శృంగారం విషయంలో మహిళలు చేసే సాధారణ తప్పిదాలు ఇవే, ఎలా దిద్దుకోవాలంటే?-these mistakes women should not make in bed for a healthy sex life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  శృంగారం విషయంలో మహిళలు చేసే సాధారణ తప్పిదాలు ఇవే, ఎలా దిద్దుకోవాలంటే?

శృంగారం విషయంలో మహిళలు చేసే సాధారణ తప్పిదాలు ఇవే, ఎలా దిద్దుకోవాలంటే?

Galeti Rajendra HT Telugu
Oct 22, 2024 08:24 PM IST

శృంగారానికి ఇది సరైన సమయం.. ఇది కాదు అనే నియమం ఏదీ లేదు. భాగస్వామితో మీ ఆనంద క్షణాలను ఆస్వాదించే ఏ సమయమైనా మంచిదే. అయితే సాధారణంగా శృంగారంలో మహిళలు కొన్ని తప్పిదాలు చేస్తుంటారు.

శృంగారంలో మహిళలు చేసే తప్పిదాలు
శృంగారంలో మహిళలు చేసే తప్పిదాలు (istock)

శృంగారంలో మహిళలు చేసే కొన్ని సాధారణ తప్పిదాలు భాగస్వామికి చికాకుతో పాటు అసంతృప్తిని ఇస్తుంటాయి. పురుషులతో పోలిస్తే మహిళలు శృంగారం విషయంలో ఎక్కువగా చొరవ తీసుకోరు. అలా అని భాగస్వామి మరీ ఇబ్బందిపడేలా సిగ్గుపడితే ఇద్దరూ ఎంజాయ్ చేయలేరు. కొందరు మహిళలు ఏదో భాగస్వామి కోసం సంభోగంలో పాల్గొన్నట్లు యాంత్రికంగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు భాగస్వామి ఏమనుకుంటాడో అని భావప్రాప్తి పొందినట్లు నటిస్తుంటారు. శృంగారం విషయంలో సాధారణంగా మహిళలు చేసే తప్పిదాలు ఇవే.

భావప్రాప్తి

శృంగారం సమయంలో సంతృప్తి లేకపోయినా భావప్రాప్తి కలిగినట్లు కొంత మంది మహిళలు నటిస్తుంటారు. భాగస్వామి ఏమనుకుంటాడో అనే భయం లేదా సంభోగం ఇష్టం లేకపోవడం తదితర కారణాలు ఉండొచ్చు. అయితే మీ సమస్య ఏంటో భాగస్వామికి ఓపెన్‌గా చెప్పి.. నిజమైన ఆనందం పొందడంపై దృష్టి పెట్టాలి.

అందంపై అనుమానం

కొంత మంది మహిళలు ఇతరులతో పోలిస్తే నేను అందంగా లేనేమో అనే ఆత్మన్యూనత భావం ఉంటుంది. మీకు ఈ ఫీలింగ్ ఉంటే శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు. కాబట్టి.. మొదట మీ శరీర అందం గురించి ఆందోళన చెందడం ఆపేయాలి. అప్పటి క్షణాల్ని భాగస్వామితో ఆనందించడం అలవాటు చేసుకోవాలి.

భాగస్వామి కోసం కాంప్రమైజ్

కొంత మంది మహిళలు తమకి ఏం కావాలో అడగకుండా.. భాగస్వామికి అనుగుణంగా శృంగారంలో వ్యవహరిస్తుంటారు. అయితే.. మీరు కూడా సంభోగంలో ఎంజాయ్ చేయాలంటే.. మీకు ఇష్టమైన పొజిషన్స్ చెప్పడంతో పాటు మీకు ఇష్టలేని వాటిని కూడా భాగస్వామికి చెప్పడం ఉత్తమం. మీకు సౌకర్యంగా లేకపోతే స్పష్టంగా "వద్దు" చెప్పడానికి సిగ్గుపడొద్దు.

మౌనం

శృంగారం సమయంలో కొంత మంది మహిళలు బిడియం, సిగ్గు కారణంగా మౌనంగా ఉంటారు. ఇది మీ భాగస్వామికి ఏమాత్రం సంతృప్తిని ఇవ్వదు. సరదా మాటలు శృంగారాన్ని మరింత ఆస్వాదించేలా చేస్తాయి. సంభోగానికి ముందు ఇద్దరూ కలిసి కాసేపు రొమాంటిక్‌గా మాట్లాడుకోవడం మంచిది. శృంగారం సమయంలో మీ అభిప్రాయాలను చెప్పడం, మీ భాగస్వామి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం మీ భావోద్వేగ బంధాన్ని కూడా మరింత బలోపేతం చేస్తుంది.

బాడీ ప్రెజెంట్.. మైండ్ ఆబ్సెంట్

కొంత మంది మహిళలు శృంగార సమయంలో కుటుంబ, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది మీ భాగస్వామికి తృప్తినివ్వకపోగా.. మీరు కూడా ఆస్వాదించలేరు. కాబట్టి.. భాగస్వామితో రొమాంటిక్‌గా ఉన్నప్పుడు సమస్యల వైపు మనసు వెళ్లకుండా చూసుకోండి. ఒకవేళ గుర్తొచ్చినా.. భాగస్వామితో కలిసి చర్చించి సానుకూల వాతావరణం ఏర్పడిన తర్వాత శృంగారంలో పాల్గొనడం ఉత్తమం.

శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి? ఏ సమయంలో శృంగారంలో పాల్గొంటే బాగా ఆస్వాదించొచ్చు? అనే విషయంలో ఇప్పటికీ చాలా మందికి అనుమానాలు ఉన్నాయి.

  • రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత ఉదయం.. శరీరం ఫ్రెష్‌గా ఉండే సమయం. హార్మోన్లు ఈ సమయంలో అధికంగా ఉంటాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ శృంగారంలో పాల్గొంటే బాగా ఎంజాయ్ చేయవచ్చు.
  • రాత్రి మన రోజువారీ పనులన్నీ ముగించుకుని.. ఒత్తిడి తగ్గిన తర్వాత నిద్రపోయే ముందు శృంగారంలో పాల్గొంటే బాడీ రిలాక్స్ అవుతుంది. రొమాన్స్‌ను కూడా బాగా ఆస్వాదిస్తారు. అలానే నిద్ర కూడా బాగా పడుతుంది.
  • ముందుగా ప్లాన్ చేసుకోకుండా.. ఇంట్లో ఒకరికొకరు ఆకర్షితులై మూడ్ వచ్చినప్పుడు సర్‌ప్రైజ్‌గా శృంగారంలో పాల్గొనడాన్ని కూడా బాగా ఎంజాయ్ చేయవచ్చు.

    గమనిక : పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. వైద్యపరమైన సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

Whats_app_banner