Gurus in Puranas: మన భారతీయ పురాణాల్లో అద్భుతమైన గురువులు వీరంతా, టీచర్స్ డే రోజు వారిని తలచుకోవాల్సిందే-these are all the wonderful teachers in our indian mythology we should remember them on teachers day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gurus In Puranas: మన భారతీయ పురాణాల్లో అద్భుతమైన గురువులు వీరంతా, టీచర్స్ డే రోజు వారిని తలచుకోవాల్సిందే

Gurus in Puranas: మన భారతీయ పురాణాల్లో అద్భుతమైన గురువులు వీరంతా, టీచర్స్ డే రోజు వారిని తలచుకోవాల్సిందే

Haritha Chappa HT Telugu
Sep 05, 2024 07:00 AM IST

Gurus in Puranas: మన పురాణాల్లో ఎంతో మంది గురువులు ఉన్నారు. వారిలో కొంతమందే చరిత్రలో నిలిచిపోయారు. ద్రోణాచార్యులు, వాల్మీకి, వేదవ్యాసుడు వీరంతా మన పురాణ గురువులు. జ్ఞానాన్ని, బోధనలను తమ శిష్యులకే కాదు, ప్రపంచానికే అందించారు. ఉపాధ్యాయులు ఎలా ఉండాలో వారిని చూసి నేర్చుకోవచ్చు.

పురాణాల్లోని గురువులు
పురాణాల్లోని గురువులు (Pinterest)

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనం మన గురువులనే కాదు, మన పురాణాల్లోని గురువులను ఓసారి తలచుకుని వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ప్రముఖ తత్వవేత్త, భారతదేశ రెండో రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గౌరవార్థం సెప్టెంబర్ 5 న ఈ ఉపాధ్యాయ దినోత్సవం మనం నిర్వహించుకుంటున్నాం. ప్రాచీన కాలం నుండి, గురువులు భారతీయ సంస్కృతిలో గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. శిష్యులతో వారి సంబంధం, లోతైన భక్తి, గౌరవంతో నిండి ఉంటాయి. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, భారతీయ పురాణాల నుండి అత్యంత ప్రసిద్ధ గురువుల గురించి తెలుసుకోండి.

ద్రోణాచార్యుడు

భారతీయ పురాణాలలో అత్యంత ప్రసిద్ధ గురువు ద్రోణాచార్యుడు. మహాభారత ఇతిహాసంలో కీలక వ్యక్తి ఈయన. అధునాతన సైనిక వ్యూహాలు, ఆయుధాల వాడకంలో అసాధారణ నైపుణ్యానికి ఇతని ప్రసిద్ది చెందాడు. అర్జునుడంటే ద్రోణాచార్యుడికి ఇష్టమైన శిష్యుడు. కౌరవులకు, పాండవులకు యుద్ధ కళలు నేర్పింది ద్రోణాచార్యుడు. కచ్చితంగా గుర్తుకోవాల్సిన గురువుల్లో ద్రోణాచార్యుడు ఒకరు.

పరశురాముడు

విష్ణువు ఆరో అవతారం పరశురాముడు. ఆయన ఎంతో మంది బ్రాహ్మణులకు యుద్ధ కళలో శిక్షణ ఇచ్చాడు. క్షత్రియుడైనప్పటికీ, మహాభారతంలో ప్రసిద్ధుడైన కర్ణుడు, పరశురాముడి ఉపదేశాన్ని కోరాడు. కర్ణుడి మోసాన్ని గుర్తించిన పరశురాముడు అత్యంత అవసరమైన సమయంలో తన నైపుణ్యాలన్నీ మరచిపోమని శపించాడు. గురువుగా తన కర్తవ్యాన్ని ఉపదేశిస్తూనే, మోసాన్ని తెలివిగా శాపంతో తిప్పికొట్టాడు.

విశ్వామిత్రుడు

ఉజ్వల స్వభావానికి, అపారమైన శక్తికి ప్రసిద్ధి చెందిన మహర్షి విశ్వామిత్రుడు. శ్రీరాముడికి, ఆయన సోదరుడు లక్ష్మణుడికి గురువుగా వారికి దివ్యాయుధాల జ్ఞానాన్ని ప్రసాదించాడు విశ్వామిత్రుడు. అంతేకాకుండా సీతాదేవితో శ్రీరాముని వివాహంలో కీలక పాత్ర పోషించాడు.

వేద వ్యాసుడు

మహర్షి వేదవ్యాసుడు మహాభారత ఇతిహాస రచయితగా గుర్తింపు పొందిన వ్యక్తి. అతను గొప్ప గురువుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. అతను మహాభారత కథలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు. పాండవులకు, కౌరవులకు ఇద్దరి తాతగా వేద వ్యాసుడు పేరుపొందాడు. ఇతిహాసంలోని కీలక ఘట్టాల్లో కీలక పాత్రను పోషించాడు.

వశిష్ఠ మహర్షి

హిందూ పురాణాలలో వశిష్ఠ మహర్షిని ఏడుగురు మహా ఋషులలో ఒకరిగా కొలుస్తారు. పాండిత్యానికి, బోధనకు ప్రసిద్ధి చెందిన ఆయన ప్రాచీన, మధ్యయుగ కాలంలో అనేక ప్రభావవంతమైన గ్రంథాలను రచించారు. వశిష్ట ధర్మసూత్రం, వశిష్ట సంహిత, అగ్ని పురాణం, యోగ వశిష్ఠ, విష్ణు పురాణం వంటి ముఖ్యమైన గ్రంథాలను రచించిన ఘనత ఆయనది.

వాల్మీకి

రామాయణ ఇతిహాసాన్ని రచించిన వాల్మీకి మహర్షి శ్రీరాముని కవల కుమారులు లవ, కుశలకు గురువుగా కీలక పాత్ర పోషించారు. ఇతిహాసం ప్రకారం, రామాయణం పూర్తయిన తరువాత, అతను అన్నదమ్ములైన లవకుశులకు వివరించారు. తరువాత వారు దానిని పఠించారు, ఈ ఇతిహాసం ఇప్పటికీ హిందువులకు పవిత్రగంథ్రమే.

శుక్రాచార్యుడు

భృగు మహర్షి కుమారుడు, పరమశివుని భక్తి భావంతో ఆరాధించేవాడు, అసురులకు గురువుగా సేవలందించిన వాడు శుక్రాచార్యుడు. మహాభారతంలో భీష్మ పితామహుడికి గురువుగా, రాజనీతి శాస్త్రం, వ్యూహరచనలో తన పరిజ్ఞానాన్ని బోధించాడు.

బృహస్పతి

దేవతలకు గురువుగా పూజలందుకునే వ్యక్తి బృహస్పతి. ఋగ్వేదంలో ఈయన ప్రస్తావన ఉంటుంది. తన ప్రత్యేకమైన విల్లుకు ప్రసిద్ధి చెందాడు, దీని తీగను 'విశ్వ క్రమం' అని పిలుస్తారు. అతను ధర్మానికి కావాల్సిన పునాది సూత్రాలను కలిగి ఉంటాడు.

టాపిక్