Vegan Milk | పాలకు బదులుగా ఇవి ట్రై చేయండి.. పోషకాలు కూడా ఎక్కువే..
ఈ మధ్యకాలంలో చాలా మంది పాలను, పాల ఉత్పత్తులను మానేస్తున్నారు. అలాంటి వారు పాల ద్వారా లభించే పోషకాలను పొందలేరు. మరి శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కడ నుంచి వస్తాయి. పాలను భర్తీ చేసేవి ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయంటున్నారు నిపుణులు. పాల కన్నా ఎక్కువ పోషకాలు కలిగిన ప్రత్యామ్నాయాలు గురించి చెప్తున్నారు. ఇంతకీ అవి ఏంటంటే..
Milk For Vegans | జంతువులపై ప్రేమతో చాలా మంది శాకాహారిగా మారిపోతున్నారు. ఎంతలా అంటే పాలను కూడా వారు తాగట్లేదు. అది కూడా జీవహింసగా భావిస్తున్నారు. ఈ క్రమంలో పాల ద్వారా పొందే పోషకాలను కూడా వారు కోల్పోతున్నారు. మరి వాటిని ఎలా పొందాలి. మీరు కూడా ఈ పరిస్థితిలోనే ఉంటే ఇది మీకోసమే. పాలకు ప్రత్యామ్నాయాలు ఇక్కడే ఉన్నాయి. అది కూడా పూర్తిగా శాఖాహారం. పైగా పూర్తిగా పోషకాలతో నిండుకున్నవి. అవి ఏంటంటే..
బాదం పాలు
మీ మెదడు చురుకుగా ఉండాలనుకుంటున్నారా? మెరిసే చర్మం, కోమలమైన జుట్టు కావాలా? ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలా? అయితే ఎటువంటి సందేహం లేకుండా బాదం పాలను ఎంచుకోండి. అంతేకాకుండా ఇది మీకు సూపర్‌ఫాస్ట్‌గా శక్తినిస్తుంది. నిజంగా బాదం పాలులోని అన్ని ప్రయోజనాలను పొందాలనుకుంటే.. వాటిలో చక్కెరను కలపకుండా తీసుకోండి. ఎందుకంటే అది తక్కువ కేలరీలు, ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది.
జీడిపప్పు పాలు
మనలో చాలా మందికి విటమిన్ డి లోపం ఉంటుంది. విటమిన్ డి అనేది మన శరీరంలోని వివిధ ఇతర పోషకాలను గ్రహించడానికి అవసరం. పైగా విటమిన్ డికి ఏకైక ప్రధాన మూలం సూర్యుడు. అయితే విటమిన్ డికి మరొ గొప్ప సోర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే జీడిపప్పు పాలు. ఈ పాలు కొంచెం క్రీమీయర్గా ఉంటుంది. ఇది తాగడానికి కూడా రుచికరమైనది.
కొబ్బరి పాలు
మంచి కొవ్వుల పోషణను కోరుకుంటే... కొబ్బరి పాలు మంచి ఎంపిక. కొబ్బరి పాలలో ఆవు లేదా గేదె పాల కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. పైగా ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. కొబ్బరి జుట్టు, చర్మానికి గొప్పదని మనకి తెలుసు. మీరు శాకాహారి అయితే.. మంచి కొవ్వులతో కూడిన పాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే.. కొబ్బరి పాలు మంచి ఎంపిక.
ఓట్స్ మిల్క్
శాకాహారులు కాకుండా.. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు ఓట్స్ మిల్క్ తాగవచ్చు. ఓట్స్ పాలలో బీటా-గ్లూకాన్ ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తుంది. తద్వారా గుండె జబ్బులను నివారించడంలో సహాయం చేస్తుంది. కాబట్టి.. మీ కుటుంబానికి గుండె జబ్బుల చరిత్ర ఉంటే.. వాటిని తగ్గించడానికి మీ జీవితంలో సోయా పాలను జోడించండి.
సోయా పాలు
250 ఎమ్ఎల్ సోయా పాలలో 4 గ్రాముల పిండి పదార్థాలు, మంచి కొవ్వులు, దాదాపు 7 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. మరొక విషయం ఏమిటంటే ఇది కొలెస్ట్రాల్ లేనిది. పిల్లలకు కూడా ఇది సరైన ఎంపిక.
సంబంధిత కథనం