారు మీ లైఫ్​లో ఉంటే.. దానికన్నా మంచి విషయం ఇంకోటి ఉండదు. కలలు ఎప్పుడూ మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే వాటి వెంట వెళ్లాలి. మీ కలలను అనుసరించడం, నచ్చిన పని చేయడం మీ భాగస్వామికి ఇష్టం లేకపోతే అది మీ తప్పుకాదు. కాబట్టి ఆ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాకండి.

మీ కుటుంబంతో మీ సంబంధం

మీరు మీ కుటుంబాన్ని ప్రేమించడం మీ భాగస్వామికి ఇష్టంలేకపోతే.. మీరు కఠినంగా ఉండొచ్చు. మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేసే అర్హత మీ భాగస్వామికి లేదని గుర్తించుకోండి. ఏ కారణం చేతనైనా మీ ప్రియుడు లేదా ప్రియురాలు.. మీ కుటుంబానికి ప్రతికూలంగా ఉంటే వారితో మాట్లాడండి. అప్పటికి మారితే సరి. లేదంటే ఫ్యామిలి విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని డైరక్ట్​గా చెప్పేయండి.

మీ గురించి మీరు భావించే విధానం

మీకు నచ్చిన పని చేస్తున్నప్పుడు.. అబ్బా తనకి తెలిస్తే తిడతారు అని అనిపిస్తుందంటే.. మీరు సరైన వ్యక్తితో లేరని అర్థం. మీకు సంతోషాన్ని కలిగించే విషయంలో ఎప్పుడూ కాంప్రిమైజ్ అవ్వకండి. అలాగే భాగస్వామికి కూడా ఎదుటివారికి నచ్చినట్లు ఉండేలా చేయాలి. అంతేకానీ మీరే వారిని కట్టడి చేస్తే.. ఇంకా వారికి నచ్చినట్లు ఎలా జీవిస్తారు చెప్పండి. మిమ్మల్ని నిరుత్సాహపరిచే పనులకు, వ్యక్తులకు దూరంగా ఉండండి.

ఓ రిలేషన్ నిలబడాలి అంటే ఎల్లప్పుడూ రాజీపడాల్సిన అవసరం లేదు. వారికి గౌరవం ఇవ్వాలి. ఎదుటివారి ఫీలింగ్స్​ని గౌరవిస్తే చాలు. అదే వారి బంధాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్తుంది. ఒకరి ఫీలింగ్స్​ని మరొకరు కట్టడి చేయడం వల్లే సమస్యలనేవి వస్తాయి. ప్రేమలో ఓవర్ కేరింగ్, త్యాగం చేయాల్సిన అవసరం లేదని గుర్తించుకోండి. ఎదుటివ్యక్తిని అర్థం చేసుకోగలగడమే నిజమైన ప్రేమ అవుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్