Relationship: పెళ్లిళ్లు పెటాకులు అయ్యేందుకు ప్రధానమైన 5 కారణాలు ఇవే.. ఈ పొరపాట్లు చేయకండి-these 5 common mistakes leading divorce and destroys marriages ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationship: పెళ్లిళ్లు పెటాకులు అయ్యేందుకు ప్రధానమైన 5 కారణాలు ఇవే.. ఈ పొరపాట్లు చేయకండి

Relationship: పెళ్లిళ్లు పెటాకులు అయ్యేందుకు ప్రధానమైన 5 కారణాలు ఇవే.. ఈ పొరపాట్లు చేయకండి

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 03, 2024 08:30 AM IST

Relationship: జీవిత భాగస్వాముల మధ్య విభేదాలు సాధారణంగా కొన్ని కారణాల వల్ల పెరుగుతుంటాయి. కొన్నిసార్లు చిన్న విషయాలే పెద్దవిగా మారి విడిపోయే వరకు తీసుకెళుతుంటాయి. అలా పెళ్లిళ్లు విఫలమయ్యేందుకు దారి తీస్తున్న ఐదు ప్రధాన కారణాలు ఏవో ఇక్కడ చూడండి.

Relationship: పెళ్లిళ్లు పెటాకులు అయ్యేందుకు ప్రధానమైన 5 కారణాలు ఇవే.. ఈ పొరపాట్లు చేయకండి
Relationship: పెళ్లిళ్లు పెటాకులు అయ్యేందుకు ప్రధానమైన 5 కారణాలు ఇవే.. ఈ పొరపాట్లు చేయకండి (Pixabay)

ఇటీవలి కాలం విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. బంధాల్లో సంక్లిష్టత అధికమవుతోంది. వివాహ జీవితం ఎందుకు విఫలమైందని కూడా నిర్దిష్టమైన కారణాలను కూడా చాలా మంది గుర్తించలేకున్నారు. చిన్నచిన్న విషయాలే పెద్దవై ఏకంగా విడాకుల వరకు వెళుతున్నారు. అయితే, కొన్ని అంశాలను ఆరంభంలోనే గుర్తించి సరి చేసుకుంటే బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. వివాహ బంధంలో ప్రతీ ఒక్కరి పరిస్థితి ప్రత్యేకంగా ఉంటుంది. అయితే, ఇటీవలి కాలంలో భార్యభర్తలు విడిపోయేందుకు కొన్ని సాధారణమైన కారణాలు ఉంటున్నాయి. వాటిలో ముఖ్యమైన ఐదు ఇవే.

అలుసుగా తీసుకోవడం

పెళ్లి అయిన కొన్ని రోజుల వరకు సాధారణంగా దంపతులు ఒకరంటే ఒకరు ఇష్టంతో, ప్రేమగా ఉంటారు. అయితే, కొన్నాళ్లకు ఇద్దరిలో ఎవరో ఒకరు జీవిత భాగస్వామిని అలుసుగా తీసుకోవడం సాధారణంగా కనిపిస్తుంటుంది. క్రమంగా ఇష్టం తగ్గినట్టు ప్రవర్తిస్తుంటారు. కావాల్సినంత సమయం ఇవ్వరు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ ఇదే విధంగా మారిపోతారు. జీవిత భాగస్వామిని అలుసుగా తీసుకోవడం, నిర్లక్ష్యం చేయడం వివాహ బంధంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.

మనసు విప్పి మాట్లాడుకోకపోవడం

భార్యభర్తల మధ్య మధ్య మాటలు తగ్గిపోవడం, ఏం అనుకుంటున్నారో ఒకరికి ఒకరు చెప్పుకోకపోవడం విడాకులు దారి తీసే కారణంగా ఉంది. ఈ కమ్యూనికేషన్ లోపం వల్ల అపోహలు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవే గొడవలకు మొదలుగా ఉంటాయి.

నమ్మకం లేకపోవడం

జీవిత భాగస్వాముల మధ్య నమ్మకం లేకపోవడం కూడా విడిపోయేందుకు మరో ముఖ్యమైన కారణంగా మారుతోంది. ఏ బంధంలో అయినా నమ్మకం అనేది చాలా ప్రధానం. ఒక్కసారి నమ్మకం చెదిరితే మళ్లీ సాధారణంగా ఉండడం కష్టమవుతుంది. ఒకవేళ మోసం చేస్తుంటే.. మీ భాగస్వామిని మళ్లీ నమ్మించడం చాలా కష్టం. ఇలా నమ్మకం కోల్పోయిన సందర్భాల్లో బంధం దెబ్బ తింటుంది.

శృంగార జీవితం సరిగా లేకపోవడం

భార్యాభర్తల మధ్య శృంగారం వారి బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఒకరినొకరు మరింత ఎక్కువగా అర్థం చేసుకునేందుకు, ఎఫెక్షన్ పెరిగేందుకు తోడ్పడుతుంది. అయితే, బంధంలో శృంగారం సరిగా లేకపోవడం వల్ల చిరాకుగా, ఒంటరితనంగా అనిపిస్తుంది. శృంగార జీవితం సరిగా లేకపోతే వైవాహిక బంధం చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది.

గృహహింస

విడాకులు ఎక్కువగా అవుతుండేందుకు గృహ హింస కూడా ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. జీవిత భాగస్వామిని శారీరకంగా, మానసికంగా హింసించడం అంతిమంగా ఎక్కువసార్లు విడాకులకు దారి తీస్తుంది. బంధం విడిపోతుందని అనుకున్నా గృహ హింసను ఎక్కువగా కాలం భరించడం సరైన విషయం కాదు. తగిన చర్యలు తీసుకుంటూనే మంచిది.

ఈ పొరపాట్లు వద్దు

వీటితో పాటు ఆర్థిక విషయాలు సహా వివాహం బంధం దెబ్బ తినేందుకు చాలా కారణాలు ఉండొచ్చు. అయితే, ఈ ఐదు ప్రధానమైనవి. అందుకే భార్యాభర్తలు పైన చెప్పిన ఐదు పొరపాట్లు చేయకుండా ఉండాలి. ఒకవేళ ఆ దిశగా తప్పు జరిగితే ముందుగానే గుర్తించి, అపోహలను తొలగించుకోవాలి. వివాదాలు పెద్దవి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరి అభిప్రాయాలను, ఇబ్బందులను మరొకరికి ఎలాంటి దాపురికాలు మనసు విప్పి చెప్పుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.

Whats_app_banner